1. కంటికి రెప్పలా కాపాడే బాబా2. సాయిని వేడుకున్న కాసేపటికి ఆగిన నీళ్ల విరోచనాలు
కంటికి రెప్పలా కాపాడే బాబా
సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు రేవతిలక్ష్మి. నాకు చిన్నప్పటినుంచి బాబా అంటే చాలా ఇష్టం. చిన్న, పెద్ద ఏ కష్టమైనా, సమస్య అయినా నేను బాబాకే చెప్పుకుంటాను. 2022లో మావారి ఆఫీసులో కొన్ని సమస్యల వలన జీతాలు ఇవ్వడం మానేశారు. మాకు చాలా ఇబ్బంది అయింది. ఎవరిని సహాయం అడుగుదామన్నా మా అక్క, చెల్లెలు అందరూ మా స్థాయిలో ఉన్నవాళ్లే. అందుకే ఎవరినీ అడగకుండా తప్పనిసరి పరిస్థితుల్లో లోన్ తీసుకుని ఆ డబ్బులతో రోజులు గడిపాము. ఆ లోన్ డబ్బులు కూడా అయిపోవస్తున్న సమయంలో భవిష్యత్తు గురించి నాకు చాలా భయమేసింది. అప్పుడు బాబాని, "మీరే మా కష్టాలు తీర్చాలి. మావారికి ఏదైనా మంచి ఉద్యోగం మీరే ఇప్పించాలి" అని వేడుకున్నాను. అయితే మావారు ఇంటర్వ్యూలకి వెళ్తున్నప్పటికీ, అంతా సరిగా జరిగినప్పటికీ ఆఖరి నిమిషంలో ఉద్యోగం మాత్రం వచ్చేది కాదు. దాంతో నాకు అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపించింది. ఆ సమయంలో నాకు దాసగణు మహారాజ్ రచించిన 'సాయినాథ స్తవనమంజరి' గుర్తుకు వచ్చింది. అది చదివిన వారి ఏ కోరికైనా బాబా తీరుస్తారు. కానీ ఆ పుస్తకం నాకు అందుబాటులో లేదు. అందుకని విన్నా కూడా అదే ఫలితం ఉంటుందనిపించి టీవీలో పెట్టుకుని ఎంతో భక్తిశ్రద్ధలతో వినికి, "మావారికి ఉద్యోగం రావాల"ని నా కోరిక బాబాకి చెప్పుకున్నాను. అంతే, అనుకోకుండా ఒక ఆవిడ ఫోన్ చేసి మా వారిని ఇంటర్వ్యూకి రమ్మనడం, మావారు వెళ్లడం, ఆ ఉద్యోగం రావడం, మా కష్టాలు తీరడం జరిగిపోయాయి. విషయం ఏమిటంటే, ఎవరో మా ఆయనకి తెలిసినవాళ్ళు మావారి బయోడేటా ఆవిడకి పంపించారట. ఆ విషయం ఆవిడే చెప్పింది. అంతా చేసింది బాబా దయే అని నా నమ్మకం. ఈ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది.
మేము ఐదుగురు అక్కచెల్లలం. గత కొంతకాలంగా చిన్న చిన్న అపార్ధాల వల్ల మాలో కొంతమంది మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి పెద్ద గొడవలుగా మారి అందరూ విడిపోతారేమో అని నాకు చాలా భయం పట్టుకుంది. అందువల్ల నేను దిగులుగా ఉంటూ "అలా జరుగుకూడద"ని బాబాను సదా కోరుకుంటూ ఉండేదాన్ని. 2023, సెప్టెంబర్‌లో మా నాన్నగారి సంవత్సరికం జరిగింది. ఆ కార్యక్రమానికి కొన్ని కారణాల వలన నేను వెళ్ళలేకపోయినా మిగతా వాళ్ళు వెళ్లారు. అప్పుడు నేను అక్కడ ఏం గొడవలు జరుగుతాయో అని కంగారుపడి, "బాబా! గొడవలు జరగకుండా మా నాన్నగారి సంవత్సరికం మంచిగా జరగాలి. మీదే భారం. అంతా ప్రశాంతంగా జరిగితే నా అనుభవాలను తోటి భక్తులతో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల ఏ గొడవలు లేకుండా కార్యక్రమం చక్కగా జరిగింది. బాబా భక్తులందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం. అందరినీ ఆయన కంటికి రెప్పలా కాపాడుతారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సాయిని వేడుకున్న కాసేపటికి ఆగిన నీళ్ల విరోచనాలు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నేను ఒక సాయిభక్తురాలిని. మా నాన్నకి 70 సంవత్సరాల వయసు. ఆయనకి 2023, సెప్టెంబరు 12, మంగళవారం రాత్రి హఠాత్తుగా నీళ్ల విరోచనాలు మొదల్యయ్యాయి. మరుసటిరోజు ఉదయం డాక్టర్ వచ్చి మందులు ఇచ్చారు. కానీ విరోచనాలు ఆగలేదు. మధ్యాహ్నం వరకు దాదాపు 30 సార్లు అయ్యాయి. నేను అదే ఊరిలో ఉన్నప్పటికీ వెళ్లి చూడలేని పరిస్థితి. అమ్మకి ఫోన్ చేస్తే, "మీ నాన్న చాలా భయపడుతున్నారు" అని చెప్పింది. అప్పుడు నేను అమ్మతో, "'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించమ"ని చెప్పాను. నేను కూడా ఆ నామాన్ని జపిస్తూ, "బాబా! నాన్న త్వరగా కొలుకుంటే, మీ అనుగ్రహాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని సాయితండ్రిని ప్రార్థించి కొద్దిగా ఊదీ నా నుదుటన పెట్టుకొని, నాన్నని తలుచుకుంటూ మరికొంత ఊదీ నోట్లో వేసుకున్నాను. కాసేపటికి సాయంత్రం 4 గంటలప్పుడు నాన్నకి వాంతి అయింది. సరిగ్గా అదే సమయానికి డాక్టర్ మళ్ళీ వచ్చి, వేరే టాబ్లెట్లు ఇచ్చి, "తగ్గకపోతే మళ్లీ వస్తాన"ని చెప్పి వెళ్ళారు. కానీ డాక్టరు మళ్ళీ రావాల్సిన అవసరం రాలేదు. సాయి దయవల్ల నాన్నకి వాంతి అయినప్పటి నుండి విరోచనాలు తగ్గాయి, మళ్లీ కాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. ఇదంతా మీ దయవల్లే తండ్రీ. అందరూ బాగుండేలా చూడండి సాయి".
ఓం శ్రీ సాయి రామ్ బాబా ఊదీ మహిమ చెప్పడం చాలా కష్టమైన పని.అనుభవము పొందిన భక్తులు చాలా అదృష్టవంతులు.ఊదీని నమ్ముతూ వుంటే ఆ సాయి మహిమలు తెలుస్తాయి.జబ్బులు తగ్గుతాయి.నాకు అలాగే జరిగింది.ఆ బాబాని పూర్తిగా నమ్ముతాం.ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteఓం సాయిరామ్
DeleteSai kapadandi
ReplyDelete🌺🌺 Om Sai Ram 🌺🌺
ReplyDeleteఓం సాయారామ్
ReplyDeleteOm sai ram 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba pregnancy journey lo thodu vundu baba please.healthy baby ni ivvu baba please baba
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Sainathaya namah
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba eesari nenu anukunna korikalu thirali
ReplyDelete