1. బాబా దయతో సమస్యలు పరిష్కారం2. ఏ మంచి చెయ్యాలో అది చేసిన బాబా
బాబా దయతో సమస్యలు పరిష్కారం
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా బాబాకు నా నమస్కారాలు. నా పేరు మల్లీశ్వరి. మేము హైదరాబాదులో ఉంటాం. బాబా నాకు తండ్రి. నాకు సర్వస్వం ఆయనే. నేను ఏ పని మొదలుపెట్టినా బాబాకు చెప్పాకనే మొదలుపెడతాను 2023, ఆగస్టులో ఒక ఆదివారంనాడు నేను, మా పాప స్కూటీ మీద బయటకు వెళ్ళొచ్చాము. పాప బండి సెల్లార్‌లో పార్క్ చేసి బండి తాళం బండికే మర్చిపోయి వచ్చేసింది. తర్వాత మంగళవారం సాయంత్రం చూసుకుంటే బండి తాళాలు లేవు. ఇంట్లో అంతా వెతికాము కానీ, ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నేను, "ఏంటి బాబా ఈ పరీక్ష? తాళాలు ఎవరికైనా దొరికితే ఎలా?" అని బాబా ముందు చీటీలు వేస్తే, 'తాళం దొరుకుతుంది' అని వచ్చింది. తర్వాత బాబా చెప్పినట్లే తాళాలు దొరికాయి. సెల్లార్‌లో అద్దెకుండేవాళ్ళు బండికున్న తాళాలు తీసి మాకిచ్చారు. "ధన్యవాదాలు బాబా".
మా సొంత ఊరులో మేము ఒక చిన్న స్థలం తీసుకున్నాం. అది మునుపు మా తాతగారిదే. ఆ స్థలం పక్కనే మా బంధువులకి కొన్ని సెంట్ల భూమి ఉంది. అది మేము తీసుకున్న భూమితో కలిసి ఉన్నందున దానివల్ల ఎవరికీ ఏ ఉపయోగం లేదు. అందుకని ఆ భూమిని కూడా మేమే తీసుకోవాలని అనుకున్నాము. కానీ వాళ్ళు కాంటాక్ట్‌లో లేరు. కాబట్టి మేము తీసుకున్న భూమిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళకి విషయం తెలిసి రేటు ఎక్కువ డిమాండ్ చేసారు. నేను ఈ విషయం గురించి బాబాకి విన్నవించుకొని, "బాబా! ఈ సమస్య గురించి మీరే చూసుకోండి. వాళ్ళు తక్కువ ధరకి ఆ స్థలం ఇస్తే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. రెండురోజుల తర్వాత ఒకరోజు పొద్దున్న లేవగానే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు తెరిస్తే, "భూ సంబంధిత సమస్య పరిష్కారం అవుతుంద"ని అని మెసేజ్ వచ్చింది. అది నా గురించేనని, బాబా నా సమస్యకు సమాధానమిచ్చారని నాకు అనిపించింది. నిజంగానే మా ఊరిలోని ఆ భూ సమస్యకు పరిష్కారం దొరికింది. మా బంధువులు మేము అనుకున్న ధరకే ఆ స్థలం మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నారు. నిజంగా బాబాపట్ల మనకు విశ్వాసం ఉంటే, అన్నీ ఆయనే చూసుకుంటారు. మనం శ్రద్ధ-సబూరీ కలిగి ఉండాలి. నా జీవితంలో బాబా చాలా అద్భుతాలు చేసారు. "ధన్యవాదాలు బాబా. లవ్ యు బాబా. ఎల్లప్పుడూ నాతో ఉండండి. నిత్యం మీ నామస్మరణలో ఉండేలా నన్ను దీవించండి సాయి".
ఏ మంచి చెయ్యాలో అది చేసిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. 2023, మార్చిలో హఠాత్తుగా నేను, మా ఆయన శిరిడీ ప్రయాణం పెట్టుకున్నాం. నిజానికి నాకెందుకో అప్పుడు వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే, ఆ సమయంలో నాకు ఆఫీసులో షిఫ్ట్ డ్యూటీలు, వారంకి రెండు రకాల టైమింగ్స్ ఉండేవి. అందువల్ల నిద్రసరిపోక చిరాకుగా వుండేదాన్ని. అటువంటి స్థితిలో శిరిడీ వెళ్లాలని సగం, వెళ్లకూడదని సగం ఆలోచనలతోనే వెళ్ళడానికి సిద్ధమయ్యాను. ఆరోజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నాగర్సోల్ ట్రైన్ వచ్చే ప్లాట్ఫారంకి వెళ్తుంటే, ఒక్కసారిగా ఒక వ్యక్తి బాబాలా అనిపించారు. వెంటనే వెనక్కి తిరిగి చూసాను. ఆయన బాబాలానే ఉన్నారు. నేను ఆయన్ని చూస్తుంటే, ఆయన నన్ను దాటుకుని ముందుకి వెళ్లిపోయారు. నాకు ఆయనతో మాట్లాడాలని అనిపించిన్నప్పటీకీ ఏదో భయం నన్ను ఆపేసింది. అదీకాక మేము వేరే వైపు వెళ్ళాలి. ఆయన వెళ్లిపోతుంటే నా మొబైల్ కెమెరా జూమ్ చేసి ఒక ఫోటో తీసాను. తర్వాత మేము మా ప్లాట్ఫారంకి వెళ్ళాము. చూస్తే, ఆయన ఆ ప్లాట్ఫారం మీదే ఉన్నారు. మమ్మల్ని దాటుకుంటూ వేరే వైపు వెళ్లిన ఆయన అక్కడ కనిపించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఏదేమైనా బాబా నాకోసమే వచ్చారనిపించింది నాకు. మాట్లాడదాం అంటే మళ్ళీ భయం. ఆయన 'బాబా అవునో, కాదో' అని చాలాసేపు ఆయన్నే చూస్తూ వున్నాను. ఆయన కావాలని నా ముందు నుండి అటుఇటు తిరుగుతున్నట్లు అనిపించింది. మా ఆయన చెప్తే, బిస్కెట్ ప్యాకెట్ కొని భయపడుతూ ఆయన దగ్గరకి వెళ్ళాను. ఆయన నాకోసమే చూస్తున్నట్లు చక్కగా మాట్లాడారు. అయితే హిందీలో మాట్లాడినందువల్ల నాకు అర్ధం కాలేదు. నన్ను ఆశీర్వదించి వేరే వైపు వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత చూస్తే మళ్ళీ నాకు దగ్గరలోనే కనిపించారు. మా ఆయన వాటర్ బాటిల్ కొని ఆయనతో మాట్లాడారు. ఆయన శిరిడీ వెళ్తారేమో, అందుకే అక్కడున్నారనుకున్నాం. కానీ ఆయన శిరిడీ వెళ్ళడం లేదు. అసలు ఎక్కడకీ వెళ్ళడం లేదు. అది తెలిసి కేవలం ఆయన నాకోసమే, నన్ను శిరిడీకి పంపడానికి వచ్చారనిపించింది. ఆయన ఏ రూపంలో ఉన్నా బాబానే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంతటితో ప్రయాణంపట్ల నాకు ఇంటరెస్ట్ వచ్చింది. శిరిడీలో దర్శనం కూడా బాగా జరిగింది. ఆ సమయంలో నాకు IVF ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంజెక్షన్లు, టాబ్లెట్లు తీసుకుంటున్నాను. శిరిడీ నుండి వచ్చాక జరగాల్సిన IVF ప్రక్రియలోని చివరి దశ జరగలేదు. ఎందుకంటే, నా నుండి తీసిన అండాలు అసాధారణంగా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు IVF ప్రక్రియ కొనసాగిస్తే పిల్లలు అనారోగ్యంతో పుడతారు. అందుకే బాబా అలా జరగనివ్వలేదు. ఆయన నాకు ఏ మంచి చెయ్యాలో అదే చేశారు. అంతేకాదు, IVF అవసరం లేకుండానే నాకు పిల్లలు కలుగుతారని సూచన ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా".
Om Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteBaba always be with me🙏🙏🙏🙏🙏
ReplyDeleteThanks to sai maharaj group admins🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOma Sri Sai Ram
ReplyDeleteOmsaisri Sai Jai Sai Ram 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteBaba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS College for my daughter.
ReplyDeleteBaba, release Chandrababu Naidu from jail.
ReplyDelete