సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1655వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయిబాబా మహిమల గురించి తెలియక మునుపే పొందిన  రక్షణ
2. సమయానికి స్కూల్కి చేరడానికి సహాయం అందించిన బాబా

శ్రీసాయిబాబా మహిమల గురించి తెలియక మునుపే పొందిన  రక్షణ

సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు పి.నాగభూషణం(రిటైర్డ్ ప్రిన్సిపాల్, దక్షిణ మధ్య రైల్వే, గుంతకల్/సికింద్రాబాద్). నాకు మొదట్లో అంటే 1988కి ముందు శ్రీసాయిబాబా మహిమల గురించి ఏమీ తెలియదు. నాకు పెళ్ళైన కొత్తలో మా ఇంటి దైవం శ్రీ కంబగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆపద సంభవించింది. మేము వెళ్తున్న జీపు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. జీపు లోయలో పడుతున్న సమయంలో మా చెల్లి, బావ, మా తమ్ముడు అందరూ జీపు నుంచి కిందకు దూకేశారు. నేను, నా భార్య మాత్రం దూకలేకపోయాము. మేమిద్దరం భయంతో వణికిపోతూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వేగంగా లోయలో పడుతున్న జీపులో నిస్సహాయంగా ఉండిపోయాము. మా వాళ్లంతా మా గురించి ఆశ వదిలేసుకున్నారు. కానీ హఠాత్తుగా జీపు పై భాగం ఎండిపోయిన ఒక చెట్టు కొమ్మకి తగులుకొని లోయలోకి పడకుండా ఆగిపోయింది. ఇది మా జీవితంలో బాబా మాకు ప్రసాదించిన మొదటి అనుభవం. అయితే అది బాబా ఆశీర్వాదం అని మాకు అప్పట్లో తెలియలేదు.

ఆ తరువాత కొంతకాలానికి 1994, ఫిబ్రవరి 11న నా భార్యను రెండో కాన్పు కోసం గుంతకల్లు రైల్వే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. మాకు రెండో సంతానంగా కూడా బాబు పుట్టాడు. ఆపరేషన్ థియేటర్ నుండి నా భార్యను బయటకు తెచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఆపరేషన్ చేసి కుట్లు వేసిన చోట విపరీతమైన నొప్పి వచ్చి నా భార్య పొత్తి కడుపు విపరీతంగా ఎగిసిపడసాగింది. అది చూసి డ్యూటీలో ఉన్న నర్సు చాలా  భయపడిపోయింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చిన ఒక భక్తుడు బాబా ఊదీ హాస్పిటల్లో ఉన్న అందరికీ పంచడానికి వచ్చాడు. అతను ఊదీ నా భార్య నుదిటిపై రాసాడు. ఊదీ పెట్టిన కాసేపట్లో నా భార్య మామూలు స్థితికి వచ్చింది. అప్పుడు అక్కడున్న వారంతా "మీ ఆవిడను బాబాయే కాపాడారు" అని నాతో అన్నారు. అప్పుడు నేను గతంలో జరిగిన జీపు ప్రమాదం గురించి వాళ్ళకి తెలిపాను. అది విని వాళ్ళు, "బాబా ఆశీస్సులు మీకు అప్పటినుండి ఉన్నాయి. కాబట్టే మీరు అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు" అని శ్రీసాయిబాబా మహిమను నాకు, నా భార్యకు తెలియజేశారు. మేము చాలా ఆనందించాము. రెండో అబ్బాయి పుట్టిన ఆ రోజున నా భార్యను బాబా  ఆ విధంగా కాపాడినందుకు మేము కృతజ్ఞతగా మా అబ్బాయికి 'సాయి గౌతమ్' అని పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు మా సాయి సాఫ్ట్వేర్ ఇంజనీరుగా హైదారాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు.

అప్పటినుండి అంటే 1994 నుండి శ్రీసాయిబాబా నాకు ఆరాధ్య దైవం అయ్యారు. నేను ప్రతిరోజూ తప్పనిసరిగా నా పూజ సమయంలో శ్రీసాయి సచ్చరిత్రలోని ఒక అధ్యాయం పారాయణం చేస్తాను. అలాగే నా ప్రార్థన గీతం 'షిరిడీవాసా సాయి ప్రభో.. జగతికి మూలం నీవే ప్రభో' తప్పకుండా పాడుకుంటాను. బాబా అడుగడుగునా తమ కృపను మా కుటుంబంపై కురిపిస్తూ ఉన్నారు. బాబాకు భక్తుడనవ్వడం నా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. ఇలా నా ఈ అనుభవాలను సాయి భక్తులతో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.


సమయానికి స్కూల్కి చేరడానికి సహాయం అందించిన బాబా

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రేవతి. నేను స్కూలు టీచర్ని. 2023, సెప్టెంబర్ 14న నేను స్కూలుకి 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరడంతో బస్సు తప్పిపోయింది. ఆటోలో వెళదామంటే ఆటోవాళ్ళు ఆటో తీయలేదు. దాంతో నేను, 'పాపం నావల్ల నా ఫ్రెండ్‌కి కూడా ఆలస్యమైంది' అనుకోని, "ప్లీజ్ బాబా! ఎలాగైనా మేము సమయానికి స్కూలుకి చేరేలా అనుగ్రహించండి. మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. వెంటనే ఒక ఆటో అతను, "రండి మేడం, నేను తీసుకువెళతాను" అని అనడంతో మేము సమయానికి స్కూలుకి చేరుకున్నాము. బాబానే ఆ ఆటో అతనిని పంపించి, సమయానికి మేము స్కూలుకి వెళ్లేలా చేశారు. "ధన్యవాదాలు బాబా".


14 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. Om Sai Ram.....ఈ రోజు వచ్చిన రెండు అనుభవాలు ద్వారా...బాబా మనతో ఎప్పుడు ఉంటారు సమస్య పెద్దదా చిన్నదా అని కాదు మనం అడిగిన వెంటనే అది జరుగుతుంది అనేది నిరూపితం అయింది....కానీ కొన్ని క్లిష్టతరమైన పరిస్థితులలో మనం సాయిబాబా చెప్పినట్టు సహనం గా ఉండాలి....అంతా బాబా గారే చూసుకుంటారు .......ఓం సాయి రాం...

    ReplyDelete
  6. ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  7. sai baba sai madava bharam anta meede baba. pl bless him in his studies , health ans all everything in his life.

    ReplyDelete
  8. Shiridi vasa sai prabho🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  10. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  11. Baba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS for my daughter.

    ReplyDelete
  12. Please release Chandrababu Naidu from jail today.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo