సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1658వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సమస్యలు పరిష్కరించకుండా వదలరు బాబా

నేను ఒక సాయి భక్తుడిని. మేము ఎప్పట్నుంచో మా బాబు మొదటి పుట్టినరోజు కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుండగా ఆ సమయం దగ్గరకి వచ్చింది. అప్పుడు నేను, "బాబా! వచ్చే బుధవారం(2023. ఆగస్టు 30) నా కొడుకు మొదటి పుట్టినరోజు. మిమ్మల్ని నమ్ముకుంటే ఏదైనా సాధ్యమేనని మీ మీదే భారమేసి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నాను. మీరే దగ్గరుండి ఎటువంటి ఆటంకం లేకుండా కార్యక్రమాన్ని జరిపించండి" అని బాబాతో చెప్పుకున్నాను. కార్యక్రమానికి 4 రోజుల ముందు నుంచే చుట్టాలు అందరూ రావడం మొదలుపెట్టారు. ఆ రోజు రాత్రి 11 గంటల నుండి బాబు ఒకటే ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాలేదు. నేను బాబాని తలుచుకొని, "బాబా! మా బాబు సమస్య ఏమిటో అర్థం కావడం లేదు. మీరే వాడి సమస్యను తీర్చి వాడు నిద్రపోయేలా చూడండి తండ్రీ. మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించసాగాను. బాబా దయవల్ల రాత్రి 2 గంటలకు బాబు ఏడుపు ఆపి నిద్రపోయాడు. నేను సంతోషంగా, "ధన్యవాదాలు బాబా. ఇక పుట్టినరోజు వరకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడండి. అలాగే నాకు ఎటువంటి ఎమర్జెన్సీ డ్యూటీ పడకుండా చూసి పుట్టినరోజు వేడుకలు చక్కగా అయ్యేటట్లు చూడు తండ్రీ. కార్యక్రమం చక్కగా జరిగితే మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల పుట్టినరోజు వేడుక చాలా ఘనంగా జరిగింది. కాదు, కాదు బాబా దగ్గరుండి జరిపించారు. అతిథులెవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. చెప్పుగ్గోధగ్గ విషయం ఏమిటంటే, బాబా దయవల్ల నాకు ఎటువంటి ఎమర్జెన్సీ డ్యూటీ పడలేదు. నేను బాబాకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకొని ముందుగా అనుకున్నట్లు మర్నాడు గురువారం బాబాకి వస్త్రం, పేడా మిఠాయి, 101 రూపాయలు దక్షిణ సమర్పించుకున్నాను.

పుట్టినరోజుకి కొన్నిరోజుల ముందు నా భార్య ఆఫీసు పని మీద ముంబయి వెళ్లి బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి వచ్చింది. ప్రయాణంలో తన చేతికున్న బంగారు ఉంగరం రైలులో బెర్త్ మీద పడిపోయి తిరిగి దొరికింది. మరుసటిరోజు శ్రీవినాయకుని మొక్కు తీర్చుకోడానికి మందిరంకి వెళ్లి, 108 ప్రదక్షిణలు చేసి తిరిగి బండి మీద వస్తుంటే నా భార్య చేతికి ఉండాల్సిన ఉంగరం కనిపించలేదు. ముందురోజే రైలులో పడిపోయి దొరికి, మళ్ళీ ఇంతలోనే కనపడకుండా పోయినందున వదులుగా ఉండటం వల్ల ఎక్కడో పడిపోయి ఉంటుంది అనుకున్నాము. కానీ, 'ఇంటిలోనే దొరికితే బాగుండు' అని అనుకోని, "బాబా! ఆ ఉంగరం ఇంట్లో దొరికితే, మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకొని, మీకు 101 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా కరుణ వల్ల ఇంటికి రాగానే నా భార్యకి గిన్నెలు కడిగేటప్పుడు వదులుగా ఉందని ఉంగరం తీసి పక్కన పెట్టినట్టు గుర్తు వచ్చింది. చూస్తే, ఉంగరం దొరికింది.

కిందటి సంవత్సరం వినాయకచవితికి ఒకరోజు ముందు బాబా, వినాయకుని దయవల్ల మాకు బాబు పుట్టాడు. అందువల్ల మేము గత సంవత్సరం వినాయకచవితి చేసుకోలేకపోయాము. అందుకని ఈ సంవత్సరం వినాయకచవితి చాలా ఘనంగా చేయాలని అనుకున్నాము. అయితే వినాయకచవితి ముందురోజు మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా మా ఇంచార్జ్ ఫోన్ చేసి, 'ఆ రోజు సాయంత్రం బెంగళూరు వెళ్లి, అక్కడ పని చూసుకొని మళ్ళీ మూడోరోజు ఉదయం రావాలి’ అని చెప్పారు. అప్పుడు నేను ఇలా వినాయకచవితి చేసుకోవాలని అభ్యర్థించాను. చివరికి బాబా దయవల్ల నన్ను పంపే ఆలోచన విరమించుకున్నారు మా ఇంచార్జ్. అప్పుడు నేను బాబాని తలుచుకొని, "బాబా! వినాయకచవితి జరుపుకొని మూడోరోజు నిమజ్జనం చేసేవరకు నాకు ఎటువంటి ఎమర్జెన్సీ డ్యూటీ పడకుండా, ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడు తండ్రీ" అని ప్రార్థించాను. ఆ సద్గురుని కృపవల్ల మా ఒక సంవత్సరం బాబుతో వినాయకచవితి చాలా బాగా జరుపుకున్నాము. మూడురోజులు వినాయకుని చక్కగా పూజించుకొని మూడో రోజు నిమజ్జనం చేసాము. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబా అనుభవాలు చాలా ఉన్నాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని నమ్ముకుంటే ఏదైనా సాధ్యమే. నమ్ముకున్న వారి సమస్యలు పరిష్కరించకుండా ఎన్నడూ వదలవు సాయినాథా. ఇలానే మీ కృప మీ భక్తులందరిపై ఉండేలా చూడు తండ్రీ. మీ  దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా. ధన్యవాదాలు బాబా. సంవత్సరం దాటిన మా బాబుకి ఇంకా దంతాలు రాలేదు. తొందరగా వచ్చేలా చూడు బాబా."


14 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Naku nyayam chei sai om sri sai nyaya pradhayanamaha

    ReplyDelete
  7. Om Sri Sairam 🙏🙏🙏

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  9. Om Sri sainthaya namah

    ReplyDelete
  10. Omsaisri Sai Jai Jai Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 kapadu Tandri

    ReplyDelete
  11. Baba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS College for my daughter.

    ReplyDelete
  12. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  13. Baba, please release Chandrababu Naidu from jail as quickly as possible.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo