సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మహాపారాయణతో వచ్చిన ఉద్యోగం


నేను ఒక సాయిభక్తురాలిని. అందరికీ నమస్కారం. మహాపారాయణ నిర్వాహకులందరికీ నా శతకోటి ప్రణామాలు. నేను మహాపారాయణ ప్రారంభించాక బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాల నుండి మంచి జీతం వచ్చే ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఎందుకంటే, ఇంతకుముందు నేను ఒక చిన్న కంపెనీలో చాలా తక్కువ జీతానికి పనిచేశాను. కొన్ని కారణాల వల్ల సంవత్సరం 6 నెలలుగా ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాను. గత సంవత్సరం జూన్ నుండి నేను ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేయడం మొదలుపెట్టాను. నేను చాలా ఇంటర్వ్యూలకి హాజరై సెలెక్టయ్యాను కూడా. కానీ ఏవో కొన్ని కారణాలతో నాకు ఆఫర్ లెటర్ వచ్చేది కాదు. నేను చాలా దురదృష్టవంతురాలిని, అందుకేనేమో నేను సెలెక్ట్ అయినా కూడా ఉద్యోగం రావట్లేదని అనుకునేదాన్ని. ఈ సమయంలోనే నేను పారాయణ మొదలుపెట్టాను. అక్టోబర్ 5వ తేదీన నా రెండవ పారాయణ పూర్తి చేసిన వెంటనే నేను అంతకుముందు ఇంటర్వ్యూకి హాజరైన ఒక కంపెనీ నుండి కాల్ వచ్చింది. వాళ్ళు నేను ఆ ఉద్యోగానికి  సెలెక్ట్ అయ్యానని, నా డాక్యుమెంట్స్ అన్నీ అక్టోబర్ 7వ తేదీ లోపు పంపమని చెప్పారు. నేను వాళ్ళు చెప్పినట్లుగానే అన్నీ పంపాను కానీ, ఆ తర్వాత కూడా వాళ్ళనుండి నాకు ఎలాంటి కాల్ రాలేదు. ఈ పరిణామంతో నేను చాలా క్రుంగిపోయాను. ఎందుకంటే నాకు ఇంతకుముందు కూడా ఒకసారి ఇలాగే జరిగింది.

అయితే మన సాయి ప్రణాళికలు వేరేగా ఉన్నాయి. నా 3వ వారం పారాయణ అక్టోబర్ 12న పూర్తయింది. మరుసటిరోజు అక్టోబర్ 13న నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. నా సంతోషానికి అవధులు లేవు. అప్పటి నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. బాబా ఫోటో ముందు ఆనందంతో ఏడ్చేసాను. కానీ నేను జాబ్ చేయబోయే ప్రాంతం మా ఇంటికి చాలా దూరంలో ఉందని కొంచెం మనసులో బాధగా అనిపించింది. నా నాల్గవ పారాయణ పూర్తయ్యేసరికి బాబా నా వర్క్ లొకేషన్ ని మా ఇంటికి దగ్గరగా మార్చేశారు. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. "బాబా! నాకు సహాయం చేసినట్లుగానే మా పేరెంట్స్ ని, సిస్టర్ ని వాళ్ళ సమస్యల నుండి బయటపడేలా ఆశీర్వదించండి". థాంక్యూ బాబా!
సాయినాథ్ మహారాజ్ కీ జై!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo