సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నా పెళ్లి ఎవరితో జరగాలన్నది బాబా ముందుగానే నిశ్చయించారు ....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి


నెల్లూరు నుండి సాయిబంధువు వినీలగారు తన అనుభవాల్ని మనతో ఇలా పంచుకుంటున్నారు..

నేను ఇంటర్ చదువుతున్నప్పుడు తీవ్రమయిన నడుమునొప్పితో బాధపడుతూ ఉండేదాన్ని. నెల్లూరులో ఉన్న అన్ని హాస్పిటల్స్ తిరిగాను. డాక్టర్లందరూ, "సమస్య ఏమీ లేదు, అంతా బాగానే ఉంద"నే చెప్పేవారు. కానీ నాకు ఆ నొప్పి అలానే ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు బాబా మందిరంలో బాబా ముందు కూర్చొని నా బాధంతా ఆయనతో చెప్పుకుంటూ ఉన్నాను. అదే సమయంలో అక్కడ ఎవరో బాబాకి సంబంధించిన పుస్తకాలు పంచుతూ ఉన్నారు. పుస్తకమే కదా ఇస్తున్నారని నేను కూడా ఒకటి తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక పుస్తకం తెరిచి చూస్తే, "ఒక వారంపాటు - గురువారం నుండి గురువారం వరకు - మీ కోరికని ఈ పుస్తకంలో వ్రాసి, తరువాత మందిరంలో ప్రసాదంతోపాటు పుస్తకాన్ని కూడా పంచాలి" అని ఉంది. "బాబా! నాకు ఈ నడుమునొప్పి సమస్య ఎలా అయినా తగ్గించండి" అని వ్రాయడం మొదలుపెట్టాను. తరువాత గురువారంనాడు ప్రసాదం పంచిపెట్టి, పుస్తకంలో చెప్పినట్లుగానే చేశాను. బాబా ఏమి మాయ చేసారో గాని ఆరోజు నుండి ఆ సమస్య నాకు మళ్ళీ రాలేదు. బాబా నాపై చూపిన ప్రేమకి నాకు చాలా సంతోషంగా అనిపించింది.

మరో అనుభవం:

నా పెళ్లి కాకముందు ఒకసారి నేను, మా చెల్లి ఇద్దరం కలిసి బాబా మందిరానికి వెళ్ళాము. అక్కడ అర్చన చేయించుకునేటప్పుడు నాతోపాటు మా అమ్మ, నాన్న, మా ఇద్దరు చెల్లెళ్ళ పేర్లు వ్రాసి ఇచ్చాము. అక్కడ చాలామంది ఉండడంతో నేను, మా చెల్లి ఒక దగ్గర కూర్చున్నాం. అర్చన అయ్యాక పూజారిగారు అందరి పేర్లు చదివి ప్రసాదం ఇస్తున్నారు. కానీ మాది చదివేటప్పుడు, "వినయ్ వినీల ఎవరమ్మా? వచ్చి ప్రసాదం తీసుకోండి" అన్నారు. నేను, నా చెల్లి ఇద్దరం, "ఇదేమిటి ఇలా అన్నార"ని షాక్ అయ్యాము. ఎందుకంటే నిజానికి నేను అర్చన చీటిలో వినయ్ అన్న పేరు వ్రాయలేదు. అక్కడ పూజారి అలా చదివారు. అప్పటికి కనీసం నా పెళ్లి కుదరలేదు కూడా. కానీ తరువాత మా బావ అయిన వినయ్‌తోనే నా వివాహం జరిగింది. అప్పుడు నాకర్థమయ్యింది, నా పెళ్లి వినయ్‌గారితో జరగాలని బాబా ముందుగానే నిశ్చయించారని, ఆరోజు మందిరంలో ప్రసాదం ఇస్తూ నాకు కాబోయే భర్త పేరు ప్రస్తావిస్తూ నన్ను దీవించారని.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo