1. బాబాని అడిగితే ఏదైనా ఇస్తారు2. బాబాకి చెప్పుకున్నాక దొరికిన కళ్ళజోడు
బాబాని అడిగితే ఏదైనా ఇస్తారు
ముందుగా అందరికీ వందనాలు. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. నా బావమరిది పేరు హర్ష. తను కూడా ఆస్ట్రేలియా రావాలని ప్రయత్నిస్తుండగా తను పనిచేస్తున్న కంపెనీవాళ్ళు తన వీసాకోసం 2022, అక్టోబర్‌లో అప్లై చేసారు. అయితే చాలారోజుల వరకు వీసా రాలేదు. అందువల్ల మా బావమరిది బాధపడుతుంటే, నేను తనతో, "బాబా ఉన్నారు. నేను సాయిని అడిగితే, ఏదైనా వెంటనే ఇస్తారు" అని చెప్పి, "బాబా! నా బావమరిదికి వీసా రావాలి" అని బాబాని ప్రార్థించాను. కొన్ని నెలల తర్వాత నా బావమరిదికి వీసా వచ్చింది. బాబావల్లే ఇది సాధ్యమైంది. తర్వాత నేను, "కంపెనీవాళ్ళు తొందరగా నా బావమరిది ప్రయాణానికి టికెట్ బుక్ చేస్తే, మీ అనుగ్రహం మీ బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల కంపెనీవాళ్ళు 2023, అక్టోబర్ 11న ఆస్ట్రేలియా రావడానికి నా బావమరిదికి టికెట్ బుక్ చేసారు.
నా వద్ద ఆపిల్ ఫోన్ ఎయిర్ పోడ్స్ ఉన్నాయి. అవి 2023, ఆగస్టు నెలాఖరులో కనిపించలేదు. నాలుగు రోజులు ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు నేను, "బాబా! అవెక్కడోన్నాయో మీరే చెప్పాలి. ఆ ఎయిర్ పోడ్స్ దొరికితే, మీ అనుగ్రహం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల వెంటనే నా ఆపిల్ ఎయిర్ పోడ్స్ దొరికాయి. బాబాని అడిగితే ఏదైనా ఇస్తారు. ప్రేమతో పిలిస్తే చాలు - లేదు అనకుండా ఇస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఈమధ్య నా ఆరోగ్యం కొంచెం బాగుండట్లేదు. దయతో కుదుటపడేలా అనుగ్రహించండి బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
బాబాకి చెప్పుకున్నాక దొరికిన కళ్ళజోడు
నా పేరు రూప, నాకు బాబా అంటే చాలా ఇష్టం. ఆయన లీలలు అన్నీఇన్నీ అని చెప్పలేము. నక్షత్రాలను ఎలా లెక్క పెట్టాలేమో, అలా నేను అంతులేనన్ని బాబా మహిమలను అనుభూతి చెందాను. చిన్న చిన్న విషయాలైనా అడిగిన వెంటనే బాబా మహిమ చూపిస్తుంటే కలిగే ఆనందం అధ్బుతంగా ఉంటుంది. బ్లాగులోని తోటి భక్తులు అనుభవాలు చదువుతుంటే నాకు కూడా నా అనుభవాలు పంచుకోవాలనిపించింది. 2023, సెప్టెంబర్ 2న మావారు తన కళ్ళజోడు ఎక్కడో పెట్టి మరిచిపోయారు. ఎంత వెతికినా దొరకలేదు. మావారు ఒక కాంట్రాక్టర్. తను పని మీద మెటీరియల్ కోసం చాలా షాపులకి వెళ్తుంటారు. ఆయా షాపులన్నింటికీ ఫోన్ చేసి తన కళ్ళజోడు గురించి అడిగారు. కారులో, బండిలో కూడా చూశారు. కానీ ఎక్కడా ఆ కళ్ళజోడు దొరకలేదు. అప్పుడు ఇక కళ్ళజోడు పోయినట్లే అన్నారు. నేను, "బాబా! మావారు కళ్ళజోడు లేకపోతే చదవలేరు. ఎలాగైనా ఆ కళ్ళజోడు దొరికేలా చేయండి. మీ అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం మేము మా అమ్మ వాళ్ళింటికి వెళ్లొచ్చి బండిలో సామానులు తీస్తుంటే, ఎందుకో మరొకసారి వెతుకుదాం అని చూస్తే, కళ్ళజోడు దొరికింది. రెండు రోజుల నుంచి మావారు ఆ బండి మీదే వెళ్తున్నారు, అందులో వెతుకుతున్నారు. అయినా దొరకనిది బాబాకి చెప్పుకున్నాక దొరికింది. నాకు చాలా ఆనందమేసింది. "పిలవగానే పలికే. తండ్రి. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోము. లవ్ యు సో మచ్ నాన్నా".
సాయి నన్ను నా భర్తని కలుపు బాబా సాయి
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSairam always be with me
Om Sai Ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeletesaibaba pl bless my son sai madava to change his behaviour, attitude, manners , reduce his anger for all things.
ReplyDeleteOm sairam baba na anubhavam Inka publish kaledu
ReplyDeleteOmsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteBaba, release Chandrababu Naidu from jail as quickly as possible.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeletePlease Baba, provide peace to my Dad. He is a sincere devotee of you. At this age we don’t want to see him suffering. You only can take care of him. An earnest request to take over his responsibility🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram om sai ram
ReplyDeleteOm sai ram🙏🙏🙏
ReplyDeleteMy dear Baba. Always be with us. You are in my heart. Om sri Sairam 🙏🙏🙏🌹🌹🌹
ReplyDelete