శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
నేను గత 14 సంవత్సరాలుగా సాయి భక్తుడిని. ఇన్ని సంవత్సరాలలో ఎన్నో సాయిలీలలను పొంది ఉన్నాను. నేను చాలాసార్లు శిరిడీ వెళ్లి నా ప్రియమైన సాయి ఆశీస్సులు పొందాను. సాయి నాకు సహాయం చేసి, సరైన మార్గంలో నన్ను మార్గనిర్దేశం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆయన ఎల్లప్పుడూ తన భక్తులకు తోడుగా ఉంటారు. హృదయపూర్వకంగా ప్రార్థించే వారికి తన సహాయాన్ని అందించడానికి సదా సిద్ధంగా ఉంటారు.
ప్రతి సంవత్సరం నా భార్య సంవత్సరీకం రోజున కొంతమంది పేదలకు డబ్బులు గాని, స్వీట్స్ గాని పంపిణీ చేయడం నాకు అలవాటు. అలాగే 1988, జూన్ 11న నా భార్య సంవత్సరీకం వచ్చింది. నేను ఆ సమయంలో కొత్తగా బొంబాయి వచ్చి ఉండడంతో అర్హత కలిగిన సరైన వ్యక్తిని ఎక్కడనుండి తీసుకురావాలో నాకు అర్థం కాలేదు. ఆ విషయమై, "బాబా! నా ఈ సమస్యకు పరిష్కారం చూప"మని బాబాను ప్రార్థించాను. ఎప్పటిలాగానే అలవాటు ప్రకారం ఆరోజు ఉదయం వాకింగ్ కి వెళ్లి అదే సమస్య గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఎదురుగా ఒక సాధువు నావైపే వస్తూ ఉండటం చూశాను. అతను నా దగ్గరికి రాగానే నేను అతనికి రూ. 10 / - ఇవ్వగా, అతను సంతోషంగా స్వీకరించి, "బిడ్డా, నేను హరిద్వార్ వెళ్తున్నాను" అని చెప్పి నన్ను ఆశీర్వదించారు. నేను అతనికి డబ్బు ఇచ్చిన కారణం చెప్పగా, అతను "నీకు ఎంతమంది పిల్లలు?" అని అడిగారు. నేను "నాకు ఒక్క కొడుకు మాత్రమే" అని చెప్పగా, "నీ కొడుకు నీ వృద్ధాప్యంలో నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, నీవు దిగులుపడవలసిన అవసరంలేదు" అని చెప్పాడు. నా చేతిలో ఇంకా డబ్బులు ఉన్నప్పటికీ, అతను ఇంక ఒక్క పైసా అయినా అడగకుండా క్షణకాలంలో అదృశ్యమైపోయాడు. ఆ సమయానికి ముందుగాని, తరువాతగాని వేరే ఏ సాధువూ నాకు కనిపించలేదు. నేను రోజూ ఉదయం అదే మార్గంలో వాకింగ్ కి వెళ్తూ ఉంటాను. కానీ ఏరోజూ కూడా నేను సాధువులను చూడలేదు. అతను ఖచ్చితంగా నా బాబాయే. ఆ రూపంలో వచ్చి నా సమస్యను పరిష్కరించేశారు. నేనెంతటి అదృష్టవంతుడినో, గురువారంనాటి ఉదయాన సాధువు రూపంలో సశరీరులుగా దర్శనం ఇచ్చారు బాబా!
జై గురు దత్త సాయి! మీకివే నా శతకోటి ప్రణామాలు.
లియుల్ దేవి శరణ్ కోహ్లీ,
బాంబే 400 092.
(మూలం: శ్రీసాయిలీల పత్రిక, నవంబర్ 1988)

🕉 sai Ram
ReplyDelete