ఈ భాగంలో అనుభవాలు:
- ఆర్తిగా పిలిస్తే బాబా తప్పక పలుకుతారు
- ఆటోమేషన్ నెట్‌వర్క్ రౌటర్ సమస్యను పరిష్కరించిన బాబా
ఆర్తిగా పిలిస్తే బాబా తప్పక పలుకుతారు
నా పేరు శ్రీనివాసరావు. గతంలో నా అనుభవాలను, బాబా నాకు చేసిన మేలును ఈ బ్లాగ్ ద్వారా అందరికీ తెలియజేసినందుకు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. ఈరోజు నేను బాబా నాకు ప్రసాదించిన మరొక అనుభవాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి దీనిని కూడా బ్లాగులో పెట్టి బాబా యొక్క అద్భుత లీలను అందరికీ తెలియజేయవలసినదిగా కోరుకుంటున్నాను.
11.10.2019 వ తేదీ సాయంత్రం నేను మా చిన్నబ్బాయితో కలిసి కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి గ్రౌండుకు వెళ్లాను. చీకటిపడేవరకు డ్రైవింగ్ నేర్చుకున్నాక ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చాము. హఠాత్తుగా మా అబ్బాయి తన ఫోన్ కనబడట్లేదని అన్నాడు. కారులో ఉన్నదేమోనని వెతికాము, కానీ కనబడలేదు. నేను, నా భార్య మా అబ్బాయి ఫోనుకు 5,6 సార్లు కాల్ చేసాము. రింగ్ అవుతోంది, కానీ ఎక్కడా కనపడలేదు. నేను కారు నేర్చుకున్న గ్రౌండ్లో పడిపోయి వుంటుంది, ఇక ఫోన్ దొరకదేమో అని నాకు భయమేసింది. ఎందుకంటే ఆ ఫోను విలువ 12,000 రూపాయలు. వెంటనే నేను, “బాబా! ఎలాగైనా మా అబ్బాయి ఫోన్ మాకు దొరికేలా చేయండి. ఫోన్ దొరికితే నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. తరువాత నేను, మా అబ్బాయి కలిసి బైకుపై నేను కారు నేర్చుకున్న గ్రౌండుకు వెళ్ళాము. అప్పటికి మేము ఆ గ్రౌండు వదిలివెళ్ళి 20 నిమిషాలు పైనే అయింది. అక్కడంతా చీకటిగా ఉంది. మీరు నమ్మరు గానీ, మా బైక్ సరిగ్గా ఫోన్ పడిన చోటికి వెళ్లి ఆగింది. అద్భుతమేమిటంటే, ఆ ఫోనుకి 2, 3 అడుగుల దూరంలో ఒకరు అటూ ఇటూ తిరుగుతున్నారు, కొంతమంది అక్కడ కూర్చుని ఉన్నారు, ఫోన్ స్క్రీన్ పైకి కనపడేలా పడివుంది, అప్పటికే నేను, నా భార్య 5, 6 సార్లు ఫోన్ కూడా చేశాము, ఫోన్ చేసినప్పుడు ఫోన్ స్క్రీన్ లైట్ వెలుగుతుంది, ఫోన్ రింగ్ అవుతుంది, కానీ అక్కడున్నవారి దృష్టి మా ఫోనుపై పడకుండా బాబా అద్భుతాన్ని చేసి, మా ఫోన్ మాకు దొరికేలా చేశారు. బాబాను నమ్ముకొని ఆర్తిగా పిలిస్తే బాబా తప్పక పలుకుతారు, మన బాధలు తీరుస్తారు అని చెప్పడానికి ఇది చాలా చిన్న ఉదాహరణ. “బాబా! ఎప్పుడూ మీ చల్లని చూపు మా అందరిపై ఉంచి, మేము మంచి మార్గంలో నడిచేలా ఆశీర్వదించండి”.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

ఆటోమేషన్ నెట్‌వర్క్ రౌటర్ సమస్యను పరిష్కరించిన బాబా
సింగపూర్ నుండి సాయిభక్తుడు రాజన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నా పేరు రాజన్. నేను సింగపూరులో ఆటోమేషన్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. ఇటీవల వృత్తిపరంగా బాబా నాకు ఎలా సహాయం చేశారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆటోమేషన్ నెట్‌వర్క్‌లో నాకు కేవలం ప్రాథమిక పరిజ్ఞానం మాత్రమే ఉంది, పైగా రౌటర్‌గా నాకు అనుభవం కూడా తక్కువే. అయితే ఒక బుధవారంనాడు మా కంపెనీ ఆటోమేషన్ నెట్‌వర్క్ రౌటర్‌లో ఏర్పడిన లోపం కారణంగా సర్వర్‌కు కనెక్ట్ చేయబడి ఉన్న ఒక క్రేన్ ఆటోమేటిక్ గా పనిచేయడం మానేసింది. నేను మరొక క్రేన్ రౌటర్ని పెట్టి ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. అన్నిరకాలుగా నేను ప్రయత్నించాను కానీ, సమస్యను పరిష్కరించలేకపోయాను. గురువారం నేను బాబాను ప్రార్థించి మళ్ళీ ప్రయత్నించాను. కానీ పరిస్థితిలో మార్పులేదు. స్పేర్ రౌటర్ మా వద్ద లేనందున స్థానికంగా ఎక్కడైనా దొరుకుతుందేమోనని ప్రయత్నించాము. కానీ, ఎక్కడా స్టాకు లేదు. వేరే కంపెనీ వద్దనుండి తీసుకొచ్చి ప్రయత్నించినప్పటికీ పనిచేయలేదు. మేము రౌటర్ సంబంధిత కథనాలన్నీ చదువుతూ వివిధ పద్ధతులను ప్రయత్నిస్తూ ఉన్నాము.
