సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1652వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రాజెక్ట్ విజయవంతమయ్యేలా దీవించిన బాబా
2. ఊదీ అందించి మరీ సమస్యను పరిష్కరించిన బాబా

ప్రాజెక్ట్ విజయవంతమయ్యేలా దీవించిన బాబా

 ఓంసాయి శ్రీసాయి జయజయసాయి|
ఓం శ్రీసాయినాథాయ నమః||

నేను ఒక సాయిభక్తుడిని. నేను సంగారెడ్డి నివాసిని. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతాను. ఆ అనుభవాలు మాలోని భక్తి భావాన్ని మరింత పెంచుతున్నాయి. బాబా దయవల్ల నాకు ఎటువంటి కష్టాలు లేవు. నన్ను బాబా ప్రతి నిమిషం కాపాడుతూ నా జీవితాన్ని జయప్రదంగా నడిపిస్తున్నారు. అయినా జీవితంలో చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి. రావాలి కూడా. కష్టాలు ఉంటేనే దేవుడిని ఆశ్రయిస్తాము. నాకు బాబాతో చెప్పలేనన్ని అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్నిరోజుల ముందు జరిగిన ఒక అనుభవాన్ని తెలియజేస్తాను.

నేను ఒక ఫార్మా ఇండస్ట్రీలో ఉద్యోగం చేస్తున్నాను. మా మేనేజర్ చాలా నిక్కచ్చి మనిషి. అతనికి పని పూర్తవ్వడమే ముఖ్యంగాని ఆ పని చేయడంలో అవసరమయ్యే ఎటువంటి సహకారాన్ని అందించడు. ఈ విషయంలో నాకు, మా మేనేజరుకి ఈమధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఆ కారణంగా అతను నన్ను కొంచెం దూరం పెట్టి పని తనే చేసుకున్నాడు. నాకు చాలా బాధ కలిగి నా పని చేయడానికి ఎంతో కష్టపడ్డాను. తర్వాత కూడా అతను నన్ను దూరంగా పెడుతూ నేను లేకపోయినా పని జరుగుతుందని నిరూపించాలని అనుకున్నాడు. అందువల్ల నేను చేసిన ప్రాజెక్ట్ వేరేవాళ్లకు ఇచ్చి చేయించాడు. అయితే ఆ వ్యక్తి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయాడు. మా మేనేజర్ కూడా చాలా ప్రయత్నించాడు కానీ, ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఇక అప్పుడు అతను నన్ను పిలిచి, "నువ్వు చేసిన ప్రాజెక్ట్ తప్పుగా వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మళ్ళీ చేసి చూపించు. ఎవరి సహాయం తీసుకోవద్దు" అని అన్నాడు. అలాగే ఎవరూ నాకు సహాయం చేయకూడదని సహోద్యోగులకు చెప్పాడు. అప్పటినుండి అతను నాతో కొంచం బాగానే మాట్లాడుతుండేవాడు. కానీ నేను ఆ ప్రాజెక్ట్ చేసి చూపించకపోతే, నెమ్మదిగా నన్ను ఉద్యోగం నుండి తీసేయొచ్చన్నది అతను తలంపుగా నాకనిపించి చాలా బాధ, భయం కలిగి బాబాని తలుచుకొని, ఆయనకు నా కష్టం చెప్పుకొని, "ఈ ప్రాజెక్ట్ విజయవంతమయ్యేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నంత కాలం నేను బాబాను తలుచుకుంటూ ఉండేవాడిని. బాబా దయవల్ల నేను ఆ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేసి మేనేజర్‌కి చూపించాను. అతను బాగుందని అన్నాడు. పైగా అతనికి నా మీద నమ్మకం ఇంకా పెరిగింది. అంతా బాబా దయ. "శతకోటి వందనాలు బాబా. నా జీవితంలో ప్రతి క్షణం మీరు నాతో ఉండి నన్ను నడిపిస్తున్నారు. అత్యంత పవిత్రమైన మీ పాదాల వద్ద ఒక ధూళి కణంలా ఎప్పుడూ నేను మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉండేలా నన్ను పట్టుకోండి బాబా. ప్రతిక్షణం నేను మిమ్మల్ని గుర్తు ఉంచుకొనేలా ఆశీర్వదించు బాబా".


ఊదీ అందించి మరీ సమస్యను పరిష్కరించిన బాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు కల్యాణి. నేను గత నాలుగు నెలలుగా ఈ బ్లాగ్ ఫాలో అవుతున్నాను. నేను ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివి చాలా ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా వారి అనుభవాల ద్వారా బాబా ఊదీ మహిమ గురించి నేను తెలుసుకున్నాను. ఇక నా అనుభవానికి వస్తే.. నేను చాలా రోజులుగా ఓవర్ బ్లీడింగ్ సమస్యతో బాధపడుతున్నాను. గత రెండు నెలలుగా ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. నేను చాలా ఆందోళన చెంది డాక్టర్ దగ్గరకు వెళితే టాబ్లెట్లు ఇచ్చారు. కానీ సమస్య తగ్గలేదు. ఆ సమయంలోనే నేను బాబా ఊదీ మహిమ గురించి తెలుసుకొని ఊదీనే ఔషధంగా తీసుకోవాలి అనుకున్నాను. అయితే నేను గుడులకు ఎక్కువగా వెళ్ళను. అయినా ఊదీ కోసం ఒక గురువారంనాడు బాబా గుడికి వెళ్ళాను. కానీ నాకు అక్కడ ఊదీ దొరకలేదు. నిరాశతో తిరిగి వస్తుంటే ఒక గది కనిపించింది. ఆ గదిలో బాబా ఫోటోలు ఉన్నాయి. ఆ గదిలో ఊదీ ఉంటుందేమో అని చూసాను కానీ, అక్కడ కూడా ఊదీ కనిపించలేదు. నిరాశగా అక్కడున్న పల్లకి మీద ప్రమిదలు ఉంటే తీసుకొని దీపాలు వెలిగించాను. తర్వాత నేను వెనుతిరిగి రాబోతున్న సమయంలో ఆ పల్లకి పైన రెండు ఊదీ ప్యాకెట్లు నాకు కనిపించాయి. ఆశ్చర్యమేమిటంటే, అదివరకు నేను అదే పల్లకి పైన ఊదీ కోసం చాలా సేపు వెతికాను. అప్పుడు అవి కనిపించలేదు. దీపాలు వెలిగించాకనే కనిపించాయి. బాబా ఆశీర్వాదం లభించిందని సంతోషంగా ఆ ఊదీ ప్యాకెట్లు తీసుకొని ఇంటికి వచ్చేసాను. మరుసటిరోజు నుండి ఉదయం నిద్రలేవగానే ఊదీనే ఔషధంగా కాస్త నోట్లో వేసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత ఈ నెల(2023, సెప్టెంబర్) నెలసరి వచ్చింది. ఆశ్చర్యం! నా జీవితంలో అంత తక్కువ బ్లీడింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. నాకున్న ఆ ఆరోగ్య సమస్య తీరడంతో నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. బాబాపై నమ్మకం ఉంచితే సమస్యల నుండి మనల్ని గట్టెక్కిస్తారనడానికి నా ఈ అనుభవం ఒక ఉదాహరణ. నాలా ఆరోగ్య సమస్యలతో బాధడుతున్నవారికి సహాయపడుతుందన్న కారణంతో నేను ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. నా సమస్యను పరిష్కరించిన బాబాకి ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.


15 comments:

  1. ఓం శ్రీ సాయి రామ్ 2సాయి లీల చాలా బాగుంది.అప్పటి వరకు లేని ఊదీ పొట్లాలు అక్కడ వుండడం సాయి మహిమే కదా

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  8. బాబా ma తమ్ముడికి ఆరోగ్యం prasadinchandandi baaba ఒక నల్ల కుక్కకు 2 చపాతీlupedtanu tandi

    ReplyDelete
  9. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  10. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏

    ReplyDelete
  11. Nagarani Naku na jab cavali thandri nuve prasadinchu

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo