సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

పోగొట్టుకున్న బిడ్డను తిరిగి ప్రసాదించిన బాబా


అందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తుడిని. నాకు తెలిసిన ఒక సాయిభక్తుని అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. బాబా తమ భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారని, ఆయన తన భక్తులను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారని, ఆయన తమ భక్తుల సుఖదుఃఖాలలో ఎప్పుడూ తోడుగా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసుకున్న కర్మను అనుభవించక తప్పదు. ఇప్పుడు చెప్పబోయే సంఘటన, పై రెండు విషయాలకు నిదర్శనం.

మా కుటుంబ స్నేహితుడు సాయిబాబాకి గొప్ప భక్తుడు. అతను ఏడాది వయస్సున్న తన పాపను ప్రమాదవశాత్తు పోగొట్టుకున్నాడు. అతని కూతురు, వాళ్ళ అమ్మతో తాతగారింట్లో ఉన్నప్పుడు ఒకరోజు కిరోసిన్ త్రాగి చనిపోయింది. ఆ హఠాత్ పరిణామానికి తల్లడిల్లిపోయిన ఆ తల్లి దుఃఖంతో ఆహారం, నీళ్ళు తీసుకోవడం మానేసింది. తన బిడ్డను తీసుకుపోయినందుకు బాబా మీద చాలా కోపంతో ఉంది. ఇకమీదట బాబాను పూజించకూడదని కూడా నిర్ణయించుకుంది. "నేను ఎవరినీ బాధించలేదు, ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. అయినప్పటికీ మాకెందుకీ విపత్తు జరిగింది? అది కూడా సాయి మాతో ఉండగా!?" అని బాధలో కూరుకుపోయింది. మూడురోజుల తరువాత ఒక ఫకీరు వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడాలని చెప్పాడు. మొదట ఆమె సోదరుడు ఆమె ఎవరితోనూ మాట్లాడటానికి గానీ, కలవడానికి గానీ సిద్ధంగా లేదని చెప్పినా, ఆ ఫకీరు వినకుండా ఆమెను కలవాలని పట్టుబట్టాడు. ఆ మాటల అలికిడికి ఆమె బయటకు వచ్చింది. అప్పుడు ఫకీరు ఆమెను ఓదారుస్తూ, "ఈరోజు నుండి సరిగ్గా సంవత్సరం లోపల నీవు సంతానాన్ని పొందుతావు. అది కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తావు" అని చెప్పి వెళ్లిపోయారు. సరిగ్గా ఒక సంవత్సరం లోపల ఫకీరు చెప్పినట్లుగానే ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాడు. కాని ఆమెకు, ఆ కుటుంబంలోని వారికి ఆడపిల్ల కావాలని కోరికగా ఉండేది. సాయి ఆ కోరికను కూడా తీర్చారు. కొన్నాళ్ళకు వాళ్ళకు ఆడపిల్లను కూడా ప్రసాదించారు. అందరూ ఆశ్చర్యపోయేలా ఆ పాప అచ్చం ఇదివరకు చనిపోయిన పాపలాగే ఉంది. ఫకీరు రూపంలో వచ్చి ఆమెను ఓదార్చిన వారు ఖచ్చితంగా శ్రీ సాయిబాబానే అనడానికి ఏ సందేహమూ లేదు. ఈ విధంగా వాళ్ళు పోగొట్టుకున్న పాప వాళ్ళకు తిరిగి వచ్చింది. తన వారిపై బాబా చూపే ప్రేమ, కరుణ ఎనలేనివి. ఏ పదాలతో ఆయనను కీర్తించగలం? అందుకు మౌనమే శరణ్యం.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo