సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1647వ భాగం....


ఈ భాగంలో అనుభ
వం:
  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 27వ భాగం

నా పేరు సాయిబాబు. బాబా తన భక్తుల మనసులోని కోరికలను గుర్తించి నెరవేరుస్తారని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం కూడా గురువు అనుగ్రహం వల్లనే సఫలం అవుతాయనడానికి ఇది ఒక నిదర్శనమైన లీల. కరోనా కాలంలో ఒకసారి మా అమ్మాయివాళ్ళు మా ఇంటికొచ్చి ఇక్కడినుండి భద్రాచలం, పిఠాపురం వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రావాలనుకున్నారు. ఆ విషయమై  బాబాని, ‘ఈ కరోనా కాలంలో వెళ్ళాలా? వద్దా?’, ‘ఒకవేళ వెళ్ళమన్నది మీ సమాధానమైతే ముందు భద్రాచలం వెళ్లాలా? పిఠాపురం వెళ్లాలా?’ అని అడిగితే, ‘ముందు భద్రాచలం వెళ్ళమ’ని బాబా సమాధానం వచ్చింది. బాబా ఆదేశానుసారం మా అమ్మాయివాళ్ళు నా భార్యని కూడా వాళ్ళతో తీసుకొని వెళ్లారు. ముందు భద్రాద్రి రాముడ్ని దర్శించుకొని ఆ రాత్రి అక్కడే నిద్ర చేయాలని ఒక మంచి హోటల్లో రూము తీసుకుందాం అనుకున్నారు. కానీ భోజనం మాటేమిటి అన్న ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే, కరోనా వల్ల రాములవారి భోజన ప్రసాదం పెట్టడం లేదు. కరోనా భయంతో బయట ఎక్కడంటే అక్కడ తినలేని పరిస్థితి. అయినా బాబా ఏదో ఏర్పాటు చేస్తారులే అనే నమ్మకంతో రూము తీసుకున్నారు. తరువాత కారులో నుండి లగేజ్ దించుతుంటే ఆ హోటల్ ప్రక్క ఇంటి ముసలమ్మ, "బాబూ! శుచిగా, శుభ్రంగా భోజనాలు కావాలంటే సిద్ధం చేస్తాను. భయపడాల్సిన పనిలేదు" అని అన్నదట. మా అమ్మాయి సంతోషంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పి, "ఏమేమి కావాలో, ఎంతమందికి కావాలో’ ఆ ముసలమ్మతో చెప్పింది. తరువాత మావాళ్లు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యేటప్పటికి వేడివేడి భోజనం సిద్ధం చేసి రూముకు పంపించారు. మావాళ్లు చాలా రుచికరమైన భోజనం తిని హాయిగా నిద్రపోయారు. మరుసటిరోజు తెల్లవారి నా భార్యకు మెలకువ రాగానే, "బాబా! కరోనా కారణంగా చాలా నెలల తర్వాత బయటికి వచ్చాము. ఈరోజు(గురువారం) నీ దర్శనమవ్వాలి. ఎక్కడో? ఎలానో? నువ్వే రప్పించుకోవాలి బాబా. ఎందుకంటే, ఈ ప్రదేశం మాకు క్రొత్త కదా! ముందుండి నడిపించు బాబా" అని అనుకుంది. తర్వాత అందరూ పిఠాపురం వెళ్లాలని చకచకా స్నానాలు చేసి, తయారై ఉదయం 8 గంటలకి బయల్దేరారు. 5 నిముషాల్లో కారు రోడ్డు మలుపు తిరుగుతూనే ఎడమచేతి వైపు బాబా మందిర గోపురం కనిపించింది. సంతోషంగా కారు ఒక పక్కాగా పార్క్ చేసి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మందిరం లోపలికి వెళ్ళారు. చాలా పెద్ద గుడి. ఇంచుమించు శిరిడీలోలానే బాబా దర్శనమిచ్చారు. బాబాకి మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకుని, ప్రదక్షిణ చేద్దామని నా భార్య వెనుక వైపుకు వెళ్ళింది. అంతలో ఒక తలుపు తెరచుకొని తెల్ల వస్త్రాలు ధరించి ఒకతను బయటకు వచ్చాడు. నా భార్య అతనితో, "మేము చాలా దూరం నుండి వచ్చాము. ప్రతి గురువారం ఇంట్లో బాబాకి దీపారాధన చేసుకోవడం అలవాటు" అని పూర్తిగా చెప్పబోయేలోపే అతను, “దీపారాధన చేస్తారా? నూనె, వత్తులు అక్కడ వున్నాయి. చేసుకోండి" అని అన్నాడు. మనసులోని భావన బయటకు చెప్పకముందే బాబా అతని ద్వారా కావల్సినవి చూపించి దీపారాధన చేసుకొనే అవకాశమిచ్చారు. నా భార్య సంతోషంగా తను దీపారాధన చేయడమే కాకుండా మా అమ్మయి, అల్లుడు చేత కూడా చేయించింది. బాబాని చూస్తూ కొంచంసేపు కూర్చొని ప్రసాదం తీసుకుని బయలుదేరారు. భద్రాచల రామయ్య సమక్షంలో బాబా దర్శనం బాగుంది కదా! రాముడైనా ఆయనే, కృష్ణుడైనా ఆయనే.

తర్వాత నా భార్య పిఠాపురంలో ఉన్న తన స్నేహితురాలికి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పింది. ఆమె “కరోనా కదా! బయట తినకండి. నేను మీ అందరికోసం వంట చేస్తాను“ అని చెప్పింది. మా వాళ్లు 4 గంటలు ప్రయాణం చేసి పిఠాపురం చేరుకున్నారు. అప్పటికే నా భార్య స్నేహితురాలు భోజనాలు సిద్ధం చేసి పెట్టింది. అందరూ  భోజనాలు చేసారు. తర్వాత నా భార్య తన స్నేహితురాలు మాటల్లో పడ్డారు. మా అమ్మయి, అల్లుడు బయటకి వెళ్ళొస్తామని వెళ్లారు. అలా వెళ్లిన వాళ్ళు అనుకోకుండా పురుహూతికాదేవి అమ్మవారి శక్తిపీఠం దర్శించి పూజ చేయించుకొని, ప్రసాదం తీసుకొని రాత్రికి ఇంటికి వచ్చారు. మరునాడు ఉదయన్నే తయారై నా భార్య కోసంగా అందరూ కలిసి పురుహూతికాదేవి దర్శనానికి వెళ్లారు. తీరా చూస్తే గుడి తాళం వేసి ఉంది. అక్కడున్నవాళ్ళను ఆడిగితే, “ఈరోజు గుడి తెరవరు" అని చెప్పారు. ‘అయ్యో! ఇంతదూరం శక్తిపీఠం దర్శనానికి వస్తే ఇలా జరిగిందేంటి?’ అని నా భార్యకి అనిపించినా, వెంటనే బాబాను తలుచుకొని కళ్ళు మూసుకుంది. అంతలో అమ్మవారి గుడి తలుపు తాళం తీసిన శబ్దం వినిపించడంతో నా భార్య కళ్ళు తెరిచి చూస్తే, ఒక తొమ్మిదేళ్ల కుర్రాడు ఆ గుడి తలుపులు తెరిచి ఉన్నాడు. నా భార్య బాబానే ఆ రూపంలో వచ్చారని భావించి 'బాబా బాబా' అంటూ ఆ కుర్రాడి కాళ్ళకు దణ్ణం పెట్టి, లోపలకు వెళ్ళి తనే స్వయంగా అమ్మవారికి పసుపుకుంకుమతో పూజ చేసింది. అంతలో ఒక పండు ముత్తైదువ వచ్చి దోసిలి నిండా పూలు నా భార్య చేతుల్లో పోసి “పూజ చేసుకో” అంది. ఆమె ముఖం ఎంతో తేజోమయంగా ఉండటంతో ‘వచ్చింది అమ్మవారేన”ని వెంటనే వంగి ఆమె పాదాలకు నమస్కరించింది నా భార్య. తర్వాత పూజ పూర్తిచేసుకొని ఆనందంగా బయటకు వచ్చింది. అలా బాబా అసలు తెరవరన్న గుడి తలుపులు తీయించి, అమ్మవారి దర్శనం చేయించి ‘ఎంతోదూరం నుండి శక్తిపీఠం దర్శనం కోసమొస్తే దర్శనమే కాలేదని ఉస్సూరుమంటూ వెనక్కి వచ్చామే’ అన్న దిగులు లేకుండా చేసారు. “కృతజ్ఞతలు బాబా”.

ఒక గురువారంనాడు నేను, నాభార్య సువాసన వెదజల్లే సెంటెడ్ గులాబీలు తెప్పించి బాబాకి అలంకరణ చేశాము. గదంతా మంచిగా గులాబీల వాసనతో గుమగుమలాడిపోతుంది. ఆ సువాసనను ఆస్వాదిస్తుంటే మనసుకెంతో హాయిగా అనిపించింది. ఆ గులాబీల చక్కటి రంగు కూడా చూడటానికి చాలా ఆహ్లాదంగా అనిపించింది. పూజ పూర్తైన తర్వాత బెంగుళూరు నుండి మా అమ్మాయి ఫోన్ చేసి, "పూజ అయ్యిందా? గులాబీల పరిమళం వస్తోంది" అని అంది. విషయమేమిటంటే, ఇక్కడ మా ఇంటిలో బాబాకి అలంకరించిన గులాబీల పరిమళం బెంగుళూరులోని మా అమ్మాయివాళ్ళకి చేరింది. ఎలా సాధ్యమంటారా? అది బాబా మహిమ. ఇంకొక రోజు నేను ఫోన్లో మధ్యాహ్న హారతి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాను. వేరే గదిలో వున్న నా భార్య, "శిరిడీలో బాబాకి ధూపం వేశారా? నాకు సాంబ్రాణి వాసన వస్తోంది" అని అంది. నాకు వాసన రాలేదుగానీ, ఆమె అడిగినప్పుడే శిరిడీలో ధూపం వేశారు. నేను కళ్ళతో చూశాను, నా భార్య ముక్కుతో చూసింది. బాబా లీలలు అమోఘం.

నేను, నా భార్య ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి కాకడ హారతి, మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న హారతి ప్రత్యక్ష ప్రసారం టీవీలో చూస్తుంటాము. మేము రోజూ ఉదయం అల్పాహారం చేయకుండా తొందరగా భోజనం చేసేసి పది, పదకొండు గంటలు మధ్య బాబా నామజపం చేసుకుంటూ కొంచెంసేపు కునుకుతీస్తాము. నిద్రలో అప్పుడప్పుడు నా చెవిలో మధ్యాహ్న హారతి వినిపించడం, నేను ఉలిక్కిపడి హారతికి టైము అయినదేమోనని లేచి చూస్తే ప్రక్కగదిలో నా భార్య నిద్రపోతూ కనిపించడం, సమయం చూస్తే పదకొండు గంటలే అవ్వడం జరుగుతుంటుంది. ఒకరోజు ఈ విషయం నా భార్యకు చెప్తే, “నాకు కూడా ఇలానే జరుగుతుంది. మీరు ఫోన్లో హారతి పెట్టరేమోనని లేచొచ్చి చూస్తే, మీరు నిద్రపోతూ కన్పించేవారు. సమయం చూస్తే, ఆరతికి ఇంకా గంటసేపు ఉంటుంది” అని చెప్పింది. అలా బాబా మమ్మల్ని మొద్దునిద్రపోనీకుండా, ఆరతి మిస్ అవ్వనివ్వకుండా అలెర్ట్‌గా ఉంచుతున్నారు. ఏదేమైనా ఇద్దరికీ ఒకేవిధమైన అనుభవం కలగడం విచిత్రం.

మా ఇంట్లో ఇరవై సంవత్సరాలుగా ఏ రిపేరు లేకుండా చక్కగా పనిచేస్తున్న క్రాప్టన్ గ్రీవ్ పెడస్టల్ ఫ్యాన్ సుమారు 2021 నుండి మీడియం స్పీడ్ బటన్లు పనిచేయక హైస్పీడ్ బటను మాత్రమే పనిచేస్తుండేది. ఒకసారి మా ఇంటికి తెలిసిన ఎలక్ట్రిషియన్ వస్తే ఫ్యాన్ అతనికి చూపించాము. అతను ఫ్యాన్ బటన్స్ ఉన్న డోము తీసి చూసి, మా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, “మిమ్మల్ని బాబా కాపాడుతున్నారు. ఇలా చెప్పడానికి కారణమేమిటంటే, లోపల వైర్లు కట్టై ఫ్యాన్ బాడీకి తగులుతున్నాయి. ఖచ్చితంగా ఈ ఫ్యాన్ ముట్టుకుంటే షాకు కొడుతుంది" అని అన్నాడు. అతను చెప్పింది నిజమే! బాబాయే మమ్మల్ని కాపాడుతున్నారు. మేము ఆ ఫ్యాన్ ఆన్‌లో ఉన్నప్పుడే దాన్ని ముట్టుకొని డైరెక్షన్ మార్చుకుంటూ ఉంటాము. ఎప్పుడూ మాకు షాక్ కొట్టలేదు. షాక్ కొడుతుందేమోనని అనిపించినా కానీ ఎప్పుడూ అలా జరగలేదు. బాబా ఉన్నారు కదా! ఎలక్ట్రిషియన్ వెంటనే కట్ అయిన వైర్లు డిస్కనెక్టు చేసి తీసేసాడు. అవి లేకపోయినా ఫ్యాను మామూలుగానే తిరుగుతుంది.  ఇప్పటివరకూ ఏమీ అవ్వలేదు. బాబా సదా మన కుటుంబాలను అనుక్షణం రక్షిస్తూ ఉంటారనడానికి ఇదే నిదర్శనం. “కృతజ్ఞతలు బాబా”. 

ఒకరోజు నేను, నా భార్య టీవీలో మధ్యాహ్న హారతి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. ఆ సమయంలో బాబా మూర్తికి నలుపురంగు వస్త్రాలు వేసి, చామంతులు-గులాబీల మాల వేశారు. అవి చూసి నా భార్య, ‘నలుపురంగు వస్తాలకి మల్లెపూల మాల వేస్తే ఎంతో బాగుండేది కదా! ఏ రంగు వస్త్రం వేస్తున్నామో ఒక గంట ముందు పూలమాలలు కట్టే వాళ్ళకి చెప్తే దానికి తగినట్లు మాల తయారుచేసి ఇస్తారు కదా!’ అని అనుకుందట. ఆరోజు సాయంత్రం ధూప్ హారతి చూస్తున్నప్పుడు నా భార్య ఆశ్చర్యంగా మధ్యాహ్నం తన మనసులో అనుకున్న మాట నాకు చెప్పింది. ఆమె ఆశ్చర్యానికి కారణమేమిటంటే, అప్పుడు బాబా మూర్తికి నలుపురంగు వస్త్రాలతోపాటు మల్లెపూల మాల వేసి ఉంది. ఎక్కడ మా ఇల్లు? ఎక్కడ శిరిడీ? మనసులో అనుకున్నది ఎలా నెరవేర్చారో చూసారా బాబా. ఆయన సర్వాంతర్యామి.

21 comments:

  1. చాలా బాగుంది మీ సాయి లీలలు చదివిన వారు చాలా ఆనందంగా వుంటారు.ఓం సాయి రామ్

    ReplyDelete
  2. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  3. Baba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS for my daughter.

    ReplyDelete
  4. Baba, release Chandrababu Naidu from jail today.

    ReplyDelete
  5. Om sai ram, 🙏🙏🙏🙏

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. Sai nadha nee leela lani anubhavinche bhagyanni Naku prasadinchi nenu nee meda anthe bhakti viswasamtho nammakamtho undagaligela Nannu dheevinchu thandri. 🙏🙏🙏

    ReplyDelete
  8. Na jeevitham mi chethilo pettesa.om sairam

    ReplyDelete
  9. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  10. Baba, please provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  11. Baba, provide guidance for my son’s future and take care of him 🙏🙏🙏🙏

    ReplyDelete
  12. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  13. Saibaba , pl bless and guide my son saimadava in his studies, behaviour, concentration on his studies baba, pl guide my husband & mother-in-law to give importance of mine. baba

    ReplyDelete
  14. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  15. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  16. Om Sai Ram.The mystical experiences and miracles of Sri Sai Baba are ultimate.They bless us with immense mental peace and feeling of security.Om Sai Nathaya Namah.🙏🙏🙏💐🌷🌹🕉️

    ReplyDelete
  17. Om Sri Sai nathya namaste narmada

    ReplyDelete
  18. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo