శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
కొప్పోలు బాబా మందిరం |
నా పేరు శ్రీకాంత్. మా ఊరు ప్రకాశంజిల్లాలోని కొప్పోలు. నేను మా ఊరిలోని బాబా మందిరంలో నాలుగు సంవత్సరాలుగా వాలంటీర్‌గా ఉంటున్నాను. నాకు బాబాతో చాలా అనుబంధం వుంది. నన్ను దగ్గరకి లాక్కున్నది కూడా ఆయనే. ఒకరోజు స్వప్నంలో బాబా దర్శనమిచ్చారు. ఆ కలలో బాబా నా వద్దకు వచ్చి, నన్ను తనకి స్నానం చేయించమన్నారు. అప్పటినుంచి మొదలుపెట్టి ఇప్పటికీ ప్రతిరోజూ బాబాకి అభిషేకం చేస్తున్నాను. అలా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. నేనే రోజూ బాబాకి స్నానం, అలంకారం చేస్తాను. అక్కడి పంతులుగారు నన్నే చేయమంటారు. అలా రోజూ చేస్తూ ఉండగా, ఒకరోజు మందిరంలో ఎవరూ లేరు. బాబా, నేను మాత్రమే వున్నాము. అప్పుడు "ఏమిటిరా, ఎలా ఉన్నావు?" అని మాటలు వినిపించాయి. ముందు నాకు అర్థంకాక వాయిస్ ఎక్కడనుంచి వస్తోందని అటు ఇటు చుట్టూ చూస్తూ, బాబా వైపు చూసి భయపడిపోయాను. ఆయన డైరెక్ట్‌గా నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కాళ్ళు కదిలిస్తూ ఉన్నారు. ఆయన ముఖంలోని తేజస్సు చూడలేకపోయాను. నిజంగా దేవుడు మనకి ఎదురుపడితే చూడలేము కదా! అప్పడు నేను బాబాతో, "నాకు భయం వేస్తోంది తాతా" అని అంటే, బాబా "మళ్ళీ మళ్ళీ నీకిలా కనిపించలేను" అని అన్నారు. అయినా కూడా నా వల్ల కాలేదు బాబాని చూడటం. ఆ తరువాత చాలా అనుభవాలు కలిగాయి. నేనేది కావాలని అడిగినా నాకు చేసేవారు.
ఒకసారి నా ఫ్రెండ్ స్వరూప్ తను బాబా సమాధిని తాకానని చెప్పాడు. నేను 3 సార్లు శిరిడీ వెళ్లినా సమాధిని తాకనివ్వలేదు. ఆ విషయమై, "బాబా! నేనేం తప్పు చేశాను, నన్ను నీ సమాధి తాకనివ్వలేద"ని పడుకునే ముందు బాబాని అడిగాను. అంతే! హఠాత్తుగా నా కళ్ళ ఎదుట దృశ్యం మారిపోయి నేను శిరిడీలో బాబా పాదాల చెంత వున్నాను. అప్పుడు బాబా, "నీ స్థానం ఇది, నా పాదాల దగ్గర. ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినంతసేపు సమాధిని తాకు, నీకెవరూ అడ్డు చెప్పరు" అన్నారు. నేను సంతోషంతో ఏడుస్తూ ఉన్నాను. అది కల అనుకుందామంటే కల కాదు. ఎందుకంటే, నేనప్పటికింకా పడుకోలేదు. బాబాని ప్రార్థిస్తూ ఉండగానే ఆ దర్శనం జరిగింది. కనులు తెరిచేసరికి ఆ దర్శనానందంలో ఏడుస్తూనే ఉన్నాను. అప్పటి నా పరిస్థితి చూడండి, అడిగీ అడగంగానే నన్ను ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఏమని చెప్పను నా భాగ్యాన్ని! అసలు ఆ సన్నివేశాన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియడం లేదు. ఆయన నాపై అంత కరుణ చూపారు. సమస్త భువనాలను పాలించే సాయికి శిరస్సువంచి నమస్కరించడం తప్ప నేనేం చేయగలను?
Sairam
ReplyDeleteYou are so blessed!
ReplyDelete🕉 sai Ram
ReplyDeleteUnbelievable, you are so blessed Sai!!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me