సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

పెళ్ళి అయినప్పటినుండి తల్లి, తండ్రి అయిన బాబా


అందరికీ నమస్కారం. నా పేరు రత్నమ్మ. నాకు చదువు రాదు. మా పుట్టింటివాళ్ళు పేదవాళ్ళుకనుక నన్ను చదివించలేదు. చిన్నప్పటినుంచి నాకు బాబా అంటే ఎంతో ప్రేమ. ఏ పని చేస్తున్నా బాబాని తలచుకుంటూ ఎల్లప్పుడూ ఆయన స్మరణలోనే ఉండేదాన్ని. పెళ్లీడు వచ్చాక నా తల్లిదండ్రులు వయసులో నాకన్నా చాలా పెద్దవ్యక్తితో నా వివాహం జరిపించారు. అంతటితో వాళ్ళ బాధ్యత తీరిపోయింది. కానీ అత్తవారింట అడుగుపెట్టిన నాటినుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. పుట్టింటినుంచి మెట్టినింటికి పంపించి తల్లిదండ్రులు తమ భారం దింపుకున్నారేమోగానిమెట్టినింట కాలుమోపిన క్షణంనుండి నా సాయిదేవుడు నా భారాన్నినా బాధ్యతలను మోసాడు. తల్లిగాతండ్రిగా నా బాధ్యతను స్వీకరించాడు. అత్తగారింట నేను ఒంటరినన్న భావన కలగగానే, "నేను నీకు అండగా ఉన్నాను కదా!" అని బాబా అంటున్నట్లుగా భావన మనసులో మెదులుతుండేది.

పెళ్లయినప్పటినుండి మాఇంటి పక్కనే ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి నాకు వీలైనంతలో సేవ చేసుకునేదాన్ని. అయితేనాకు పెళ్లయిన నాలుగు సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. ఆ కారణంగా ఇంట్లోవాళ్లే కాకుండా బయటవాళ్లు కూడా సాధించడం మొదలుపెట్టారు. నేను పడిన వేదన వర్ణనాతీతం. బాబా నాకు తల్లిని అయ్యే యోగం కలిగించకపోతాడా అన్న ఆశతో ఉండేదాన్ని. ఇంట్లోవాళ్ళ పోరు భరించలేక ప్రతిరోజూ బాబా వద్దకు వెళ్లి, "బాబా! నాకెందుకింత కష్టం ఇచ్చావుఇన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదని అందరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారు. నాకసలు తల్లినయ్యే భాగ్యం ఉందాలేదా?" అని ఏడుస్తూ నా బాధని బాబాకి చెప్పుకునేదాన్ని. ఒకరోజు ఆ గుడికి వచ్చే ఒక సాయిబంధువు, "శిరీడీ వెళ్లి సాయి దర్శనం చేసుకునివస్తే పిల్లలు పుడతారు" అని చెబితే నేనుమావారు కలిసి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాము. నా మనసులోని బాధనంతా బాబాకు విన్నవించుకొని బాబా ముందు నిలబడ్డాను. సాయి మన దేవుడు కదా! నా తండ్రి కదా! నన్ను తన దగ్గరకు తీసుకుని, "బాధపడకు! నీ కోరిక తీరుస్తానులే!" అని అన్నట్లుగా అనుభూతి కలిగింది. ఆయన దివ్యదర్శనంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాము.

ఇంటికి వచ్చిన నెలరోజులకే బాబా నన్ను అనుగ్రహించాడు. నేను తల్లిని కాబోతున్నానని తెలిసింది. ఇక నా సంతోషానికి అవధుల్లేవు. మూడవనెలలో ఒకరోజు కలలో బాబా దర్శనమిచ్చారు. కలలో నేనొక అరణ్యంలో ఉన్నాను. బాబా నా ఎదుట నిలిచి, "ఎందుకమ్మా ఇంకా బాధపడుతున్నావునేను నీకు మగబిడ్డను ప్రసాదించాను. నీవు సంతోషంగా ఉండు. నీ బాధలన్నీ తొలగిపోయాయి. నీ భారం నాదే!" అని చెబుతూఅరణ్యంలో ఉన్న నన్ను మా ఇంటివద్ద వదిలి వెళ్లిపోయారు. అప్పటినుండి నా కష్టాలన్నీ తొలగిపోయాయి. ఐదవనెల వచ్చాక సీమంతం చేసుకోవాలని నా మనసులో కోరిక ఉండేది. కానీ మా పుట్టింటివాళ్లకు అంత స్తోమత లేనందువలన నా కోరికను అలానే నా మనసులోనే ఉంచుకున్నాను. కానీ నేను నా పెళ్ళైనప్పటి నుండి బాబా గుడిలో సేవ చేస్తున్న కారణంగానోలేక బాబా ప్రేరణో గాని ఆలయ కమిటీవాళ్ళు ఒకరోజు నన్నుమావారినిఅత్తగారిని పిలిచి బాబా ఎదుట నాకు సీమంతం చేశారు. బాబా నా తండ్రి స్థానంలో ఉండి పుట్టింటివాళ్ళు చేసేటువంటి కార్యాన్ని తాను పూర్తిచేశారు. పెళ్ళైనప్పటినుండి బాబాయే తల్లితండ్రి అయ్యారని ముందే చెప్పాను కదా! ఇంతకన్నా మహాభాగ్యం ఇంకేముంటుంది? తరువాత బాబా చెప్పినట్లుగానే నేను ఒక మగబిడ్డకు జన్మనిచ్చాను. బాబా పేరే పెట్టుకున్నాను. నా సాయిదేవుడు తండ్రిలాగా నా జీవితంలో అడుగడుగునా అండగా ఉంటూ నన్ను కాపాడుతున్నాడు. బాబా నా తోడు ఉన్నంతవరకు నేను ఎప్పటికీ ఒంటరిని కాదు. ఆయన మీద అనన్యమైన భక్తి ఉంటే చాలుఅంతా బాబానే చూసుకుంటారు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo