
సాయిభక్తుడు శ్రీకాశీరాంషింపీ దయార్ద్రహృదయుడు, సున్నితమనస్కుడు, ఆధ్యాత్మిక భావాలు మెండుగా కలిగినవాడు. మహల్సాపతి, అప్పాజోగ్లే కూడా అటువంటి మనస్తత్వమే కలిగివుండేవారు. కాబట్టి ముగ్గురూ మంచి స్నేహితులుగా మెలుగుతూ, గ్రామంలోకి వచ్చే సాధువులకు, సత్పురుషులకు, బైరాగులకు, ఫకీరులకు తమ శక్త్యానుసారం...