సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి స్వప్నంలో దర్శనమిచ్చి ఆశీర్వదించిన లీల.


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువు మమతగారు తనకు సాయి స్వప్నంలో దర్శనమిచ్చి ఆశీర్వదించిన చమత్కారమైన లీలని ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నారు. 

అందరికీ సాయిరాం. ముందుగా మన అందరి ప్రియమైన తండ్రి సాయినాథునికి సాష్టాంగ ప్రణామాలు. నా పేరు మమత. మేము బెంగుళూరులో ఉంటాము. నేను లెక్చరర్‌గా పని చేస్తున్నాను. నేను మహాపారాయణ గ్రూపులో భాగస్వామిగా ఉన్నాను. నాకు సాయి ఎన్నో అనుభవాలను బహుమతిగా ఇచ్చారు కానీ, వాటిని ఇక్కడ మీతో ఎప్పుడూ పంచుకోలేదు. ఈరోజు సాయే ఈ లీలని మీతో పంచుకోమని చెప్పారు. ఒకరోజు సాయంత్రం నేను MP-20 సాయిరజనిగారి గ్రూప్ ఓపెన్ చేసాక అక్కడ ఒక పోస్ట్ చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. అది రెండురోజుల క్రిందట నాకు వచ్చిన స్వప్నానికి చాలా దగ్గరగా ఉంది.

మేము నామసప్తాహం ప్రారంభించిన రోజున బాబా మాకు ఆశీర్వాదంగా పుష్పాన్ని ఇచ్చారు. ఆరోజు నా భర్త కిరణ్ ఉదయం 7.55 కి నామజపం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన 9 నిమిషాలకి, అంటే, 8.04 కి బాబా మాకు ప్రసాదం ఇచ్చారు. బాబా మా పూజని స్వీకరించారని మాకు చాలా సంతోషంగా అనిపించింది. శ్రీరామనవమి నాటికి మా సప్తాహం ఆఖరిరోజు. ఆరోజు సాయి పూలమాల పంపి మమ్మల్ని దీవించారు. ఇంకా మా ఆనందానికి అవధులు లేవు. సాయి కూడా మా జపానికి సంతోషించారని మాకు అనిపించింది.

28 మార్చి, 2018 బుధవారం నాడు కూడా బాబా నన్ను ఒక వినూత్న పద్ధతిలో ఆశీర్వదించారు. నాకు ఆరోజు ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో నాకు నా ఫోనులో గ్రీన్, యెల్లో రంగులలో ఉన్న apps కనిపించాయి. దాంట్లో ఏమి ఉందో నాకు తెలియదు కానీ, ఒక్కసారిగా నాకు మరాఠీ భాషలో ఏదో వినిపించింది. అది నాకు అర్ధం కాలేదు. నేను “సాయీ, నాకు మరాఠీ అర్థం కాదు“ అని చెప్పాను. అక్కడ నా స్నేహితురాలు ఒకరు ఉన్నారు. కానీ, ఎవరో సరిగ్గా అర్థం కాలేదు. తను, "బాబా ఏమి చెప్తున్నారో నేను నీకు తెలుగులో చెప్తాను" అని, "బాబా నీ కుటుంబం గురించి చెప్తున్నారు" అని చెప్పింది. మరుక్షణం నేను 'బాబా!' అని గట్టిగా అరచి కళ్ళు తెరిచాను. నా మొబైల్లో టైమ్ చూస్తే 2.02 am అయ్యింది. ఎక్కడ మర్చిపోతానో అని కల గురించి వెంటనే నా నోట్‌పాడ్‌లో మొత్తం టైపు చేసుకొని, "సాయీ, దీని అర్థం ఏమిటో నాకు తెలిసేలా చేయండి" అని సాయిని ప్రార్థించి మళ్ళీ పడుకున్నాను. కొంచెంసేపు తర్వాత కూడా నాకు అది కలా, నిజమా ఏమీ అర్ధం కావడం లేదు. మళ్ళీ మెలకువ వచ్చి చూసుకుంటే ఏదో కొత్త ప్రదేశంలో ఉన్న అనుభూతి కలిగింది. అది చాలా విశాలమైన గది, అంతా భక్తి పూరితమైన వాతావరణం. అక్కడ చాలామంది ఉన్నారు(అందరం మహాపారాయణ చేసే పారాయణ గ్రూపు సభ్యులం). అందరం ఎవరి రాకకోసమో ఎదురు చూస్తున్నాము. వావ్! అందరూ చాలా ఆత్రుతగా ఆర్ద్రతాభావంతో సాయి కోసం చూసే సమయం ఇదేనేమో అనుకున్నాను. ఇంతలో మన సద్గురు సాయినాథ్ మహారాజ్ గదిలోకి ప్రవేశించారు. నాకు దగ్గరగా వచ్చి ఇంగ్లీషులో, “బిడ్డా, నీవు దేనికొరకూ చింతించకు, నేను నీకు మొత్తం అర్ధం అయ్యేలా చెప్తాను” అని చెప్పారు(వెంటనే, "సాయీ! నాకు మరాఠీ అర్ధం కాదు, నాకు సహాయం చేయండి" అని అడిగిన విషయం గుర్తువచ్చింది). తరువాత నాకు తెలియకుండానే సాయి నాచేత హనుమాన్ చాలీసాలోని కొన్ని పంక్తులు పలికించారు. బాబా ముందర నిల్చొని పెద్దగా పాడుతున్న చక్కటి అనుభూతి కలిగింది. అప్పుడు సమయం ఇంకా 2.30 am. బాబా 3 గంటల వరకు నాతోనే ఉన్నారు. తర్వాత నేను నిద్రలోకి జారుకున్నాను. స్వప్నం ఇచ్చిన సంతోషంలో ఉదయం త్వరగానే లేచాను. బాబా ఇచ్చిన స్వప్నానుభవంతో చాలా ఉత్సాహంగా ఉన్నాను. బాబా నాతో చెప్పించిన శ్లోకాలు మీతో పంచుకుంటాను. దానిద్వారా బాబా నాతో ఏమి చెప్పించాలని అనుకున్నారో మొత్తం మీ అందరికీ కూడా తెలుస్తుంది.

