సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నేను కోరుకున్న స్థాయిలో నన్ను ఈ ప్రపంచానికి చూపిన సాయి


   శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

పేరు వెల్లడించని ఒక సాయిబంధువు అనుభవం:

సాయిబంధువులందరికీ  సాయిరామ్. నాకు జరిగిన ఒక సాయి లీలను "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్"  ద్వారా  సాయిబంధువులందరికీ  తెలియచేయటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది.

2013వ సంవత్సరంలో నేను 'లా' పూర్తి చేశాను. నేను స్వేచ్ఛాజీవిగా బ్రతకాలని నా కోరిక. నా జీవితంలో నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు. కానీ నన్ను నిరుత్సాహపరిచేవాళ్లు మాత్రం చాలామందే ఉన్నారు. అందుకే నేను నా కాళ్ళపై నేను నిలబడి నేనంటే ఏమిటో ఈ ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాను. అందువలన జ్యుడీషియరీలో జాయిన్ అవ్వాలనుకొని అందుకోసం అవసరమైన కోచింగ్‌లో కూడా జాయిన్ అయ్యాను. అలాగే కాంపిటీటివ్ పరీక్షలలో హాజరవడానికి కూడా కోచింగ్‌లో జాయిన్ అయ్యాను. కొన్నిరోజులు అలాగే గడిచిపోయిన తరువాత నాకు అర్థమయింది ఏమిటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో నాకు ప్రస్తుతం ఉన్న సమయం సరిపోదని, ఇంకా ఒక సంవత్సరం అయినా పట్టవచ్చునని.

కానీ అదే సమయంలో ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పంపించారు. నేనప్పటికింకా సరిగా ప్రిపేర్ కాకపోయినప్పటికీ, బాబా మీద నమ్మకంతో అప్లై చేసి, "బాబా! నాకున్న సమయం చాలా తక్కువ, నా సబ్జెక్టులో  చాలా భాగం చదవాల్సివుంది, కావున సమయాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్క క్షణాన్ని సద్వినియోగ పరచుకొనేలా, నా ఆలోచనా శక్తిని అంతా నా సబ్జెక్టు పైనే కేంద్రీకృతం చేసేలా చూడండి. ఈ పరీక్ష గనుక నేను క్లియర్ చేయగలిగితే నా జీవితంలో నేను మంచిస్థాయిలో ఉంటాను. బాబా! నాపై దయవుంచి ఈ పరీక్షలో నేను పాస్ అయ్యేలాగా చూడు తండ్రీ! నా భారమంతా మీ మీదనే వేస్తున్నాను" అని బాబాకి విన్నవించుకున్నాను. బాబాపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నందువలన నేను ఆయన కృపతో ప్రిలిమినరీ క్లియర్ చేశాను. తరువాత మెయిన్స్ క్లియర్ చేశాను. చివరికి ఇంటర్వ్యూ కూడా బాబా అనుగ్రహం వలన క్లియర్ చేశాను. మొత్తం 6000 మందిలో 52 మంది మాత్రమే ఉద్యోగానికి అర్హత పొందారు. ఆ 52 మందిలో నేను కూడా ఒకడిగా నిలిచానంటే, బాబా అనుగ్రహమే అందుకు కారణం. తరువాత నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. కొన్నిరోజుల తర్వాత నా సహోద్యోగులు మాట్లాడుకుంటుంటే విన్నాను - వాళ్లు ఈ ఉద్యోగంకోసం రెండు సంవత్సరాల నుండి  ప్రిపేర్ అవుతున్నారట, ఇంకా కొందరైతే మూడు నాలుగు సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారట. వాళ్లంతా చేసిన ప్రాక్టీసులో నాది సగం వంతు కూడా కాదు, అయినా కూడా నేను ఆ ఉద్యోగానికి అర్హుడిగా ఎంపిక అయ్యానంటే - కేవలం నాకు బాబా మీదున్న నమ్మకం, ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమ వలన మాత్రమే. అందువలనే ఈ సమాజంలో నేను ఇంత మంచిస్థాయిలో ఉండగలుగుతున్నాను. నన్ను నేను కోరుకున్న స్థాయిలో ఉంచిన సాయికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? బాబాకు కేవలం ధన్యవాదాలు మాత్రమే తెలుపగలను. బాబా మీద అనన్యమైన భక్తి విశ్వాసాలు ఉంటే మనం కోరుకున్నది ఆయన  ఖచ్చితంగా ఇస్తారు. ఆయన కోరుకునేది మన సంతోషాన్నే కదా!

ఓం సాయిరామ్.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo