సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1651వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మకముంచితే అన్నీ తీరుస్తారు బాబా
2. పోయిన వస్తువులు దొరికేలా దయ చూపిన బాబా

నమ్మకముంచితే అన్నీ తీరుస్తారు బాబా

సాయి మహారాజ్‌కి నా పాదాభివందనాలు. నా పేరు రమ్య.  మా పాపకి 5 సంవత్సరాల వయసు. తనకి ఒకసారి జ్వరం వచ్చి శరీరమంతా అలర్జీ వచ్చింది.  దురదగా ఉందని పాప ఏడిస్తే, నేను హాస్పిటల్‌కి వెళదామనుకున్నప్పటికీ 'బాబా పాప బాధను తగ్గిస్తారు. ఈరోజు తగ్గిపోతుందిలే' అని పాప నోటిలో ఊదీ వేసి, బాబాకి దణ్ణం పెట్టుకొని ఊరుకున్నాను. అలా ఒక 4 రోజులు పాప బాధపడ్డాక దానంతట అదే తగ్గిపోయింది.

ఒకరోజు నా బంగారు చెవి రింగు ఇంట్లో కిందపడి కనిపించలేదు. అసలే బాధల్లో ఉన్న నేను కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో అంతా వెతికాను, కానీ ఆ చెవి రింగు దొరకలేదు. అప్పుడిక బాబాని మనసులో తలుచుకొని మళ్ళీ వెతికితే, నా కాలి పాదానికి గుచ్చుకొని కనిపించింది. చిన్నదే అయినా బాధ నుండి విముక్తి కలిగించారు బాబా. నమ్మకముంచితే అన్నీ తీరుస్తారు బాబా. బాబా మీద భారమేస్తే, ఎవరు మనల్ని వదిలిసినా ఆయన వదలరు. మనకి కాస్త ఓపిక, సహనం ఉండాలి. "ధన్యవాదాలు బాబా. నేను ఏ స్థితిలో ఉన్నానో మీకు తెలుసు. నేను మీరు నాకు తోడు లేరు అనుకోగానే నాకు మార్గం చూపి నేను నీతోనే ఉన్నానని నిరూపిస్తావు. మీ ప్రేమ తల్లి బిడ్డని గిల్లి మళ్ళీ ముద్దాడినట్లు ఉంటుంది”.

2023, సెప్టెంబర్ నాలుగో వారంలో నా ఐ-ఫోన్ కిందపడి ఛార్జింగ్ ఎక్కలేదు. ఛార్జింగ్ పిన్ పాడైనట్లైతే కొత్తది వేయాలంటే ఐ-ఫోన్ అవ్వడం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత డబ్బు నా దగ్గర లేక బాబా ఫోటో ముందు దణ్ణం పెట్టుకొని ఛార్జింగ్ పని చేసేలా చేయమని బాధపడ్డాను. బాబా దయవల్ల ఛార్జింగ్ ఎక్కింది. ఇది చిన్న విషయమే అయుండొచ్చు కానీ, నాకు పెద్ద విషయమే. ఎందుకంటే, నాకు డబ్బుకి ఇబ్బంది ఉంది. "ధన్యవాదాలు బాబా. మీ దయ నా మీద, నా బిడ్డ మీద ఎప్పటికీ ఉంచు. నువ్వు తప్ప మాకు ఎవరూ లేరు". 

మేము పండగలకి ప్రసాదాలు తయారు చేస్తాము. ఈమధ్య ఒకసారి మాకు ప్రసాదం ఆర్డర్ వస్తే, మరుసటిరోజు పొద్దున్నే లేచి ప్రసాదం చేద్దామని అన్నీ సిద్ధం చేసుకున్నాను. అయితే రావాల్సిన సమయానికన్నా నలుగురు రోజులు ముందుగా ఆ రాత్రి 2 గంటలప్పుడు నాకు నెలసరి వచ్చింది. దాంతో వాళ్లకి ఏం చెప్పాలో తెలియక నాకు చాలా బాధేసింది. మా అమ్మ, "నువ్వు బయటకు రావద్దు. ఆ గదిలోనే ఉండు. అన్నీ నేను చేసుకుంటాను" అనింది. కానీ నా మనసులో ఏదో భయం. 'నేను లేకుండా అమ్మ ఒక్కతే ఎలా చేస్తుంది' అని గదిలో పడుకొని బాధపడుతూ మనసులో, "బాబా! అమ్మకి తోడుగా ఉండి ప్రసాదాలు మంచిగా వచ్చేలా చూడు తండ్రీ. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను, వీధి కుక్కలకి బిస్కెట్లు పెడతాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల చేయాల్సిన రెండు రకాల ప్రసాదాలు బాగా కుదిరాయి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. “సాయినాథా! మీ దయ, మీ ప్రేమ, కరుణ నా మీద, నా బిడ్డ మీద, మా కుటుంబం మీద, అలాగే భక్తులందరీ మీద ఎప్పుడూ కురిపిస్తూ కాపాడుతూ ఉండు తండ్రీ. నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను బాబా. దాన్ని పరిష్కరించి ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకొనే అదృష్టాన్ని ప్రసాదించు బాబా".

సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


పోయిన వస్తువులు దొరికేలా దయ చూపిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు పి.నాగేంద్రమ్మ. ఒకసారి మా ఇంటి గృహప్రవేశం హడావిడిలో నేను నా బంగారు కంకణాలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. అంతా వెతికినా కనిపించలేదు. ఇక అప్పుడు నేను, "సాయీ! నా కంకణాలు కనిపిస్తే, మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని సాయినాథుని వేడుకున్నాను. తర్వాత ఆశ్చర్యంగా ఆ కంకణాలు నా బట్టల మధ్యలో  దొరికాయి. ఆ తర్వాత రెండు రోజులకి బంగారం అంతా చూసుకుంటే, ఇంకొక నెక్లెస్ కనిపించలేదు. అప్పుడు కూడా నా సాయినాథుడు ఆ నెక్లెస్ కనిపించేలా చేసారు. "ధన్యవాదాలు సాయినాథా. ఏదైనా అడిగిన వెంటనే వెన్నంటుండి నడిపిస్తున్నావు తండ్రీ. లవ్ యు సాయి".


15 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  7. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  9. Om Sri Sairam 🙏🙏🙏

    ReplyDelete
  10. Sai baba pl bless my son saimadava in his life and try to change my husband attitude in his life saimadava bharam anta neede swamy

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo