1. బాబా దయతో నెరవేరిన కోరిక - చేకూరిన ఆరోగ్యం2. బాబా అనుగ్రహంతో తగ్గిన విరోచనాలు
బాబా దయతో నెరవేరిన కోరిక - చేకూరిన ఆరోగ్యం
నా పేరు సౌజన్య. ముందుగా సాయి బంధువులందరికీ నమస్కారం. నేను సాయిబాబాని గత 12 సంవత్సరాలుగా నమ్ముతున్నాను. ఆయన ఎన్నోసార్లు నాకు సహాయం చేసారు. 2023, ఆగస్టు నెల మొదటి వారంలో నేను మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాను. కానీ కుదరలేదు. రెండు వారాల తర్వాత మళ్లీ ప్రయత్నించాను. అప్పుడు కూడా వెళ్లడానికి కుదరలేదు. ఇక అప్పుడు, "బాబా! నేను అమ్మవాళ్ళింటికి వెళ్ళేలా చూడు స్వామి" అని బాబాకి మ్రొక్కుకొని ఆయన మీద నమ్మకం ఉంచాను. విచిత్రమేమిటంటే, అదే వారంలో ఆగస్టు 25న నేను క్షేమంగా అమ్మావాళ్ళింటికి వెళ్ళొచ్చాను. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. నాకు ఒక కోరిక ఉంది. దాన్ని మీరే తీర్చాలి తండ్రీ. మీ కృప ఎల్లప్పుడూ మా మీద ఉండేలా అనుగ్రహించండి బాబా".
2023, సెప్టెంబర్ 11, సాయంత్రం మా బాబుకి జ్వరం వచ్చింది. ఎప్పటిలాగే బాబుకి సిరప్ వేసి నేను, మా పాప బాబా రక్షణ స్తోత్రం చదివాము. బాబా దయవల్ల మరుసటిరోజుకి బాబు జ్వరం తగ్గిపోయింది. అయితే ఆరోజు మధ్యాహ్నం నుండి నాకు జ్వరం, వణుకు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు మొదలయ్యాయి. నేను బాబా రక్షణ స్తోత్రం చదువుకుంటూనే టాబ్లెట్లు వేసుకున్నాను. సాయంత్రానికి అన్ని సమస్యలు తగ్గిపోయాయి. టాబ్లెట్లు వేసుకోవడం వల్ల తగ్గి ఉండొచ్చని మీరు అనుకుంటే, అది పొరపాటు. ఎందుకంటే, అదివరకు ఇలానే జ్వరం వస్తే టాబ్లెట్లు వేసుకుంటున్నా రెండురోజుల వరకు తగ్గలేదు. చివరికి హాస్పిటల్‌కి వెళ్లి ఇంజక్షన్ వేయించుకున్నాకే తగ్గింది. అలాంటిది ఈసారి బాబా దయవల్ల సగం రోజులోనే తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. ఈమధ్య మా బాబుకి తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వస్తున్నాయి. ఎలాగైనా అవి రాకుండా చూసి బాబు ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించండి".
బాబా అనుగ్రహంతో తగ్గిన విరోచనాలు
నేను ఒక సాయి భక్తురాలిని. 2023, ఆగస్టు 5వ తేదీ నుండి మూడు రోజులపాటు మూడు సంవత్సరాల వయసున్న మా చెల్లి బాబుకి విరోచనాలు అవుతుండగా ఆగష్టు 8, ఉదయం మరీ ఎక్కువసార్లు విరోచనాలు అయ్యాయి. నాకు చాలా భయమేసి వెంటనే బాబా ఊదీ తీసుకొని బాబుకి బొట్టు పెట్టి, పొట్టకి రాసాను. తర్వాత నాకెందుకో బాబుని బాబా గుడికి తీసుకెళ్లి దణ్ణం పెట్టుకొని వద్దామనిపించింది. కానీ వాళ్ళు, "బాబు నాన్నమ్మ చనిపోయి ఒక వారమే అయింది. గుడికి వెళ్ళకూడదు" అన్నారు. అందువల్ల నేను బాబుని బయటనుంచి అయినా బాబాకి చూపించి, దణ్ణం పెట్టుకొని వద్దామని అనుకొని బాబాను, "బాబా! బాబును తీసుకొని రావచ్చా, వద్దా" అని అడిగాను. మళ్లీ అంతలోనే వద్దులే అనుకొని నేనొక్కదాన్నే బయలుదేరాను. అయితే బాబు ఏడుస్తూ నా వెనక రాసాగాడు. కానీ నేను వాడిని ఎత్తుకొని అంత దూరం వెళ్లలేనని వాడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాను. అంతలో మా తమ్ముడు ఎదురొస్తే, "బైక్ మీద బాబా గుడికి తీసుకెళ్తావా?" అని అడిగాను. వాడు, "వెళదాం అక్క" అని అన్నాడు. వాడు అలా అనేసరికి బాబానే బాబును గుడికి తీసుకురమ్మంటున్నారు అని నాకు అనిపించింది. వెంటనే బాబుని తీసుకొని బాబా గుడికెళ్లి బయటనుంచి బాబాకి దణ్ణం పెట్టుకొని తిరిగి ఇంటికి తీసుకొచ్చాను. మూడు రోజుల నుండి ఎన్ని మందులు వాడినా తగ్గని విరోచనాలు బాబా గుడికెళ్లొచ్చాక రాత్రి వరకు ఒక్కసారి కూడా విరోచనం అవ్వలేదు. ఇప్పుడు బాబుకి చాలా బాగుంది, చక్కగా ఆడుకుంటున్నాడు. బాబాకి ఎంతలా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే!
ఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sai ram🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteBaba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS College for my daughter.
ReplyDeleteBaba, please release Chandrababu Naidu from jail.
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteSaibaba pl bless my son saimadava to get rid of anger, not to follow the proper ways , and saibaba see that my mother-in-law accept my request to change the residence. If she accepts I will post in this blog baba
ReplyDeleteOm sai ram
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram 🙏🙏🙏🙏
ReplyDeleteసాయి నా ప్రతి కోరిక నా పక్కనుండే తీరుస్తున్నావ్ కన్ను అయితే అడిగిన అడగకపోయినా మనసులో తెలుసుకోగానే తీర్చేస్తున్నావ్ కానీ నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసావు నువ్వే కదా నా భర్తని నన్ను కలిపింది మరి ఎందుకు ఈరోజు మమ్మల్ని తన్ని దూరంగా ఉంచావు నేను తనకి దూరంగా ఉండలేను సాయి. నువ్వే తన మనసు మార్చి ఒకవేళ నా తప్పు ఉంటే క్షమించండి నన్ను కాపురానికి తీసుకెళ్లేలా చూడు సాయి నిన్ను నమ్మి బ్రతుకుతున్న తండ్రి
ReplyDelete