1. బాబాని నమ్ముకుంటే సమస్యలు పరిష్కారం
2. బాబా దయుంటే ఏదైనా సాధ్యం
బాబాని నమ్ముకుంటే సమస్యలు పరిష్కారం
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నా జీవితంలో ప్రతి విషయంలో తోడుగా ఉంటున్నారు. 2011లో నేను మా ప్రొఫెసర్‌గారి బుక్ తీసుకున్నాను. అది తర్వాత కనిపించలేదు. అప్పుడు నేను చాలా భయపడ్డాను. అప్పుడు నా భర్త. "బాబా చరిత్ర పారాయణ చేయమ"ని చెప్పారు. నేను సరేనని, మొదటిసారి బాబా చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. పారాయణ పూర్తయ్యేసరికి మా జూనియర్ ఆ బుక్ తీసుకుని జాగ్రత్త చేసాడని, తర్వాత మా ప్రొఫెసర్‌గారికి ఇచ్చాడని తెలిసింది. నాకు చెప్పలేనంత సంతోషమేసింది. అది మొదలు నాకు ఏదైనా సమస్య వస్తే, నేను బాబా చరిత్ర పారాయణ చేసుకుంటాను. పారాయణ ముగిసేలోపు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
నేను రెండవసారి గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టరు, "ఉమ్మనీరు తక్కువగా ఉంది. సమస్య అవుతుంద"ని అన్నారు. కాన్పుకి కోయంబత్తూర్ నుండి పాలకొల్లు వెళ్లాలనుకున్న మాకు హఠాత్తుగా ఆ వార్త తెలిసేసరికి చాలా భయపడ్డాము, బాధపడ్డాము. అప్పుడు నేను 'పాలకొల్లు వెళ్ళనా, వద్దా' అని బాబా బాబా ముందు చీటీ వేశాను. బాబా సమాధానం 'వెళ్ళమని' వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఏ సమస్యా లేకుండా అంతా బాగుంటే పుట్టబోయే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకొని పాలకొల్లు వెళ్ళాను. బాబా దయతో అంతా బాగా జరిగి మాకు పాప పుట్టింది. అందుకు కృతజ్ఞతగా మేము మా చిన్నపాపకి సాయి అని పేరు పెట్టుకున్నాము.
2023, జనవరిలో మేము ఎంతో కష్టపడి కట్టుకున్న మా ఇంటిని ఎవరో కబ్జా చేశారని తెలిసి నా భర్త చాలా టెన్షన్ పడ్డారు. అప్పుడు నేను బాబా పారాయణ మొదలుపట్టాను. మరుసటి సోమవారంకల్లా ఆ సమస్య పరిష్కారమైంది. 'మా ఇంటిని ఎవరూ కబ్జా చేయలేదని, మున్సిపాలిటీవాళ్లు తప్పుగా నమోదు చేశారని' తెలిసింది. దాంతో మాకు చాలా ఉపశమనంగా అనిపించి బాబాకి శతకోటి నమస్కారాలు చెప్పుకున్నాము.
2023, ఆగస్టు 30న మా హాస్పిటల్లో ఒక డెలివరీ చేసాము(ఆ తల్లికి అది మూడో కాన్పు. మొదటి ఇద్దరు అమ్మాయిలు). కాన్పు జరిగాక బిడ్డ ఏడవలేదు. మా నర్సు నోటితో బిడ్డకి ఊపిరి అందించినప్పటికీ బిడ్డ ఏడవలేదు. నేను చాలా టెన్షన్ పడ్డాను. బిడ్డ వేరే చోట ఉండగా నేను తల్లి దగ్గర ఉండి, "బాబా! బిడ్డ ఏడ్చేలా చూడండి" అని అనుకున్నాను. వెంటనే ఇంకో నర్సు, "బిడ్డ ఏడ్చింది" అని చెప్పింది. అది విన్నాక నాకు చాలా చాలా ఉపశమంగా అనిపించి బాబాకి థాంక్స్ చెప్పుకున్నాను. కానీ ఆ బిడ్డ బతకడం కష్టమని పిల్లల డాక్టర్ చెప్పారు. అప్పుడు నేను, "బాబా! ఆ బిడ్డ బ్రతికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఆ బిడ్డ సురక్షితంగా ఉంది. 2023, సెప్టెంబరు 16న బిడ్డను ఇంటికి తీసుకు వెళ్లారు. "శతకోటి వందనాలు బాబా".
ఒకసారి మా స్టాఫ్ నర్సుకి ఒక బ్యాంకు సమస్య వచ్చింది. నేను తనతో, "బాబా చరిత్ర పారాయణ చేసుకో" అని చెప్పాను. ఆమె అలాగే చేస్తానని అంది. బాబా దయవల్ల మరుసటిరోజే ఆమె సమస్య తీరింది. ఇంకా నా జీవితంలో బాబా చాలా అద్భుతాలు చేశారు. "బాబా! మీ దయ ఎల్లప్పుడూ మాకు ఉండాలి".
బాబా దయుంటే ఏదైనా సాధ్యం!
నేను ఒక సాయిభక్తురాలిని. మా బాబు రోజూ రాత్రి పడుకోవడానికి చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో బాబు నిద్రపోతే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి, ఊదీ పెడితే నిద్రపోతాడు. ఇకపోతే, 2023, సెప్టెంబరులో మేము ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాము. కానీ మేము ఆ ఇంటిలోకి నెలాఖరులో మారుదాం అనుకున్నాము. ఎందుకంటే, మేము అదివరకు ఉంటున్న పాత ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్ సెప్టెంబరు నెలాఖరు వరకు ఉంది. అయితే కొత్త ఇంటి యజమాని మొదట్లో, "సెప్టెంబరులో అడ్వాన్స్ ఇచ్చారు. కాబట్టి అక్టోబర్ నెల 1వ తేదికి సెప్టెంబరు నెల అద్దె ఇవ్వమ"ని చెప్పి ఉన్నారు. అందువల్ల నాకు, 'ఆ ఇంటిలోకి మారకుండా అద్దె ఎలా చెల్లించాలి?' అనిపించి, "బాబా! కొత్త ఇంటి యజమాని సెప్టెంబరు నెలను లెక్కించకుండా నవంబర్ నెలలో అద్దె ఇవ్వమని చెప్పేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఆ ఇంటి యజమాని ఫోన్ చేసి, "నవంబర్ నుండి అద్దె ఇవ్వండి" అని చెప్పారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Sairam 🙏🙏🙏
ReplyDeletesaibaba pl bless my son saimadava in his life and sai madava baram anta meede baba , and bless all my family members always.
ReplyDeleteOm sairam
ReplyDeletePlease e pregnancy journey lo thodu vundu baba please
ReplyDeleteBless my child baba🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయిరాం బాబా నాకు దగ్గు ఎక్కువవగా ఉంది అది తగ్గితే గురువారం నీ హారతి వస్తాను బాబాఓం శ్రీ సాయిరాం బాబా నాకు దగ్గు ఎక్కువవగా ఉంది అది తగ్గితే గురువారం నీ హారతి వస్తాను బాబా
ReplyDeleteSai blessings always us
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteBaba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS College for my daughter.
ReplyDeleteBaba, please release Chandrababu Naidu from jail as quickly as possible.
ReplyDeleteOm Sri Sainathaya namah
ReplyDelete