ఆలోగా నేను సమస్య పరిష్కారం కోసం బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. చివరికి మేము జర్మన్ సరఫరాదారు వద్ద ఆ భాగాన్ని ఆర్డర్ చేశాము. వాళ్ళు వెంటనే ఫ్లైట్ లో ఆ భాగాన్ని పంపించారు. కానీ స్థానిక సరఫరాదారు 'మా కంపెనీ నుండి పూర్తి మొత్తం చెల్లిస్తేగానీ డెలివరీ ఇవ్వన'ని పట్టుబట్టాడు. ఎన్నివిధాల ప్రయత్నిస్తున్నా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉండేది. నేను ఆ సమయమంతా బాబాను ప్రార్థిస్తూ ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని. ఆ సమస్య విషయంగా డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ తో నామీద చాలా ఒత్తిడి పడుతూ ఉండేది. దానివలన నాకు దేనిమీదా ఏకాగ్రత ఉండేది కాదు. ప్రతిక్షణం నా మనస్సు సమస్య గురించే ఆలోచిస్తూ చాలా బాధాకరంగా ఉండేది. కానీ నేను బాబాపై విశ్వాసాన్ని కోల్పోలేదు. నెమ్మదిగా ఆయన నా సహనాన్ని, విశ్వాసాన్ని పరీక్షించదలుచుకున్నారని నేను అర్థంచేసుకుని బాబా మార్గం చూపించేవరకు సహనంతో వేచి ఉండదలచుకున్నాను. అలా ఒక వారం గడిచాక నేను చెడిపోయిన ఆ పాత యూనిట్‌ను మళ్ళీ ఒకసారి ప్రయత్నించాలని అనుకున్నాను. ఇంటివద్ద నేను, "బాబా! ఏదైనా అద్భుతం జరిగేలా చేసి ఇక్కడితో సమస్య పరిష్కారమయ్యేలా చూడండి" అని బాబాను ప్రార్థించి కంపెనీకి బయలుదేరాను. కంపెనీకి చేరుకున్న తరువాత మరోసారి నేను బాబాను ప్రార్థించి నా ప్రయత్నం మొదలుపెట్టాను. బాబా నిజంగానే అద్భుతం చూపారు. అకస్మాత్తుగా ఎర్రర్ లైట్ ఆగిపోయి రౌటర్ మామూలుగా పనిచేసింది. నేను ఆశ్చర్యపోయాను. బాబా సమస్యను పరిష్కరించారు. దాంతో పరిస్థితి అంతా సాధారణస్థితికి వచ్చింది. ఇలాంటి అనుభవాలెన్నో నేను చదివాను, ఇప్పుడు నేనే అనుభవించాను. సమస్యను పరిష్కరించేలోపు బాబా మన కర్మలను తొలగిస్తారని, అంతవరకు మనం ఆ బాధను సహిస్తూ సహనంతో ఉండాలని నేను ఈ అనుభవం ద్వారా గ్రహించాను. అందరికీ బాబా సహాయం చేస్తారు. అందుకు మనకు విశ్వాసం, సహనం అవసరం.
Sri shiridi sai bagavanki jai sai please bless me.
ReplyDeleteom sai ram my computer has no router.it is not working .my told to my hubby.my hubby did repair.it is working.all day i read sai leelas in cell only.thank youto all members in the group who are working for our happines.om sai ram om sai ma
ReplyDeleteఅంతా బాబా అనుగ్రహం సాయి. మన సంతోషానికి ఆనందస్వరుపుడైన ఆయనే కారణం
ReplyDeleteOm sairam🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDelete🕉 sai Ram
ReplyDelete