1. జీవితంలో ప్రతి కష్టంలో తోడుగా నిలిచినా సాయిబాబా
2. మనందరి రక్షకుడు అయిన బాబా
జీవితంలో ప్రతి కష్టంలో తోడుగా నిలిచినా సాయిబాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక బాబా భక్తురాలిని. ఆయన దయతో నేను, నా బాబు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాము. అందుకు నేను బాబాకి కృతజ్ఞతలు చెప్పని రోజు లేదు. సాయి నా జీవితంలోకి 2011లో వచ్చారు. ఆ సమయంలో నేను డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే ప్రతి ప్రయత్నంలో వైఫల్యం ఎదురై బాగా ఆందోళనకి గురయ్యాను. అలా 4 ఏళ్ళు గడిచాయి. నా స్నేహితులందరికీ ఏదో ఒక ఉద్యోగం వచ్చి స్థిరపడుతున్నా నేను మాత్రం అలాగే ఉండిపోయాను. పరిస్థితి అలా ఉన్నా నాకు దేవుని మీద నమ్మకం పోలేదు. ఆ సమయంలో మా ఇంటి పక్కన ఉండే ఒక అక్క, "పారాయణ చేయమ"ని సాయి సచ్చరిత్ర పుస్తకం ఇచ్చింది. నేను సరేనని పారాయణ మొదలుపెట్టాను. అంతలో నాకు పెళ్లి కుదిరింది. అంతా బాబా దయ అనుకొని పెళ్లి చేసుకున్నాను. కానీ రోజూ, "బాబా! నాకు ఉద్యోగం చేయాలని, తర్వాత పెళ్లి చేసుకోవాలని వుండేది. కానీ ఇలా అయింది" అని బాబాతో చెప్పుకుంటూ ఉండేదాన్ని.
నా వైవాహిక జీవితం అస్సలు బాగుండేది కాదు. అందువల్ల నాకు భయమేసి, "ఏంటి, ఈ జీవితం? నా వల్ల కావట్లేదు బాబా. నాకు ఒక ఉద్యోగం ఉంటే, కాస్తైనా నా జీవితం ప్రశాంతంగా ఉంటుంద"ని అని బాబాతో చెప్పుకున్నాను. 2015లో ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. నేను ముందు దరఖాస్తు చేయాలని అనుకోకపోయినప్పటికీ ఇదే చివరి ప్రయత్నమని దరఖాస్తు చేసి పరీక్ష వ్రాసాను. బాబా నాకు తోడుగా ఉండి నన్ను ఫైనల్ స్టేజ్ వరకు తీసుకెళ్లారు. 2016, ఏప్రిల్ 1న వచ్చిన ఫలితాలు చూసినప్పుడు ఇది నా రిజల్ట్‌యేనా అనిపించింది. ఎందుకంటే, ఒకేసారి నాకు రెండు బ్యాంకు ఉద్యోగాలు వచ్చాయి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా దయవల్ల నా జీవితంలో నేను సాధించిన విజయం అది. బాబా లేకుంటే అది సాధ్యమని నేను ఈరోజుకీ ఊహించలేను.
మొదటి జీతం తీసుకుని శిరిడీ వెళ్ళాలని అనుకున్నట్లే, జీతం రాగానే శిరిడీ వెళ్లి నా మొక్కు తీర్చుకున్నాను. బాబా దర్శనం బాగా జరిగింది. బాబా మీద నమ్మకంతో, ఆయన పూజలతో రోజులు గడిచిపోయాయి. ఆయన దయతో నేను గర్భవతినయ్యాను. ఆ సమయంలో నేను సచ్చరిత్ర చదువుతూ, "బాబా! నాకు సుఖ ప్రసవమయ్యేలా దయ చూపమ"ని బాబాను ప్రార్ధించాను. కాన్పు విషయంలో అందరూ భయపడ్డారు కానీ, బాబా వెన్నంటే ఉండి అంతా తానే నడిపించారు. 2017లో నాకు నార్మల్ డెలివరీ అయి బాబు పుట్టాడు.
ఇటీవల మేము బాబా దర్శనానికి శిరిడీ వెళ్లాలనుకొని ట్రైన్ టికెట్ల కోసం ప్రయత్నిస్తే, ఏ ట్రైన్‌కీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపలేదు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మేము శిరిడీ వెళ్లాలన్న రోజుకి 3రోజుల ముందు అకస్మాత్తుగా స్పెషల్ ట్రైన్ నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే మొబైల్లో చూస్తే, చాలా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తిరుగు ప్రయాణానికి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది నిజంగా బాబా చేసిన అద్భుతం. ఆయన మమ్మల్ని శిరిడీకి రమ్మంటున్న సంకేతంగా భావించి టికెట్లు బుక్ చేసుకొని శిరిడీ వెళ్ళాము. బాబా దయతో దర్శనం బాగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. అందరినీ సదా రక్షిస్తూ ఉండు తండ్రీ".
మనందరి రక్షకుడు అయిన బాబా
సాయిబిడ్డలందరికీ నమస్కారం. నా పేరు ఉపేంద్ర. 2023, సెప్టెంబరు 13, రాత్రి మా అమ్మాయికి 102 డిగ్రీలకు పైగా జ్వరం వచ్చింది. గతంలో ఇలా వచ్చినప్పుడు తనకి టాబ్లెట్ వేసినా జ్వరం తగ్గలేదు. అందువల్ల ఈ రాత్రివేళ ఇబ్బంది అవుతుందని నాకు భయమేసింది. వెంటనే మనందరి రక్షకుడు అయిన బాబాను, "అమ్మాయికి జ్వరం తగ్గిపోవాల"ని కోరుకొని టాబ్లెట్ వేశాను. తెల్లారేసరికి అమ్మాయికి జ్వరం తగ్గింది. "థాంక్యూ బాబా".
ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sairam 🙏
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteBaba always be with me and my family 🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteOm sai sri sai jai jai sai,
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
saibaba maa babu sai madava baram antha meede baba, madavani jeevithamlo manchi prayojakuduga cheyali baba.
ReplyDeleteBaba pregnancy journey lo thodu vundu baba please baba
ReplyDeleteOm Sai Ram your udi leelas are very nice.my health became normal.With Sai's blessings my health changed .my pranams to Sai Baba.I thank him lout
ReplyDeleteసాయి నన్ను నా భర్తని కలుపుతండ్రి నెక్స్ట్ మంత్ వాయిదా ఉంది తండ్రి నేను నా భర్త చూసి దాదా సంవత్సరం పైన స్వామి నేను తనని ప్రేమతో చూడాలనుకుంటున్నాను స్వామి నా మీద కోపంతో కానీ ఉద్దేశంతో కానీ నేను తనని చూడలేను ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా మేమిద్దరం కలిసే మార్గాన్ని చూపించు సాయి తండ్రి
ReplyDeleteదారి చూపి కాపురాని నిలబెట్టు సాయి
ReplyDeleteఇంకా నాకు ఎన్ని రోజులు ఈ కష్టాలు పాపా నా జీవితంలో సంతోషం అనేది రాదా నా భర్త మనసు మారి నన్ను భార్యగా స్వీకరించేలా ఆశీర్వదించు తండ్రి నాకు బిడ్డల్ని కని అదృష్టాన్ని ప్రసాదించు సాయి తండ్రి
ReplyDeleteOmsaisrisaijaisai,,,
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteఓం శ్రీ సాయిరాం. బాబా కనికరించు తండ్రీ 🙏🙏🌹🌹
ReplyDelete