1. 'నేను నీతోనే, నీ వెంటే ఉన్నాన'ని ఆశీర్వదించిన బాబా2. బాబా ఊదీ వాడడం వల్ల తగ్గిన బాధ
'నేను నీతోనే, నీ వెంటే ఉన్నాన'ని ఆశీర్వదించిన బాబా
సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు త్రివేణి. 5 సంవత్సరాలుగా నేను గర్భవతినన్న వార్తకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అందుకోసం నేను IVF చికిత్స చేయించుకుంటున్నాను. అందులో భాగంగా జరిగిన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి 2023, సెప్టెంబర్ 22న ప్రచురితమైన అనుభవమాలిక 1632వ భాగంలో పంచుకున్నాను. అందులో నేను చివరిన బాబాను, "FET ప్రక్రియ విజయవంతమై నేను గర్భవతినయ్యేలా చూడమ"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆ ప్రక్రియ విజయవంతమై నేను గర్భవతినయ్యాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఐదేళ్లగా ఎదురుచూస్తున్న కోరిక బాబా దయవల్ల నేరవేరింది. డాక్టర్ 2023, సెప్టెంబర్ 22న కడుపులోని బిడ్డ హార్ట్ బీట్ తెలుసుకోవటానికి స్కాన్ చేద్దామని చెప్పారు. ఆరోజు నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. నాకు రోజూ ఈ బ్లాగులో బాబా సందేశం చదవడం అలవాటు. ఆరోజు కూడా హాస్పిటల్‌కి వెళ్తున్నప్పుడు దారిలో బ్లాగ్ ఓపెన్ చేసి "బుద్ధి, మనసు ఏకం చెయ్యి" అన్న బాబా సందేశం మొదట చదివాను. ఆ సందేశం నాకోసమే అనిపించింది. తర్వాత అక్కుడున్న అనుభవాలు చదువుతుంటే అక్కడ రెండవ అనుభవం నాదే. అది చూడగానే నాకు ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి. ఎందుకంటే, అప్పటికి ఎన్నో రోజుల నుండి బాబాని, "నా అనుభవం పబ్లిష్ అయ్యేలా చేయమ"ని అడుగుతున్నాను. కానీ ఆరోజు వరకు పబ్లిష్ కాలేదు. అలాంటిది ఆరోజే పబ్లిష్ అయ్యేలా అనుగ్రహించి తద్వారా స్కాన్‌కి వెళ్తున్న నన్ను, 'నేను నీతోనే, నీ వెంటే ఉన్నాన'ని బాబా ఆశీర్వదించారు. తర్వాత ఇంకో అద్భుతం కూడా జరిగింది. నా అనుభవం చదివాక బాబాని ఒకసారి చూడాలనిపించింది. అయితే మేము వెళ్ళే దారిలో ఒక్క బాబా గుడి కూడా లేదు. అందువల్ల నేను బాబా కనిపించరనుకున్నాను. కానీ మనం మనస్ఫూర్తిగా బాబాని ఏదైనా కోరుకుంటే జరగకుండా ఉంటుందా? ఆయన ఏం చేసారో తెలుసా? హాస్పిటల్‌కి దగ్గర్లో ఒక సిగ్నల్ దగ్గర మా క్యాబ్ ఆగింది. అదివరకే నాకు వాంతి అయి నీరసంగా పడుకుని ఉన్న నేను అనుకోకుండా ఒక ఆటోలో కొంచెం పెద్ద సౌండ్‌తో పాటలు వినిపిస్తే అటు చూసాను. ఆ ఆటో లోపల ఫోటో రూపంలో బాబా నాకు దర్శనం ఇచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి స్కాన్ చేయించుకున్నాక డాక్టరు, “బేబీ హర్ట్ బీట్ వినిపిస్తుంది” అని చెప్పారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాకు ఒక కోరిక ఉంది, అది నెరవేరేలా చూడు బాబా. అలాగే చెల్లికి మంచి సంబంధం కుదిరి త్వరగా పెళ్లి అయ్యేలా చూడు బాబా. ఇప్పటికే తన పెళ్లికి ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేయకు బాబా".
బాబా ఊదీ వాడడం వల్ల తగ్గిన బాధ
ఓం సాయినాథాయ నమః!!! అందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2023, మే నెలలో ఎండ తగిలితే నాకు దద్దుర్లు రావడం మొదలుపెట్టాయి. అలా చాలా రోజులు నేను ఇబ్బందిపడ్డాక చివరికి ఇంట్లో ఉన్న కూడా దద్దుర్లు రాసాగాయి. ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించాను. కానీ, నా బాధ తీరులేదు సరికదా ఆ బాధ తీవ్రత మరింత పెరుగుతుండేది. అలా సుమారు నాలుగు నెలలపాటు నేను చాలా ఇబ్బందిపడ్డాను. చివరిగా నేను, "సాయీ! మీరే నాకు దిక్కు. నాకు గనక నయమైతే మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని సాయిబాబాను వేడుకున్నాను. రెండు, మూడు రోజుల్లో 'కాఫీ తాగడం వల్ల అలా దద్దుర్లు వస్తున్నాయ'ని బాబా సూచనప్రాయంగా నాకు తెలియజేశారు. అంతేకాదు, నా స్నేహితురాలి ద్వారా "బాబా ఊదీ వాడు" అని సలహా ఇచ్చారు. దాంతో నేను కాఫీ తాగడం మానేసి బాబా ఊదీ వాడటం మొదలుపెట్టాను. దాంతో బాబా దయవల్ల దద్దుర్లు తగ్గిపోయి నా ఆరోగ్యం చాలా బాగుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOmsaisrisaijaisai kapadu tandri
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteSai mi nunchi samadhanam kosam chala yeduruchusthunna baba
ReplyDeleteVamsi nannu yeppudu kapuraniki thiskelthadu. Baba sai
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba, please save us🙏🙏🙏
ReplyDeleteOm sairam thank u baba na anubhavam blog lo vachela chesinanduku
ReplyDeleteBaba e madya na health antha bagundatledu Dani valla na kadupu lo baby ki em kakunda na baby healthy ga undela chudu baba NT scan lo baby arogyam ga undi ani vachela chudu baba om sairam
Om Sairam
ReplyDeleteSai always be with me
Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please
ReplyDeleteEla post cheyali
ReplyDeleteOm Sri Sairam 🙏🙏🙏
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sri Sairam 🙏🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteBaba, bless my children and fulfill their wishes in education.
ReplyDeleteBaba, please release Chandrababu Naidu from jail as quickly as possible.
ReplyDelete