శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
హైదరాబాద్ నుండి సాయిబంధువు మహేశ్వర గారు తమ అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.
గత 20 సంవత్సరాల నుండి నేను సాయిభక్తుడిని. నేను నా గురు సాయిని నమ్మడం ప్రారంభించినప్పటి నుండి నా జీవితంలో చాలా అనుభవాలు జరిగాయి. వాటిలో ఈమధ్యనే 20 రోజుల క్రితం జరిగిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను.
మొదటి అనుభవం:
మేము గత 4 నెలల నుండి క్రొత్త ఇంటికోసం వెతుకుతున్నాము. కాని మా బడ్జెట్ లో ఇల్లు దొరకలేదు. మేము సాయి యందు విశ్వాసంతో "మంచి ఇంటిని మాకు ఇవ్వండి బాబా" అని నిరంతరాయంగా ప్రార్థిస్తూ ఉన్నాము. బాబా మా ప్రార్థనలు విన్నారు. కొద్దిరోజుల్లోనే బాబా, 'నేనే ఇచ్చాను' అన్న గుర్తుగా "సాయి" నామంతో మొదలైన అపార్టుమెంట్ లో మా బడ్జెట్లో మాకు అనువైన మంచి ఇంటిని చూపించారు. నా కోరిక నెరవేర్చినందుకు ధన్యవాదాలు బాబా!
రెండవ అనుభవం:
ఒక వారం క్రితం నేను ఒక తెలుగు సినిమాకి ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నాను. తీరా ఆ రోజు ఆ సినిమా చూడాలన్న ఆసక్తి లేదు. పోనీ టికెట్స్ రద్దు చేసుకుందామంటే టిక్కెట్లను రద్దు చేసే అవకాశం కూడా లేదు. ఉదయం 11 గంటలకు షో మొదలవుతుందనగా 10 గంటల సమయంలో, "నా ఎమౌంట్ నాకు అందితే నేను నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను" అని సాయికి ప్రార్థన చేశాను. 10.30 గంటలకు "షో రద్దు చేయబడింది, కావున పది పని దినాలలో మీ ఎమౌంట్ మీకు తిరిగి చెల్లించబడుతుంది" అని ఒక సందేశం వచ్చింది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నాకు నోట మాట రాలేదు. మన సాయి తన భక్తుల మీద ఎలా ఆశీర్వాదాలు కురుపిస్తారో వర్ణించడానికి ఏ పదాలూ లేవు. అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
మహేశ్వర.
సాయిబంధువు గీతిక గారు తన అంకుల్ కి జరిగిన ఒక అద్భుత అనుభవాన్నిలా చెప్తున్నారు.
నేను 8 నెలల నుండి బ్లాగులో సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నాను. ఆ అనుభవాల ద్వారా నేనెంత ధైర్యాన్ని పొందుతున్నాను, బాబాపట్ల నాకున్న భక్తి విశ్వాసాలు కూడా ఎంతో దృఢమైయ్యాయి.
మా అంకుల్ గారికి సంబంధించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీఅందరితో పంచుకుంటాను. ఆ అనుభవం ఎంతో చిన్నదైనా చాలా అద్భుతమైనది. మా అంకుల్ చాలా గొప్ప సాయి భక్తులు. ఆయనకు బాబా యందు చాలా దృఢమైన విశ్వాసం. సుమారు 25, 27 సంవత్సరాల క్రితం అంకుల్ శిరిడీ వెళ్లి, అక్కడ నుండి చాలా ఊదీ సేకరించి తెచ్చుకున్నారు. రోజుకు రెండుసార్లు తన నుదుటిపై పవిత్రమైన ఊదీ పెట్టుకోవడం అతనికి రోజువారీ అలవాటు. ఒకరోజు తన బాక్స్ లో ఊదీ అయిపోయిందని చాలా బాధపడ్డారు. ఆ నిరాశతో వెళ్లి పడుకున్నారు. మరుసటిరోజు ఉదయం అంకుల్ త్వరగా లేచి బాబాని ప్రార్ధించి ఊదీ బాక్స్ తెరిచి బాక్స్ నిండా ఊదీ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆనందంతో అతని కన్నుల నుండి ఆనందబాష్పాలు జల జల జారిపోయాయి. బాబా తన బిడ్డలు కలత చెందింతే చూడలేరు అని అంకుల్ అనుభూతి చెందారు. బాబా తన ప్రతి ఒక్క భక్తుడికి తోడుగా ప్రతిక్షణం ఉంటారు.
ఓం సాయిరామ్.
🕉 sai Ram
ReplyDelete