దీపావళి అనగానే సాయి భక్తులకు గుర్తుకు వచ్చేది.. బాబా తమ చేతిని ధునిలో ఉంచి, దూరాన కొలిమిలో పడబోతున్న పసిబిడ్డని రక్షించిన లీల. ఈ లీల బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని, కరుణను తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఆ సాయిలీలను మరొక్కసారి మనసారా స్మరించుకుందాం..
1910వ సంవత్సరం దీపావళి పండుగ ముందురోజున బాబా ధునివద్ద కూర్చుని చలి కాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపయిన తరువాత బాబా హఠాత్తుగా కట్టెలకు బదులు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి. మంటలకు బాబా చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని చూసి వెంటనే బాబా వైపుకి పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుముని పట్టుకుని బలముగా వెనక్కు లాగెను. "దేవా! ఇట్లేల చేసితిరి?" అని అడిగిరి. (మరేదో లోకంలో ఉండినట్లుండిన) బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని, "ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమిని ఊదుచుండెను. ఇంతలో ఆమె భర్త పిలచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలింది, అది నాకు అంత బాధాకరం కాదు. కానీ బిడ్డ రక్షింపబడెనను విషయము నాకు ఆనందము కలుగజేయుచున్నది" అని జవాబిచ్చెను.
కాలిన బాబా చెయ్యి చూసి బాధతో కన్నీళ్లు కారుస్తున్న తాత్యాతో, "అరే! ఎందుకురా ఏడుస్తావ్? మండుతున్న రెండువేల పిడకలబట్టీ పైన ఈ శరీరాన్ని కాలుస్తున్నా చలించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి" అన్నారు శ్రీ సాయి.
ప్రతిరోజూ ఉదయాన్నే భాగోజీషిండే కాలిన బాబా చేతికి నేతితో మర్దన చేసి కట్టుకట్టేవాడు. బాబా మహాసమాధి పర్యంతం అతను ఆ సేవ చేసుకున్నాడు.
ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