“అంత కాల రఘువర పుర జాయీ 
జహాఁ జన్మ హరిభక్త కహాయీ”

ఎవరయితే తమ చివరి గడియల్లో ఆ శ్రీరామచంద్రుడి చరణాల్ని ఆశ్రయిస్తారో వారు తమ తదుపరి జన్మల యందు కూడా ఆ దేవుని భక్తులుగానే జన్మిస్తారు.

“ఔర దేవతా చిత్త న ధరయీ 
హనుమత సేయి సర్వ సుఖ కరయీ|”

ప్రాయశ్చిత్తం కోసం ఇతర దేవతల్ని పూజించి సంతుష్టపరచాల్సిన అవసరం లేదు, ఒక్క హనుమంతుని యందు భక్తి అన్ని రకాల ఆనందాన్ని ఇస్తుంది.

“సంకట హటై మిటై సబ పీరా 
జో సుమిరై హనుమత బలవీరా|”

ఎవరైతే హనుమంతుడిని ఆశ్రయించి సదా మదిలో జ్ఞప్తియందు  ఉంచుకుంటారో వారు అన్ని కష్టాలు బాధల నుండి, పాపకర్మల నుంచి తప్పించుకొని పునర్జన్మ లేకుండా రక్షింపబడతారు.

ఈ స్వప్నంతోపాటుగా శ్రీరామనవమినాడు చెప్పుకోదగ్గ మరో లీల కూడా జరిగింది. ఆరోజు మేము సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుండగా బాబా మాకు ఒక అందమైన రోజాపువ్వుని కానుకగా ఇచ్చారు. ఆయన గుండెల దగ్గర ఉన్న ఆ పువ్వు అకస్మాత్తుగా ఆయన చేతుల మీదగా జారినట్లు క్రిందకు జారింది.

37వ శ్లోకంలో,

“జై జై జై హనుమాన గోసాయీ 
కృపా కరో గురు దేవ కీ నాయీ|”

మేము మన గురువైన సాయి మనకి ఏదో సంకేతం ఇస్తున్నారని భావించాము. ఆ స్వప్నం వచ్చిన రెండు రోజుల తరువాత హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మనసుకి ఎంతో సంతోషంగా అనిపించేది. "బాబా! నీ బిడ్డలమైన మా అందరిపై నీ కరుణామృతమయిన ప్రేమని ఎల్లప్పుడూ ఇలానే చూపుము తండ్రీ!". సాయి తన ప్రేమతో మనలో శ్రద్ధాభక్తులు పెంచుతారు. తద్వారా మనం ఆయన ఉనికిని ప్రతిక్షణం ఆస్వాదించగలుగుతాం. 

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

2 comments:

  1. Sai ni pujinche vallaki nak oka chinna request nen Chala kastam lo unnanu na gurinchi baba ni prashinchamani na manavi

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo