నేను సాయి భక్తుడిని. సాయి అంతటా ఉన్నారని, తన బిడ్డలను సదా కాపాడుతుంటారని నా నమ్మకం. నేనిప్పుడు చెప్పబోయే సంఘటన 2017లో నేను నా కుటుంబాన్ని తీసుకుని శ్రీసోమేశ్వర టెంపుల్‌కు వెళ్తున్నపుడు జరిగింది. ఈ టెంపుల్ యు.ఎస్.ఏలో నార్త్‌కరోలినాలోని పశ్చిమభాగంలో వున్న బ్లూరిడ్జ్ పర్వతప్రాంతాలలో ఉంది. దీన్ని 'పశ్చిమ మౌంట్ కైలాష్'గా కూడా పిలుస్తారు. ఇక్కడి ఆరాధ్యదేవత - శివుడు. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికత తొణికిసలాడుతూ ఉంటుంది. ఇక్కడకు వెళ్లాలంటే అటవీప్రాంతంగుండా చాలాదూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఒక వారాంతంలో నేను నా కుటుంబంతోపాటు శ్రీసోమేశ్వర టెంపుల్‌కు బయలుదేరాను. అక్కడికి వెళ్లే మార్గం అంతగా తెలియనప్పటికీ GPS(The Global Positioning System: ఏమాత్రం తెలియని క్రొత్తప్రాంతంగుండా ప్రయాణిస్తున్నప్పుడు గమ్యాన్ని చేరుకోవడంలో GPS ఎంతగానో సహకరిస్తుంది.)ని ఆధారంగా చేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాము. కొంతసేపటికి దట్టమైన అటవీప్రాంతంలోకి చేరుకున్నాక దారి తప్పిపోయాము. ఎలా గమ్యం చేరుకోవాలో తెలియనిస్థితిలో అనుకోకుండా మా కారు మంచు, నీరు కలిసిన ఒక లోతైన బురదలో దిగబడిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ఆ బురదనుండి బయటకు రాలేదు. ఎవరినైనా సహాయం అడుగుదామన్నా అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. కనీసం అత్యవసర హెల్ప్‌లైన్‌కి గాని, నా భీమాసంస్థకు గాని కాల్ చేద్దామంటే నెట్‌వర్క్ కూడా లేదు. ఏమి చేయాలో అర్ధంకాని నిస్సహాయస్థితిలో ఆర్తిగా బాబాను ప్రార్థించాము. మరుక్షణంలో, ఎక్కడినుండి వచ్చాడోగాని ప్రత్యక్షమైనట్లు మూడు కుక్కలతోపాటు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన మా కారు దగ్గరకి వచ్చి, "మీరు కారులో కూర్చోండి. నేను కారు తోస్తాను" అని చెప్పారు. తరువాత ఆయన కేవలం కారు తాకారు.. అంతే! కారు బురదలోనుండి బయటకు వచ్చింది. నేను కారు దిగి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, "మేము మౌంట్ సోమ టెంపుల్ దర్శనం కోసం వెళ్తున్నాము. కానీ ఈ అడవిలో దారి తప్పిపోయాం. అక్కడికి ఎలా చేరుకోవాలో మీరు చెప్పగలరా?" అని అడిగాను. ఆయన ఒక త్రోవవైపు చూపిస్తూ, "ఆ మార్గంగుండా వెళ్ళండి. నేరుగా మౌంట్ సోమ టెంపుల్ ద్వారం దగ్గరకు చేరుకుంటారు" అని చెప్పారు. తరువాత మేము ఆయన చూపిన మార్గంలో వెళ్లి మౌంట్ సోమ టెంపుల్ చేరుకొని సోమేశ్వరుని దర్శనం చేసుకున్నాము. ఆ నిర్మానుష్యమైన అడవిలో బాబాను ప్రార్థించగానే మూడు కుక్కలతో వచ్చి మాకు సహాయాన్ని అందించిన ఆ వ్యక్తి(దత్తావతారి) ఖచ్చితంగా బాబాయే అని నా నమ్మకం. బాబాను స్వయంగా చూసిన అద్భుత అనుభవమది. "బాబా! ఆజన్మాంతం మరిచిపోలేని అనుభవాన్ని ఇచ్చారు. చాలా చాలా కృతజ్ఞతలు".
Jai sai ram
ReplyDeleteOn sairam
ReplyDeleteOm sairam
ReplyDeleteOm sai Sri sai jaya jaya sai
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me