సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సచ్ఛరిత్ర పారాయణ - ఏడు సంవత్సరాల బాధకు ముగింపు




నా పేరు శరవణన్ రవి. మాది తమిళనాడు. నేనిప్పుడు ఒక గొప్ప సాయిలీలని మీతో పంచుకుంటాను. మా కజిన్ వెల్లూరు సమీపంలోని ఒక మారుమూల గ్రామంలో ఉంటోంది. ఆమెకు పెళ్ళై ఏడేళ్ళు అవుతున్నా సంతానం లేదు. వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. దేశమంతటా తిరిగి అన్నిరకాల ప్రయత్నాలు చేశారు కానీ, ఎటువంటి ఫలితం కనపడలేదు. చివరి ఆశగా ఆయుర్వేదవైద్యాన్ని కూడా ఆశ్రయించారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. దానితో ఆమె, ఆమె పేరెంట్స్ చాలా కృంగిపోయారు. 2018, నవంబర్ నెల, రెండో వారంలో ఒక రోజు మధ్యాహ్నం మా కజిన్ వాళ్ళ నాన్నగారు(నాకు మామ) మా ఇంటికి వచ్చారు. తన కూతురు పరిస్థితి గురించి దిగులుపడుతూ నా ముందు ఏడ్చేశారు. నేను ఆయన్ని ఓదారుస్తూ, "ఆశ వదులుకోకండి, బాబాను ప్రార్థించండి. ఆయన తప్పక కరుణిస్తారు" అని చెప్పాను. అలా చెప్తూ ఉండగా నాకో విషయం గుర్తొచ్చింది. అదేమిటంటే, ఆరోజు ఉదయాన నేను పూజ గదిలోకి వెళ్లి సాయిబాబాను ప్రార్థిస్తూ ఉండగా అక్కడ రెండు సచ్చరిత్ర పుస్తకాలు ఉండటం చూసాను. నిజానికి మా ఇంట్లో ఎప్పుడూ ఒక పుస్తకమే ఉంటుంది. ముందురోజు కూడా ఒక పుస్తకమే ఉంది. అలాంటిది ఆ రెండో పుస్తకం అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. వెంటనే నేను పూజగది లోపలికి వెళ్లి ఆ సచ్చరిత్ర పుస్తకాన్ని తీసుకొచ్చి మా మామ చేతిలో పెట్టి, "మామా! ఈ పుస్తకాన్ని మీ అమ్మాయికిచ్చి, ప్రతిరోజూ ఉదయాన్నే త్వరగా లేచి, స్నానం చేసిన తరువాత బాబా ముందు దీపం వెలిగించి, దీన్ని పారాయణ చేయమని చెప్పండి. బిడ్డ పుట్టాక పుస్తకాన్ని తిరిగివ్వండి" అని చెప్పాను. ఈ మాటలు చెప్పేసరికి అతని కళ్ళనిండా నీళ్ళు నిండిపోగా, "ఇదే మా చివరి ఆశ" అన్నారు. నేను "సాయి మనల్ని వదిలిపెట్టరు. పూర్తి విశ్వాసముంచి  శ్రద్ధ, సహనాలతో రోజూ పారాయణ చేయండి" అని చెప్పాను. మా అమ్మాయి నేను చెప్పినట్లే పారాయణ మొదలుపెట్టింది. అందరూ ఆశ్చర్యపడేలా 2018, డిసెంబర్ 6వ తేదీన 'మా కజిన్ గర్భవతి' అని నాకు ఫోన్ వచ్చింది. తను పారాయణ మొదలుపెట్టి ఇంకా నెల కూడా కాలేదు.  ఏడు సంవత్సరాలుగా తాను అనుభవిస్తున్న బాధ ఒక్క నెలలో తీరిపోయింది. ఇది సాయి చేసిన అద్భుతం! కనీసం తను పుస్తకం మొత్తం పూర్తి చేయలేదు, అంతలోనే ఫలితం దక్కింది. ఇప్పుడు ఆమె తన పారాయణ కొనసాగిస్తూ ఉంది. సాయి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నారు. ఆయన లీలలు విశ్వవిఖ్యాతం. "బాబా! మీకు నా ప్రణామాలు. అందరికీ శాంతిని చేకూర్చండి".

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo