- శ్రీసాయి అనుగ్రహ జల్లులు
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు మంజు. నేను హైదరాబాద్ నివాసిని. మూడేళ్ళ కిందట మా ఆర్థిక స్తోమత వృద్ధి చెందడం కోసం ఒక స్నేహితురాలు చెప్పిందని 'సాయి దివ్యపూజ' చేశాను. బాబా అనుగ్రహించి మంచి ఫలితాన్ని ఇచ్చారు. అప్పటినుండి ఏది కావాలన్నా నేను 5 వారాలు దివ్యపూజ చేస్తున్నాను. కోవిడ్ సమయంలో నా భర్త ఉద్యోగం పోయి ఆర్థికంగా పరిస్థితి కాస్త కఠినంగా మారింది. అప్పుడు కొత్త ఉద్యోగం రావాలని నేను, నా భర్త 5 వారాలు నమ్మకంతో దివ్యపూజ చేసాం. 5వ వారం పూజ రోజు మావారికి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. మేము చాలా సంతోషించాము. దివ్యపూజ నమ్మకంతో చేస్తే బాబా తప్పనిసరిగా తమ ఉనికిని తెలియజేస్తారు, ప్రతి అడుగులోనూ మనకి మార్గనిర్ధేశం చేస్తూ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. నేను చాలామంది నా స్నేహితులకి దివ్యపూజ గురించి చెప్పాను. వాళ్లంతా మంచి ఫలితాన్ని పొందారు. క్రమంగా నాలో బాబా మీద భక్తి, విశ్వాసాలు పెరగసాగాయి.
సొంత ఇల్లు కట్టుకోవాలని ఎన్నో సంవత్సరాల నుండి నా మనసులో కోరిక ఉండేది. కానీ ఇల్లు కట్టేంత డబ్బు మా దగ్గర లేదని నాకు తెలుసు. అయినప్పటికీ గత ఏడాది(2022) సొంతింటి కోసం దివ్యపూజ చేయాలనిపించి చేశాను. కానీ ఆర్థిక బలం లేనందున ఇల్లు కడతామన్న నమ్మకం నాకు పెద్దగా లేదు. అయితే ఎప్పుడూ లేనిది హఠాత్తుగా మావారికి ఇల్లు కట్టాలన్న ఆలోచనలు మొదలయ్యాయి. దాంతో మాకు ఎప్పుడు ఇస్తే బాగుంటుందో బాబాకి తెలుసు, సరైన సమయంలో ఆయన ఇస్తారని నాకు అర్థమై చాలా సంతోషపడ్డాను. కొన్ని నెలలు తర్వాత దివ్యపూజ మళ్ళీ చేశాను. అనుకోకుండా నా అత్తమామలు కూడా ఇంటి నిర్మాణం గురించి ఆసక్తి చూపించి, "ఆర్థికంగా సహాయం చేస్తాం" అని చెప్పారు. ఇంటి నిర్మాణం మొదలవుతుందని ఆశగా ఎదురుచూశాను కానీ, ఏవో తెలియని అడ్డంకులు వచ్చాయి. అప్పుడు "పని మొదలవ్వాలి" అని బాబాని బలంగా వేడుకొని మళ్ళీ ఐదు వారాల దివ్యపూజ మొదలుపెట్టాను. బాబా దయవల్ల నాలుగోవారానికి మేము భూమిపూజ చేసుకున్నాము. ప్రస్తుతం ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇదంతా బాబా అనుగ్రహం.
నేను ఒకటిన్నర సంవత్సరం నుండి అండాశయ తిత్తి(Ovarian cyst) సమస్యతో బాధపడుతున్నాను. గత సంవత్సరం(2022) సర్జరీ ద్వారా తిత్తి తొలగించుకున్నప్పటికీ ఒక్క నెలలోనే మళ్లీ తిత్తి ఏర్పడింది. ఆ సమయంలోనే నాకు బాబా మీద భక్తి బాగా పెరిగింది. ప్రతి గురువారం తప్పనిసరిగా బాబా దర్శనం చేసుకుంటూండేదాన్ని. తిత్తి కోసం వాడుతున్న అల్లోపతి మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల పైల్స్ సమస్య కూడా మొదలై మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండేవి. ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తే పైల్స్ సమస్య కొంచెం తగ్గింది. అండాశయ తిత్తి విషయంలో మాత్రం మందులు ప్రభావం అంతగా ఉండదు. అందువల్ల నిరంతరం మందులు వాడటం లేదా గర్భాశయం మరియు అండాశయాల తొలగింపు చివరి ప్రత్యామ్నాయం. అందువల్ల నేను మానసికంగా సన్నద్ధమై 2023, ఆగస్టులో సర్జరీకి ప్లాన్ చేసుకున్నాను. ఒక వారంలో సర్జరీ అనగా ఒకరోజు సాయంత్రం వాకింగ్‌కి వెళ్తుంటే వర్షం వల్ల సిమెంట్ రోడ్డు మీద ఉన్న బురదలో కాలు జారి పడిపోయాను. పడుతూనే నాకు చాలా భయమేసి బాబాని తలుచుకొని, "పెద్దగా ఏం జరగకూడదు బాబా" అని అనుకున్నాను అయితే సిమెంట్ రోడ్డు అయినందున మోకాలికి చాలా గట్టిగా దెబ్బ తగిలింది. మోకాలి వద్ద ప్యాంటు అంతా చిరిగిపోయింది. నేను మనసులో, "బాబా! ఒక సంవత్సరం నుండి వున్నా ఆరోగ్య సమస్యకి ముగింపు చెప్పాలని సర్జరీకి ప్లాన్ చేసుకుంటే ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. ఏ ఫ్రాక్చర్ అవ్వకుండా చూడు బాబా. నిన్నే నమ్ముకున్నాను" అని అనుకుని మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాను. కానీ చిన్నగా ఫ్రాక్చర్ అయ్యుంటుందని నా మనసుకి బలంగా అనిపించింది కానీ, ఎక్కడా పెద్ద దెబ్బ తగలలేదు. వోలినితో రెండు రోజుల్లో నొప్పి దాదాపు తగ్గింది.
సిమెంట్ రోడ్డు మీద కాలు జారి పడిపోయిన రోజు రాత్రి ఫేస్బుక్ చూస్తున్నప్పుడు మొదటిసారి 'సాయి మహారాజ్ సన్నిధి' పేజీ చూసాను. ఎందుకో అక్కడున్న భక్తుల అనుభవాలు చదవాలనిపించి చదివితే నాకు జరిగిన అనుభవం లాంటి అనుభవాన్నే ఎవరో ఒక భక్తురాలు పంచుకున్నారు. ఆమె కూడా మోకాలికి ఫ్రాక్చర్ అనుకోని బాబాకి మొక్కుకుంది. కానీ ఏం అవ్వలేదు. అది చదివి, 'నాకు జరిగిన అనుభవంలానే ఉన్న అనుభవాన్ని ఈ పేజీలో పంచుకున్నారు. ఇదెలా?' అని నేను అక్షరాలా షాకయ్యాను. ఆ అనుభవం ద్వారా బాబా 'నేనున్నాను. ఏం భయపడకు' అని చెప్తున్నారని నాకు అర్దమై బాబా ఎప్పుడూ నా వెనుక ఉండి నన్ను కాపాడుతున్నారు అనుకున్నాను. కానీ సర్జరీ గురించి చాలా భయపడి 'సర్జరీ మంచిగా జరిగి కొంచెం సెట్ అయ్యాక నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను' అనుకొని బాబా నామాన్ని జపిస్తూ ఉండేదాన్ని. బాబా దయవల్ల ఎటువంటి సమస్యలు లేకుండా సర్జరీ సాఫీగా జరిగింది. ఇప్పటికి ఒక నెల అయింది. ఇప్పుడు నా ఆరోగ్యం కొంచెం సెట్ అయింది. పైల్స్ సమస్య కోసం ఆయుర్వేద మందులు వాడటం కొనసాగిస్తున్నాను. బాబా దయతో ఒక మూడు నెలల్లో పూర్తి ఉపశమనం లభిస్తుందని దృఢంగా నమ్ముతున్నాను. ఇలా నా జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బాబా ఎప్పుడూ నా పక్కనే ఉంటూ నన్ను రక్షిస్తున్నారు. ఆయన అనుగ్రహం భక్తులందరికీ లభించాలని కోరుకుంటున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. తొందరలోనే మీ దర్శనార్థం నన్ను శిరిడీకి రప్పించుకోండి బాబా".
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 omsaisri Sai Jai Sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sairam 🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteBaba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS College for my daughter.
ReplyDeleteBaba,please release Chandrababu Naidu from jail today.
ReplyDeleteNaku na batha tho kalisi bathalani undhi baba sai
ReplyDeletesaibaba maa babu saimadava manasu maarchi schoolki vellelaga cheyi baba , enduku ela avuthunnado teliyatam ledu baba maa varini kuda maarchu baba
ReplyDelete