సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా పద్ధతులు మన ఊహకి అందవు.


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి


ఒక అజ్ఞాత సాయి భక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. 

సాయి బంధువులందరికి నమస్కారం. శిరిడీ వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు నుంచి చాలా చికాకుగా జీవితంపై ఆశ, విశ్వాసం కోల్పోయి బాగా కృంగిపోయి ఉన్నాను. నా పాప కర్మల నుండి నన్ను విముక్తుడిని చేయడానికి బాబా నాకు సహాయం చేస్తున్నారని నాకు తెలిసినా కూడా అంతటి బాధ భరించడం నాకు చాలా కష్టంగా అనిపించేది. సరిగ్గా ఇదే సమయంలో బాబా నన్ను శిరిడీకి పిలిచారు. అక్కడికి వెళ్లి వచ్చాక  నన్నెందుకు శిరిడీ పిలిచారో నాకర్ధం అయింది. చాలామంది సాయిభక్తులు నా ద్వారా వారి యొక్క ప్రార్థనలు సాయికి విన్నవించమని చెప్పారు. ఇంతకు ముందు కూడా నేను శిరిడీ యాత్రలు ఈ కారణం చేతనే చేశాను.

ఎప్పుడు నేను శిరిడీ వెళ్లి వచ్చినా అక్కడ నుండి తెచ్చిన బాబా ప్రసాదాన్ని ఇక్కడ మందిరంలో పంచడం నాకు అలవాటు. ఆ అలవాటు ప్రకారం ఒకరోజు సాయంత్రం మందిరానికి వెళ్ళాలనుకుంటే ఆరోజు పెద్ద వర్షం రావడంతో వెళ్ళలేక పోయాను. మరునాడు ఉదయాన్నే వెళ్లాలనుకున్నాను కానీ ప్రయాణం చేసిన అలసట వల్ల ఆలస్యంగా నిద్ర లేవడంతో మందిరానికి 9గంటలకి చేరుకున్నాను. అక్కడ మందిరం దగ్గరలో ఒక వృద్ధ మహిళ బిక్ష చేస్తూ ఉంటుంది. నేనెప్పుడు అక్కడికి వెళ్ళినా ఆమెతో మాట్లాడుతూ ఉంటాను. ఆరోజు నేను ఆమెకి ప్రసాదమివ్వగానే ఆమె చాలా భావోద్వేగానికి లోనై "సాయిబాబా ఒక్కడే నాకు దిక్కు, ఆయనే నన్ను సదా తన బిడ్డలా రక్షిస్తూ ఉన్నార"ని ఏడ్చేసింది. ఆమె ఒక అనాథ, ఒంటరిగా మందిరం ప్రాంగణంలోనే ఉంటూ ఉంటారు. దానితో నాకు ఇప్పటివరకు తానేమిచ్చారో, నాకెంతటి సౌకర్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చారో నాకు అర్ధమయ్యేలా చేసారు బాబా.

తరువాత మందిరంలో నేను ప్రసాదం పంచుతుండగా ఒక అంకుల్ నా దగరకి వచ్చి ప్రసాదం తీసుకొని, నేనొక బాబా ఫోటో ఇస్తే అతను ఇంకొక బాబా ఫోటో ఇవ్వమని అడిగారు. మళ్ళీ కాసేపటికి ఆయనే వెనుకకి వచ్చి “నా భార్యపిల్లలు ఈరోజు శిరిడీ లో ఉన్నారు, కొన్ని కారణాల వలన నేను వెళ్ళలేక పోయానని అందుకే ఇక్కడికి వచ్చి బాధతో బాబాని ప్రార్ధిస్తూ ఉన్నాను, కానీ బాబా ఎంతలా అనుగ్రహించారో చూడండి నేను శిరిడీ వెళ్ళలేక పోయినప్పటికీ మీరిచ్చిన ఈ ఫోటో రూపంలో దర్శనం ఇచ్చి, శిరిడీ ప్రసాదం కూడా ఇచ్చారు“ అని చాలా సంతోషంగా చెప్తూ నాకు కృతఙ్ఞతలు చెప్పారు. ఆ మాటలు చెపుతున్నప్పుడు అతని ముఖంలో కనపడిన ఆనందాన్ని నేను మరిచిపోలేను.

బాబా పద్ధతులు మన ఊహకి అందవు. ఒకవేళ నేను ముందు రోజు కాని, ఆరోజు ఉదయాన త్వరగా వెళ్లినా గాని అంకుల్ కి ఫోటో, ప్రసాదం అంది ఉండదు. అందుకేనేమో బాబా ముందురోజు వర్షం పడేలా ఆరోజు ఆలస్యంగా వెళ్లేలా చేసారు. థాంక్యూ బాబా నేనున్న బాధ నుండి నాకు ఉపశమనం కలిగించారు. జీవితంలో వచ్చే అన్ని పరిస్థితుల్ని ఎదురుకునే మనో ధైర్యాన్ని నాకివ్వండి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo