సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 765వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. దక్షిణ స్వీకరణ - చూపిన దయ


దక్షిణ స్వీకరణ - చూపిన దయ


అందరికీ నమస్కారం. నా పేరు సాయిసంహిత. 2021, ఏప్రిల్ 14, బుధవారంరోజున నేను సచ్చరిత్ర పారాయణ పూర్తి చేశాను. అదేరోజు ‘సాయి మహరాజ్ సన్నిధి’ వాట్సాప్ గ్రూపులో ఒక సాయిభక్తురాలు పంచుకున్న అనుభవం చదివాను. అందులో, ‘తన పారాయణను ఆమోదిస్తే తన వద్దనుండి 100 రూపాయలు దక్షిణ స్వీకరించాలని బాబాను ప్రార్థించాననీ, తన ప్రార్థనను మన్నించి బాబా తన వద్దనుండి దక్షిణ స్వీకరించారనీ’ ఆ భక్తురాలు పంచుకున్నారు. ఆ అనుభవం చదివిన నాకు చాలా సంతోషంగా అనిపించింది. దాంతో నేను కూడా మనసులోనే, “బాబా నా పారాయణ ఆమోదిస్తే నా వద్ద దక్షిణ స్వీకరిస్తే బాగుండు” అనుకున్నాను. ఇంక ఆ విషయాన్ని అంతటితో మర్చిపోయాను. తరువాత నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బస్టాపుకి వస్తుంటే ఒక పాప నా వద్దకు వచ్చి, “అక్కా, ఒక రూపాయి ఇవ్వవా?” అని అడిగింది. నేను వెంటనే ఆ పాపకు ఒక రూపాయి ఇచ్చాను. కానీ ఆ సమయంలో ‘నా వద్దనుండి దక్షిణ స్వీకరించమ’ని నేను బాబాను అడిగిన విషయం మర్చిపోయాను. రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 16వ తేదీన, సచ్చరిత్రలో 14వ అధ్యాయంలోని ‘దక్షిణ’ గురించి చదువుతున్నప్పుడు, బాబా ఆ పాప రూపంలో నా దగ్గర దక్షిణ స్వీకరించిన విషయం గుర్తొచ్చి చాలా సంతోషంగా అనిపించింది. ఆ ముందురోజు కూడా ఆ భక్తురాలి అనుభవం ఊరికే గుర్తొచ్చింది, కానీ బాబాను అడిగిన విషయం మాత్రం గుర్తుకురాలేదు. “నా పారాయణను ఆమోదించి నా దగ్గర దక్షిణ స్వీకరించినందుకు, నేను మర్చిపోయిన విషయాన్ని గుర్తుచేసినందుకు థాంక్యూ సో మచ్ బాబా!”


2021లో నాకు, నా స్నేహితునికి గొడవ అయి ఇద్దరం మాట్లాడుకోలేదు. పని ఒత్తిడిలో ఉన్న తనని అర్థం చేసుకోకుండా నేను తనతో గొడవ పెట్టుకున్నాను. దాంతో తను నాతో మాట్లాడటం మానేశాడు. నాకు బాధగా అనిపించి బాబాకు నమస్కరించుకుని, “సారీ బాబా! నేనే తనను అర్థం చేసుకోకుండా గొడవ పెట్టుకున్నాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ తనతో గొడవపెట్టుకోను. తను నాతో మాట్లాడేలా దయ చూపండి” అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల నా స్నేహితుడు నాతో మునుపటిలా మాట్లాడసాగాడు. “తెలిసీతెలియక నేను చేసిన తప్పులను క్షమించండి బాబా. నన్ను సరైన దారిలో నడిపించండి. మీ నామమే నాకు ఊపిరి. సచ్చిదానందా! ఎల్లప్పుడూ మా తోడుగా ఉండండి”.


11 comments:

  1. Om sai ram please bless my family always baba.you are saving everyone in this world.i am watching mere sai serial in Hindi.very nice serial.all must watch it.sai baba roll is very nice.in future like this serial they must produce.om sai ram❤❤❤

    ReplyDelete
  2. Kothakonda SrinivasMay 5, 2021 at 7:35 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  3. నిరంతరం మీ నామస్మరణ చేసే బుద్ధిని ఇవ్వండి
    అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sai ram baba pleaseeee bless my mother with good health

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  7. Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl na health bagu cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi

    ReplyDelete
  8. Om sri sairam 🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo