1962వ
సంవత్సరంలో పి.కమల్ గోరె గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఆమె సోదరి తనతో
పాటు శిరిడీ రమ్మన్నారు. ఆమె దాదర్ బస్టాండుకు వెళ్ళి 12
గంటల బస్సుకోసం వేచిచూడసాగింది. కానీ, బస్సు వచ్చే సూచనలు
కనపడలేదు. 3 గంటలసేపు వేచిచూసినప్పటికీ బస్సు రాలేదు. అయినా కూడా ఆమె వేచిచూస్తూనే ఉంది. శిరిడీ వెళ్తున్నామన్న ఉత్సాహంతో
అక్కడనుంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు. చివరికి ఒక
బస్సు వచ్చింది కాని, అక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది.
"బస్సు ఎందుకు ఆగలేద"ని ఆమె కౌంటర్‌లో విచారించగా, "ప్రయాణీకులు ఎవరూ ఇక్కడనుండి సీటు రిజర్వు చేసుకోనందున
ఇక్కడ ఆగకుండా వెళ్ళింద"ని చెప్పారు. ఆమె తన మనస్సులో, "బాబా! నేను శిరిడీ రావడం మీకు ఇష్టం లేకపోతే, నన్ను
తనతోపాటు రమ్మని పిలవాలని నా సోదరికి ఎందుకు ఆలోచన కలిగించారు?" అని అనుకుని శిరిడీకి ఇంకొక బస్సు లేనందున నిరుత్సాహంగా ఇంటికి తిరిగి
వెళ్ళిపోదామని అనుకుంది. అంతే! మరుక్షణంలో కాసేపటి
క్రితం ఆగకుండా వెళ్ళిపోయిన బస్సు, ఆశ్చర్యంగా తిరిగి వచ్చింది. కండక్టర్
బస్సు కిటికినుంచి తల బయటకు పెట్టి, "అమ్మా!
చింతించకండి, ఈ బస్సు మీరు లేకుండా ముందుకు వెళ్ళదు" అని
అన్నాడు. ఆశ్చర్యపోతూనే కమల్ గారు బస్సు ఎక్కేసరికి అన్ని సీట్లలోనూ ప్రయాణీకులు
కూర్చొని ఉన్నారు. ఇంతలో ఇద్దరు ప్రయాణీకులు లేచి వాళ్ళ సీటు ఆమెకు ఇచ్చారు.
కొంతమంది ప్రయాణీకులు వచ్చి ఆమె పాదాలు తాకి నమస్కరించుకున్నారు. ఆమె ఏమి
జరుగుతుందో అర్ధంకాని అయోమయస్థితిలో ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అప్పుడు కండక్టర్,
"బస్సు రుయియా కాలేజీ దాకా వెళ్ళింది. ఇంతలో డ్రైవర్‌కు, "బస్సును
తిరిగి దాదరుకు తీసుకొని వెళ్ళు, అక్కడ నా భక్తురాలు వేచి
ఉంది" అని ఒక గొంతు వినిపించింది. ఇలా రెండుసార్లు
వినపడిన తరువాత మూడవసారి స్పష్టంగా, "ఇంతకుమించి
బస్సు ముందుకు వెళ్ళిందా, బస్సు ఘోర ప్రమాదానికి
గురవుతుంద"ని వినిపించింది. అప్పుడు డ్రైవరు ప్రయాణీకులను
సంప్రదించగా,
వాళ్ళందరూ కలిసికట్టుగా బస్సు దాదర్‌కు తిరిగి వెళ్లాల్సిందిగా
చెప్పారు. అందువలనే బస్సు మిమ్మల్ని
ఎక్కించుకోవడానికి తిరిగి వచ్చింది" అని
చెప్పాడు.
సోర్స్: శ్రీసాయి సాగర్
మ్యాగజైన్ దీపావళి సంచిక 2005.
🕉 sai Ram
ReplyDelete