సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1660వ భాగం....


శ్రీ సాయినాథుని పుణ్యతిథి విజయదశమి శుభాకాంక్షలు 
ఈ భాగంలో అనుభవం:

  • సాయినాథుని ఆశ్రయిస్తే అయన మనల్ని విడవరు

నేను సాయిబాబాకి అనన్య భక్తిరాలిని. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు 'ఆ పని అవుతుందా, లేదా' అని నాలో నేను సతమతమవుతున్నప్పుడు అవుతుందో, లేదో క్వశ్చన్&ఆన్సర్ వెబ్సైట్ ద్వారా సాయి నాకు తెలియజేస్తారు. అంతేకాదు, నాకు ఏదైన సందేహం కలిగితే తెల్లవారగానే ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో వచ్చే 'సాయి వచనం' లేదా 'భక్తుల అనుభవాల' ద్వారా నా సందేహం నివృత్తి అవుతుంది. ఇలా కొన్ని నెలలుగా జరుగుతుంది. కాబట్టి ఈ బ్లాగును నిర్వహిస్తోంది స్వయంగా సాయినాథుడే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అసలు ఇలాంటి ఒక బ్లాగ్ ఉందని నాకు ముందు తెలియదు. సాయిబాబానే ఈ బ్లాగు నా కంటపడేలా చేసారు. ఒకసారి ఈ బ్లాగులో "నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను" అని సాయి వచనం వచ్చింది. అది చూసి నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఒక గంట తర్వాత వేరే సాయి పేజీలో "నేను మీ ఇంటికి వస్తున్నాను" అని మళ్ళీ అదే వచనం నా కంటపడింది. అప్పుడు నేను, 'సాయి ఏ రూపంలో మన దగ్గరకి వస్తారో మనం పసిగట్టలేము. ఈ చరాచర జగత్తు అంతా ఆయనదే. ఆయనే పాలిస్తున్నారు. ఆయన ఎవరైనా చుట్టాల రూపంలో మా ఇంటికి వస్తారేమో!' అని మధ్యాహ్నం ఒక్కటిన్నర వరకు ఎదురుచూశాను. కానీ ఎవరూ రాకపోయేసరికి సాయంత్రం లోపు వస్తారేమో అనుకున్నాను. ఇంతలో ఇంకో పేజీలో 'నీ దృష్టిలో ఆరు అడుగుల దేహమున్న మనిషి రూపంలో వస్తేనే, నేను వచ్చినట్టా?' అని నా కంటపడింది. అది చూసి నేను, 'నా మనసులో ఆలోచన బాబా ఎలా విన్నారు?' అని షాకుకి గురయ్యాను. ఆయన మన మనసులోని ప్రతిదీ పసిగడతారని తెలిసి కూడా పిచ్చిగా అలా సందేహపడ్డాను. తర్వాత భోజనం చేసి పడుకున్నాను. కలలో ఆజానుబాహువు వంటి దేహంతో చేతిలో సట్కా పట్టుకొని బాబా మా ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చారు. నేను ఉలిక్కిపడి లేచి, వెంటనే ఆ విషయం మా అమ్మకి, చెల్లికి చెప్పాను. అది విని వాళ్ళు ఆనందపడ్డారు. నేను, "బాబా వచ్చావా? ఎక్కడ ఉన్నావు? మా ఇంటి నిండా మీ విగ్రహాలే, ఫోటోలే! నువ్వెక్కడున్నావు తండ్రీ" అని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం, "నేను నీతోనే ఉన్నాను" అని ఫేస్బుక్ పేజీలో బాబా వచనం వచ్చింది. వెంటనే "ఎక్కడున్నావు బాబా?" అని మా ఇంట్లో ఉన్న సాయి విగ్రహాలలో, ఫోటోలలో వెతకటం ప్రారంభించాను. అప్పుడు ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం కొన్న ఒక మట్టి విగ్రహంలో సాయి వెలిగిపోతూ దర్శనమిచ్చారు. నాకు కన్నీరు ఆగలేదు. ఎందుకంటే, సాయిని చూసిన ప్రతిసారీ నాకు మా నాన్న గుర్తుకొస్తారు. తండ్రి దగ్గర బిడ్డకి ఎంత చనువు, భయం, భక్తి ఉంటాయో నా సాయి దగ్గర నాకు అవే ఉన్నాయి. అందుకే ఏది కావాలన్నా మేము ఆయన్నే అడుగుతాము. మా కుటుంబం ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోయింది.

ఒకసారి మా చెల్లికి కంటి లోపల ఎర్రని కురుపు లేచి నొప్పితో తాను అల్లాడిపోతుంటే తనకి ఊదీ పెట్టాము. బాబా దయతో ఆ కురుపును నయం చేసారు.

ఇటీవలి మా బాబాయికి జ్వరం వచ్చింది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల నా మనసులో ఏదో తెలియని భయం చోటు చేసుకుంది. ఎందుకంటే, ఆ సమయంలో మా ప్రాంతంలో అందరికీ జ్వరాలు ఉన్నాయి. పైగా మా బాబాయ్ వయసులో పెద్దవారు. అందువల్ల పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందో, ఎటు దారి తీస్తుందో అని నా మనసంతా ఒకటే దిగులు. అప్పుడు బాబాయికి ఊదీ నీళ్లలో కలిపి ఇచ్చాము. అది తాగిన గంటలో ఆయన జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. గంట క్రితం ఉన్న రోగ లక్షణాలు ఆయనలో కనపడలేదు. చక్కగా లేచి కూర్చున్నారు. సాయినాథుని ఆశ్రయిస్తే అయన మనల్ని విడవరు అనటానికి ఇలా ఎన్నో నిదర్శనాలు.

2020లో నేను అతి పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. అది నాకు మృత్యువుతో సమానమైన సమస్య. నేను ప్రతిరోజూ ఆ సమస్య గురించి సాయికి చెప్పుకొనేదాన్ని. ఆయన చరణాలనే నమ్మి, ఆ చరణాలపై నా తల వాల్చి "సమస్య తీర్చమ"ని ప్రార్థిస్తుండేదాన్ని. నాలుగు నెలలో సాయి నన్ను ఆ సమస్య నుండి బయటపడేసారు. నామరూపాలు లేకుండా ఆ సమస్యను తొలిగించారు. అది నాకు పునర్జన్మగా నేను భావిస్తాను. బాబా నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఆయన నాకు తండ్రితో సమానం. నన్ను ఎన్నో కష్టాలు బాధలనుండి బయటపడేసారు. ఒకసారి నాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చి బాగా ఇబ్బందిపడ్డాను. అప్పుడు ఊదీ నీళ్ళలో కలుపుకొని తాగితే, 10 నిమిషాల్లో కడుపునొప్పి మాయం అయింది. 

నా జీవితంలో ఏవైనా ముఖ్యమైన ఘట్టాలు జరగబోయేటప్పుడు అవి మంచివైనా, చెడ్డవైనా సాయి వాటిని ముందుగానే నాకు కలల రూపంలో చూపిస్తారు. చెడ్డ కల అయితే నేను, 'ఇది జరగకూడదు సాయి' అని సాయిని అభ్యర్థిస్తాను, ఆయన చరణాలు పట్టుకొని ప్రాధేయపడతాను. అంతే, ఆ కీడు అక్కడితో తొలిగిపోతుంది. మంచి మాత్రం కలలో నేను చూసింది చూసినట్లు జరుగుతుంది. నేను సాయి మార్గంలోకి వచ్చినప్పటి నుంచి ఈవిధంగా జరుగుతోంది. అయితే ఆ కలలని అర్థం చేసుకోవడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. 'అర్థం అయ్యేలా తెలియజేయమ'ని సాయిని ప్రార్థిస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి వందల్లో సాయి ప్రేమకు ప్రతిరూపమైన అనుభవాలు పొందాను. ఆయన నన్ను ఎన్నో సమస్యల నుండి గట్టెక్కించారు. అడుగడుగునా అండగా ఉంటూ మా కుటుంబ భారాన్ని మోస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని కాపాడినట్టే మిమ్మిల్ని ఆశ్రయించిన అందర్నీ కాపాడు సాయి".

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


17 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. సాయి నా మాంగల్యాన్ని నిలబెట్టిన భర్తతో నన్ను కలుపు సాయి

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om sai ram 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  6. Baba pregnancy journey lo thodu vundu baba please baba.. healthy baby ni ivvu baba

    ReplyDelete
  7. Om sairam baba repu jarige registration complete chay baba 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  8. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  10. Baba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS College for my daughter.

    ReplyDelete
  11. Baba, please release Chandrababu Naidu from jail as quickly as possible.

    ReplyDelete
  12. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  13. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  14. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  15. sai baba maa sai madava bharam anta meede baba . meere sai madavani maarchali.

    ReplyDelete
  16. Om Sri Sairam 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo