- శ్రీసాయి అనుగ్రహ లీలలు - 26వ భాగం
నా పేరు సాయిబాబు. 2020, జూలై నెల చివర్లో బెంగుళూరులో లాక్డౌన్ నడుస్తోంది. రేపు శ్రావణమాసం మొదలవుతుందనగా మా అమ్మయి తన మనసులో, ‘ప్రతిరోజూ పూజకు చాలా పూలు కావాలి. కానీ లాక్ డౌన్ వల్ల పూలు సమృద్ధిగా దొరకవు. పూజ ఎలా చేసుకోవాలి?’ అని అనుకుంది. మరుసటిరోజు ఉదయాన్నే మా అల్లుడు ఆపార్టుమెంటు క్రింద వున్న బాబా మందిరానికి వెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద కవరులో చాలా గులాబీలు వున్నాయి. సుమారు ఐదు కేజీలు వుంటాయి. మా అల్లుడు వాటిని తెచ్చి మా అమ్మాయికి ఇచ్చాడు. తను వాటిని చూస్తూనే సంతోషంతో బాబా వైపు తిరిగి కృతజ్ఞతలు చెప్పుకుంది. రోజూ కొన్ని పూలతో అమిత ఆనందంగా పూజ చేసుకుంది. మనసులో అనుకగానే పూలబ్బాయి ద్యారా అన్ని పూలు అక్కడ పెట్టించి, సమయానికి మాకు చేరేలా చేశారు బాబా. మనం త్రికరణ శుద్ధిగా పూజ చేస్తే కావలిసినవన్నీ ఆ దైవం సమకురుస్తాడు.
2020, ఆగష్టు 27న నా పుట్టినరోజు సందర్బంగా మా అమ్మాయి నాకు ఒక స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకుంది. కానీ బాబా అనుమతి ఇవ్వనందున తను ఫోన్ కొనలేదు. ఒక వారం తర్వాత మా అమ్మాయికి 'ఈ రోజు ఫోన్ కొనివ్వు’ అని బాబా చెప్తున్నట్లు అనిపించింది. ఆరోజు మా అమ్మాయి సామ్సంగ్ షోరూముకు వెళితే మంచి డిస్కౌంట్‌లో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ మంచిది లభించింది. దాన్ని తీసుకొచ్చి నాకిచ్చింది మా అమ్మాయి. మంచి డిస్కౌంట్ వస్తుందనేనేమో బాబా వారం ముందు ఫోన్ తీసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే, బాబా ఇచ్చే ప్రతి సమాధానం వెనుక ఏదో పరమార్థం ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినట్లు నడుచుకోవడం వల్ల మనం ప్రయోజనాన్ని పొందుతాము.
ఆరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఒకే రోజున బాబా రెండు లీలలు చూపించారు. మా అమ్మాయి పూజకు అన్ని సిద్ధం చేసుకుని బాబానే శ్రీకృష్ణునిగా భావించి చిన్న గులాబీ పూలతో అష్టోత్తరం చేస్తోంది. ఆ గులాబీలు ఎరుపురంగు, ఆరెంజ్ రంగులలో ఉన్నాయి. వాటిలో ఒక పువ్వు మాత్రం సగం ఎరుపు, సగం ఆరెంజ్ రంగులలో ఉంది. కవరులో ఉన్న మొత్తం పువ్వులలో అదొక్కటే అలా ప్రత్యేకంగా ఉండటం మేము గమనించాము. అష్టోత్తరం పూర్తైన తర్వాత ఆరతి ఇస్తుంటే ఆ పువ్వు బాబా ఒడిలో నుండి ఆయన పాదం మీద పడటం చూసి మామూలుగా పడిందేమో అనుకున్నాము. ఎందుకంటే, అప్పుడప్పుడు పువ్వులు జారిపడటం సహజమే కదా! మా అమ్మాయి బాబా అలంకరణ బాగుందని ఫోటో తీసి తనకు తెలిసిన సాయిభక్తులకు పంపింది. వారిలో ఒకరు వెంటనే ఫోన్ చేసి ఒక అద్భుతం గురించి చెప్పారు. అదేమిటంటే, పువ్వు ఎక్కడైతే పడిందో అక్కడ బాబా ముఖచిత్రం చాలా స్పష్టంగా ప్రకటమైంది. తెల్లటి తలగుడ్డ, ముఖం కుడివైపుకు కొద్దిగా వంగి చాలా స్పష్టంగా కనపడుతున్నారు బాబా. ఆ అద్భుతాన్ని మిగిలిన సాయిభక్తులకు కూడా తెలియపరిచాం. అందరూ సంతోషించారు. హడావుడిలో ఆయన దర్శనం మేము గమనించుకోలేదని, ఆ భక్తుడి ద్వారా చెప్పించడం కూడా బాబా లీలే! ఇది బాబా మాకు ప్రసాదించిన జన్మాష్టమి కానుక.
ఒక గురువారం రోజు ఉదయం మేము కారులో బెంగుళూరు నుండి గుంటూరు రావటానికి బయలుదేరాము. బెంగుళూరులో బాబా దర్శనం చేసుకుందామంటే కుదరలేదు. సరే, నెల్లూరులోని అద్దాల మందిరంలో బాబా దర్శనం చేసుకుందామనుకున్నాము. కానీ మేము నెల్లూరు చేరేసరికి సాయంత్రం నాలుగు గంటలైంది, అప్పటికి గుడి తలుపులు తెరవలేదు. తర్వాత ఒంగోలులో కూడా అలానే జరిగింది. అలాగని బాబా ఊరుకోరు కదా! మేము కారులో బాబా సినిమా చూస్తుండగా అందులో 'నా భక్తులు నా వద్దకు రాలేనప్పుడు నేనే వారి వద్దకు వెళతాను' అనే సన్నివేశం వచ్చింది. అక్షరాలా అదే జరగబోతోందని ముందుగా సూచించటానికి సినిమాలో ఆ సన్నివేశం వచ్చిందేమో! తర్వాత మేము గురువారంనాడు ఉదయం నుండి బాబాను దర్శించుకోలేకపోయామనుకుంటూ చీకటి పడుతుండగా ధూప్ హారతి పెట్టుకొని వింటున్నాము. అంతలో మా పాత విద్యార్థి సాయికుమార్ వద్ద నుండి మా అమ్మాయి ఫోనుకి వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేస్తే, మందిరంలో సంధ్య ఆరతికి అలంకరించుకొని ఉన్న బాబా దర్శనమిచ్చారు. ఆ సమయంలో సాయికుమార్ బాబా పాదాల వద్ద కూర్చుని సచ్ఛరిత్ర చదువుకుంటుండగా తనకి ఏదో ప్రేరణ కలిగి వీడియో కాల్ చేసి మాకు బాబాని చూపించాలని అనిపించిందట. అంతే, వెంటనే మాకు కాల్ చేసి బాబా దర్శనం చేయించాడు. అలా మేము తమ దగ్గరకి వెళ్ళలేకపోయామని బాబానే మాకోసమొచ్చి దర్శనమిచ్చి సినిమాలో వచ్చిన సన్నివేశం నిజం చేసారు. 7 గంటలకు క్షేమంగా ఇల్లు చేరుకొని ఇంట్లో బాబాకి శేజారతి చేశాము. “కృతజ్ఞతలు బాబా”.
నా భార్య రోజూ బంగారు పూలతో బాబాకి, శివలింగానికి పూజ చేస్తుంది. మరుసటిరోజు ఉదయం మామూలు పూలతో పాటు ఆ బంగారు పూలు కూడా తీసి మాములు పువ్వులు ఏ రోజువి ఆ రోజు బయటపడేస్తాము. ఒకరోజు ఉదయం పూజ చేయటానికి బంగారు పువ్వులున్న గిన్నెలో చూస్తే ఒక పువ్వు తగ్గింది. ముందురోజు పూజకు సమయం అయిపోతుందనే తొందరలో హడావిడాగా పూలు తీయడం వల్ల మాములు పూలలో ఆ బంగారుపువ్వు ఇరుక్కుపోయి ఉంటుంది అని అనుకున్నాము. నా భార్య బాబా ఫోటో చూస్తూ, "బాబా! ఎలా చేస్తావో తెలీదు. రేపు ఉదయం పూజ సమయానికి కనపడకుండా పోయిన బంగారు పువ్వు మళ్ళీ గిన్నెలోకి రావాలి" అని మనసులో అనుకుంది. ఆ రోజు మాములుగా గడిచిపోయింది. మరునాటి ఉదయం స్నానాలు చేసి పూజకు వచ్చాము. పూలు పెట్టి, నైవేద్యం పెట్టి అష్టోత్తరం చేయటానికి బంగారు పూల గిన్నె తీసాను. విచిత్రం! లెక్క ప్రకారం ఎన్ని ఉండాలో అన్ని పూలున్నాయి. “ధ్యాంక్యూ బాబా”.
Baba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteBaba, release Chandrababu Naidu from jail as quickly as possible. I will share in the Sai Sannidhi blog.
ReplyDeleteఓం సాయి రామ్ ఈరోజున నా భర్త పుట్టిన రోజు సాయి నీవు ఆయన కి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం, ఆరోగ్యం ఆశీస్సులు యియ్యవలెను తండ్రి.నేను సుమంగళి గా కన్నుమూసే అవకాశం యీయి తండ్రి.నా కోరిక తీర్చు తండ్రి.పిల్లలకి, మనవలకి నిండు నూరేళ్ళు ఆయుష్షు యిచ్చి దీవించు తండ్రి.ఓం సాయి రామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteసాయి నేను ఈ పాపం చేయలేదు సాయి ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా చేసి ఉన్నా బిడ్డలాంటి దాని అనుకొని నన్ను క్షమించు సాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను నేను నా భర్త మనసు మార్చు సాయి నాకు భర్తతో కలిసి బ్రతకాలని ఉంది సాయి ఒక్క కోరిక తీర్చు బాబా సాయి
ReplyDeleteOm Sri Sai ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
Baba bless my children and fulfill their wishes in education 🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteSai, kindly provide proper wisdom and health to my father.
ReplyDelete