సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి నామజపంతో తీవ్రమైన దగ్గు నుండి ఉపశమనం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

UK నుండి శిరిడీ సాయిబంధువు సుబ్బు తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.

ప్రియమైన సాయిబంధువులందరికీ జై సాయిరామ్! హెతల్ గారి ఇంగ్లీష్ బ్లాగ్ లో సాయి భక్తుల అనుభవాలు చదవకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందే అవి చదువుతాను. గత 5 సంవత్సరాలుగా ఇది నా అలవాటు. మన ప్రియమైన బాబా తన భక్తులపట్ల ఎంతటి దయ చూపుతారో వర్ణించలేము. బాబా ప్రేమతో నిండిన కొన్ని అనుభవాలను చదువుతూ ఉంటే నా హృదయం పులకరించిపోతుంది.

నేను నా భార్య, 4 సంవత్సరాల కూతురితో లండన్లో నివసిస్తున్నాను. నా జీవితమంతా బాబా ఇచ్చిన బహుమతి అని మనసారా చెప్తాను. అన్ని సందర్భాలలో బాబా నాకు తోడుగా ఉంటూ నా చేయి పట్టి నడిపించారు. వీసా, మొదటి ఉద్యోగం, రెండవ ఉద్యోగం, కూతురు మొదలైన సాధారణ విషయాలలో కూడా నాకు ఎంతో సహాయం చేశారు. మన ప్రియమైన బాబా నన్ను, నా కుటుంబాన్ని కాపాడిన అనేక అనుభవాలు నాకు ఉన్నాయి. వాటిలో ఈమధ్య జరిగిన చిన్న అనుభవం ఇప్పుడు మీకు చెప్తాను.

నా భార్య తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ ఉంది. చెప్పాలంటే ప్రతి 5 నిమిషాలకి ఒకసారి దగ్గు వస్తూ ఉండేది. ఈ కారణంగా ఆమె ఛాతీ చాలా బలహీనంగా ఉందని ఆమె ఫిర్యాదు చేసింది. మేము రోజూ ఊదీ నీరు త్రాగుతూ ఉన్నా దాని ప్రభావం ఏమీ కనిపించలేదు. ఇలా 2 రోజులు కొనసాగింది. నా భార్య దగ్గు మూలంగా సరిగా నిద్రపోకపోవడం వలన రెండవ రోజు రాత్రి నాకు చాలా అలసటగా ఉండటంతో నేను సుమారు 10గంటలకి నిద్రకు ఉపక్రమించాను. అలసట వలన వెంటనే నిద్రపోయాను. నా భార్య దగ్గుతుండటం వలన అకస్మాత్తుగా 12:45 గంటలకు మెలకువ వచ్చింది. తన పడుతున్న కష్టం చూసి నాకు చాలా బాధగా అనిపించింది. తక్షణమే సాయి నామ జపం చేయడం మొదలుపెట్టి, "తన దగ్గు కంట్రోల్ అయ్యి తను నిద్రపోయేలా చూడండి బాబా!" అని వేడుకున్నాను. "బాబా! నేను తనకి ఏ సహాయం చేయలేను. మీరే ఏదో ఒకటి చేయండి" అని వేడుకున్నాను. 1:10 వరకు ఆపకుండా నామజపం చేస్తూనే ఉన్నాను. నెమ్మదిగా ఆమెకి దగ్గు ప్రతి 5 నిమిషాలకు బదులు 10 నిమిషాలకి రావడం జరిగింది. ఆపై 1:30కి పూర్తిగా దగ్గు రావడం ఆగిపోయింది. ఆమె వెంటనే నిద్రలోకి జారుకొని హాయిగా నిద్రపోయింది. కొన్ని నిమిషాలలో బాబా తనకి నయం చేసేసారు. నా భార్య యొక్క దగ్గును నయం చేసినందుకు కృతజ్ఞతా భావంతో నా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి.

 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

2 comments:

  1. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని మనసారా పలికిన బాధలు తీరును 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo