1. సాయి మహరాజ్ చేసిన లీల
2. శ్రద్ధ-సబూరీ కలిగి ఉండవలెను
సాయి మహరాజ్ చేసిన లీల
శ్రద్ధ-సబూరీ కలిగి ఉండవలెను
సాయి వచనం:-
|
|
1. సాయి మహరాజ్ చేసిన లీల
2. శ్రద్ధ-సబూరీ కలిగి ఉండవలెను
సాయి మహరాజ్ చేసిన లీల
శ్రద్ధ-సబూరీ కలిగి ఉండవలెను
1. సాయి నామజప శక్తి
2. సాయి నామజపంతో ఆరోగ్యానికి సమస్య లేదన్న నిర్ధారణ
సాయి నామజపంతో ఆరోగ్యానికి సమస్య లేదన్న నిర్ధారణ
నా పేరు రుక్మిణి. మాది మంచిర్యాల. ఒకసారి నేను నా ఆరోగ్యంలో వచ్చిన కొన్ని మార్పులు గమనించి చాలా ఆందోళన చెందాను. ముఖ్యంగా నా రొమ్ము భాగం నొప్పిగా అనిపిస్తుండటం వలన డాక్టర్ను సంప్రదిస్తే, స్కాన్ చేయించమన్నారు. నేను స్కానింగ్ చేసే సమయంలో నిరంతరాయంగా సాయి నామజపం చేశాను. డాక్టరు రిపోర్టు చూసి, 'అంతా బాగానే ఉంది, మీ ఆరోగ్యానికి ఎటువంటి సమస్యా లేద'ని నిర్ధారించారు. నేను ఆనందంగా బాబా పాదాలకు తలవంచి నమస్కరిస్తున్నాను.
- బాబా కరుణ
నేను ఒక సాయిభక్తుడిని. సంవత్సరం 5 నెలల వయసున్న మా బాబుకి దగ్గు చాలా రోజులు ఇబ్బందిపెట్టింది. మందులు వాడుతున్నా తగ్గలేదు. ఒకరోజు తను అన్నం అస్సలు సరిగా తినలేదు. అలాగని పాలు పడితే రాత్రి దగ్గుతూ వాంతులు చేసుకొని తిన్నదంతా/తాగినదంతా కఫంతో సహా కక్కేసాడు. నేను బాబు ఖాళీ కడుపుతో ఉన్నాడని అర్థరాత్రివేళ పాలు కలిపి పట్టాను. కానీ కాసేపటికే మళ్ళీ దగ్గుతూ మొత్తం వాంతి చేసుకున్నాడు. తర్వాత కడుపునొప్పి పెడుతుందో ఏమోగానీ తాను కడుపు పట్టుకుని ఏడవసాగాడు. నేను వెంటనే బాబాని తలుచుకొని సంజీవని వంటి ఊదీ బాబుకి పెట్టి, మరికొంత ఊదీ నోట్లో వేసి, "బాబా! ఉదయం కల్లా బాబు ఆరోగ్యం చక్కగా అయ్యేలా కరుణించండి. మీకు 101 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తర్వాత దగ్గు మందు, కడుపునొప్పి మందు కొంచెం బాబుకి వేసి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని 108 సార్లు జపించాను. బాబా దయవల్ల బాబు ఒక గంటలో నిద్రపోయాడు. ఉదయానికి తన ఆరోగ్యం కుదుటపడింది. "ధన్యవాదాలు బాబా".
మేము శిరిడీ వెళ్లి బాబా ఆశీస్సులు తీసుకుందామనుకొని 2024, ఏప్రిల్ 12 రాత్రి షోలాపూర్ నుండి శిరిడీ వెళ్లేందుకు, ఏప్రిల్ 14 రాత్రి శిరిడీ నుండి షోలాపూర్ తిరిగి వచ్చేందుకు బస్సు టిక్కెట్లు చేసుకున్నాం. నేను రైల్వేలో పనిచేస్తున్నాను. ఏప్రిల్ 12న మాకు రైల్వే మాక్ డ్రిల్ ఉంది. అదెక్కడ ఆలస్యమవుతుందో, అప్పుడు శిరిడీ వెళ్ళే బస్సు అందుకోగలనో, లేదో అని నేను కంగారుపడి, "బాబా! ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ దర్శన భాగ్యం మాకు లభించేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా కరుణ వల్ల మధ్యాహ్నం 1కి మాక్ డ్రిల్ల్ పూర్తింది. ఇకపోతే, నా భార్యకి, బాబుకి బస్సు పడదు. ఇదివరకు కేరళలో బస్సులో తిరిగినప్పుడు వాళ్లిద్దరూ వాంతులు చేసుకున్నారు. నాకు కూడా తెల్లవారుజామున టాయిలెట్‌కి వెళ్ళే సమస్య ఉంది. అందువల్ల 'ఎలా?" అని చింతిస్తూ, "బాబా! మా ఈ శిరిడీ ప్రయాణంలో మాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా క్షేమంగా వచ్చి, మీ దర్శనం చేసుకుని తిరిగి షోలాపూర్ వచ్చేలా కరుణించండి. మీ మందిరంలో 101 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా కృపతో ప్రయాణంలో ఎప్పుడూ అల్లరిపెట్టే మా బాబు ఈసారి ఏ మాత్రమూ ఇబ్బంది పెట్టలేదు. ఇంకా మేము ముందుగా రూమ్ బుక్ చేసుకోనప్పటికీ ఆ రోజు ఉదయం సాయి భక్తనివాస్‌లో నాన్-ఏసీ రూమ్, అదేరోజు రాత్రి సాయి ఆశ్రమంలో ఏసీ రూమ్ దొరకడంతో సంవత్సరం 5 నెలల మా బాబుతో రెండు రోజులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా బాబా సన్నిధిలో ఆనందంగా గడిపాము. బాబా కృపతో మాకు అద్భుతమైన దర్శనాన్ని అనుగ్రహించారు. ఇకపోతే తిరుగు ప్రయాణంలో మేము బుక్ చేసుకున్న డైరెక్ట్ బస్ క్యాన్సల్ అయినప్పటికీ బాబా దయవల్ల కనెక్టింగ్ బస్ సర్దుబాటు అయి చేరుకోవాల్సిన సమయానికే షోలాపూర్ చేరుకున్నాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మా అందరికీ ఉన్న ఆరోగ్య సమస్యలు తొందరగా సమసిపోయేలా చూడు తండ్రీ. మళ్ళీ తొందరలోనే కుటుంబ సమేతంగా శిరిడీలో మిమ్మల్ని దర్శించుకునేలా అనుగ్రహించండి బాబా".
తర్వాత నా భార్య అమ్మమ్మ హైదరాబాద్‌లో ఉన్న తన కొడుకు ఇంట్లో మృతి చెందారు. ఆరోజు వెళ్ళడానికి మాకు కుదరలేదు. దాంతో పెద్ద కార్యమైన గురువారంనాడు ఎలాగైనా వెళ్ళాలి, లేదంటే బాగోదనుకొని మంగళవారం రాత్రి నా భార్యను ట్రైన్ ఎక్కించి, నేను బుధవారం డ్యూటీ చూసుకుని ఆ రాత్రి ట్రైన్ ఎక్కుదామనుకున్నాను. అయితే నేను పని చేస్తున్న డిపార్టుమెంటులో బుధవారంనాడు ఆక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ వీక్లీ మైంటెనెన్సు షెడ్యూల్స్ ఉంటాయి. ఆరోజు ఇంజన్ సెక్షన్‌లో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఇంజన్ నిలకడగా ఉన్న స్థితిలో కూడా RPM స్పీడ్ పెరిగసాగింది. నిజానికి అలా జరగకూడదు. ఆరోజు ఉదయం నుండి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నా కూడా ఆ సమస్య పూర్తిగా సమసిపోలేదు. ఆ సమస్య పరిష్కరించకుండా షెడ్యూల్ పూర్తవ్వదు. అందువల్ల నాకు, 'ఇక హైదరాబాద్ వెళ్ళడం కుదరదేమో! చనిపోయినప్పుడు రాలేదు, పెద్ద కార్యంకి కూడా రాలేదని బంధువులతో మాటపడాల్సి వస్తుంది. అందరూ నా భార్యని మాటలు అంటారు' అనిపించి బాబాని తలుచుకొని, "బాబా! ఈ సమస్య తొలగిపోయి నేను ఎటువంటి ఆటంకాలు లేకుండా హైదరాబాద్ వెళ్లి పెద్ద కార్యంలో పాల్గొనేలా చూడండి. ఒకరికి అన్నదానం చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయ చూపారు. సాయంత్రం 5 గంటలకి మరోసారి ఇంజన్ టెస్ట్ చేస్తే, సమస్య 90% సమసిపోయినట్టు తేలింది. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళడానికి ట్రైన్ కదలికకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని కూడా తెలిసి చాలా సంతోషించాను. బాబాకి మాటిచ్చినట్టు అన్నదానం చేసి ఆరోజు రాత్రి హైదరాబాద్‌కి బయల్దేరాను. తరువాత రోజు అందర్నీ కలిసి పెద్ద కార్యం నిర్వహణలో నా వంతు కృషి చేశాను. "చాలా ధన్యవాదాలు బాబా. మీ దీవెనలు ఎల్లప్పుడూ మీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".
1. బాబా అండగా ఉండగా సమస్యలు తీరకుండా ఉంటాయా?
2. పెద్ద ప్రమాదం నుండి కాపాడిన బాబా
బాబా అండగా ఉండగా సమస్యలు తీరకుండా ఉంటాయా?
శ్రీసాయినాథాయ నమః. సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. మా తమ్ముడు బెంగళూరులో హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒకసారి కొన్నిరోజులు సెలవులు వస్తే, తను మా అమ్మానాన్నల దగ్గరకు వచ్చాడు. ఇక్కడకు వచ్చాక చూసుకుంటే తన పర్సు కనపడలేదు. వెంటనే తను తన స్నేహితుడికి ఫోన్ చేసి, హాస్టల్లో ఉందేమో చూడమంటే, అతను గదంతా వెతికి లేదని చెప్పాడు. క్రెడిట్ కార్డులు, ఎటిఎం కార్డులు, డబ్బులు, ఇంకా చాలా రసీదులు ఆ పర్సులో ఉన్నందున మా తమ్ముడు చాలా టెన్షన్ పడ్డాడు. అప్పుడు నేను సద్గురు సాయినాథుని, "మా తమ్ముడు పర్సు దొరికేలా అనుగ్రహించమ"ని వేడుకున్నాను. బాబా అండగా ఉండగా మన సమస్య తీరకుండా ఉంటుందా? 15 రోజుల తర్వాత మా తమ్ముడి స్నేహితుడు ఫోన్ చేసి, "పర్సు దొరికింద"ని చెప్పాడు. మా ఇంట్లో అందరం చాలా సంతోషించాము.
2024, ఫిబ్రవరిలో ఒకరోజు అర్థరాత్రి సమయంలో ఉన్నట్టుండి నా ఛాతిలో బాగా నొప్పి వచ్చింది. నేను గ్యాస్ సమస్యేమోనని గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాను కానీ, ఆ బాధ తగ్గలేదు. అప్పుడు బాబా ఊదీ తీసుకొని కొంచెం నీళ్లలో వేసుకొని తాగి, 'ఓం ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ పడుకున్నాను. ఒక గంట తర్వాత కాస్త ఉపశమనంగా అనిపించి నిద్రపట్టింది. ఇలాగే ఒకసారి కడుపునొప్పి వచ్చి ఎంతకు తగ్గకపోతే, నాకు ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళాలేమో అనిపించింది. అప్పుడు బాబా ఊదీ తీసుకుని కడుపుకి రాసుకొని, "ఇంట్లో ఎవరూ లేరు బాబా. నువ్వే ఎలాగైనా ఈ బాధను తగ్గించాల"ని బాబా పటం ముందు బాధపడ్డాను. సాయినాథుడు భక్తులు బాధలు తీర్చే కల్పతరువు. కొద్దిసేపటికి ఏ మందూ వేయకుండానే నొప్పి తగ్గింది.
ఐదు సంవత్సరాలుగా నాకు మైగ్రేన్ బాధ ఉంది. అది జీర్ణ సమస్య, వాంతులతో నరకంలా ఉంటుంది, తలిస్తేనే నాకు భయమేస్తుంది. దానివలన నేను ఎంతో వేదన అనుభవించాను. నేను ఈ బ్లాగులో సాయికృపతో ఎంతోమంది తమ వ్యాధులను తొలగించుకున్నారని చదివి, "నాకు కూడా ఈ బాధ నుండి ఉపశమనం కలిగించండి. నేను సాయి దివ్యపూజ 9 వారాలు చేస్తాను" అని సాయికి మొక్కుకొని పూజ మొదలుపెట్టాను. మీరు నమ్ముతారో, నమ్మరో కానీ, పూజ మొదలుపెట్టింది మొదలు 9 వారాల్లో ఒక్కరోజు కూడా ఆ బాధ నాకు రాలేదు. నా సాయితల్లి నా బాధను తీసేసారు. మనం శ్రద్ధ-సబూరీతో ఉంటే ఎంతటి సమస్యనైనా బాబా చాలా తేలికగా తీసేస్తారు. బాబా మీద నమ్మకం ఉంచండి, ఆయనే మనల్ని రక్షిస్తారు. సాయినాథునికి శతకోటి వందనాలు.
పెద్ద ప్రమాదం నుండి కాపాడిన బాబా
1. అనుకున్నది నెరవేర్చే బాబా
2. కాదనుకున్న పనిని నెరవేర్చిన బాబా
అనుకున్నది నెరవేర్చే బాబా
నేను బాబా భక్తురాలిని. నా బ్యాంకు ఎటిఎం కార్డు ఎప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. అలాంటిది ఒకరోజు ఆఫీసు నుంచి వచ్చాక ఆ కార్డు కోసం బ్యాగులో వెతికితే, అది కనిపించలేదు. అకౌంటులో రెండు లక్షల రూపాయిలు ఉన్నందున కంగారుపడుతూ బ్యాగులో మళ్ళీ మళ్ళీ వెతికాను కానీ, కార్డు దొరకలేదు. అప్పుడు బాబాని తలుచుకుని, "సాయంత్రం వాకింగ్ పూర్తిచేశాక కార్డు ఎలాగైనా దొరకాలి బాబా" అని అనుకున్నాను. తర్వాత చూస్తే, కార్డు బ్యాగు పాకెట్స్‌లో కాకుండా విడిగా పడి కనిపించింది.
ఒకసారి నాకు పిప్పి పన్ను నొప్పి చాలా ఎక్కువగా వచ్చింది. టాబ్లెట్లు వాడుతున్నా తగ్గలేదు. ఒకరోజు రాత్రి పడుకునేముందు ఊదీ నీళ్లలో కలుపుకొని తాగి, "నొప్పి తగ్గాలి బాబా" అని అనుకుని పడుకున్నాను. నేను చెప్పేది మీరు నమ్మరు. రెండు, మూడు నిమిషాల్లో నొప్పి మొత్తం తగ్గిపోయింది. ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. బాబా ఊదీ ఒక దివ్య ఔషధం.
2024, ఏప్రిల్ 11న నేను ఒక ఫంక్షన్ విషయంగా మా ఊరికి బస్సు టికెట్ బుక్ చేసుకున్నాను. ఇంటి నుంచి బయలుదేముందు, "బాబా! ఈ రాత్రివేళ ప్రయాణంలో మీరు నా తోడు ఉండాలి. ఏదో ఒక రూపంలో నాకు దర్శనం ఇవ్వండి" అని బాబాకి చెప్పుకొని బస్సు ఎక్కాను. బస్సు బయలుదేరాక లైట్ల వెలుగులో రోడ్డు పక్కనుండే షాపుల మీద సాయి నామం రూపంలో బాబా రాత్రంతా కనిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు, మర్నాడు ఫంక్షన్‌కి వెళ్లే దారిలో దాదాపు 100 ఫొటోలలో బాబా నాకు దర్శనమిచ్చారు. ఎటు చూసినా బాబానే. ఆ మరుసటిరోజు రాత్రి మళ్ళీ బస్సులో తిరుగు ప్రయాణమయ్యాను. అప్పుడు కూడా బాబా విగ్రహ రూపంలో నాకు కనిపిస్తూనే ఉన్నారు. అలా ఒక్కసారి కనిపించండని అడిగినందుకు వందల సంఖ్యలో దర్శనమిచ్చారు నా సాయితండ్రి. ఇదంతా యాదృచ్చికమని మీరు అనుకోవచ్చు కానీ, మర్నాడు తెల్లవారుజామున 6:30కి ఈ బ్లాగు ఓపెన్ చేస్తే, "నీ ప్రయాణం అంతా నేను నీతోనే ఉన్నాను. ఇన్ని రోజులు నేను నిన్ను చాలా సందర్భాల్లో రక్షించాను" అన్న ఈక్రింది బాబా సందేశం వచ్చింది. "ధన్యవాదాలు బాబా. సదా మీరు మా వెంట ఉండి మమ్మల్ని నడిపించండి బాబా. ఈ జీవితాంతం మేమెప్పుడూ మిమ్మల్ని స్మరించేలా అనుగ్రహించండి. మా పాపకు బీటెక్‌లో క్యాంపస్ సెలక్షన్స్‌లో మంచి ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి".
కాదనుకున్న పనిని నెరవేర్చిన బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు నరేష్. నేను పనికోసం జార్ఖండ్ రాష్ట్రానికి వెళితే, అక్కడివాళ్లు నన్ను పనిలో చేర్చుకోవాడానికి నా పూర్తి వివరాలు అడిగారు. నేను అన్నీ వివరాలు చెప్పినప్పటికీ చివరిలో ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే, వాళ్ళు నా PF UAN నెంబర్ అడిగారు. PF గురించి మీకు తెలిసే ఉంటుంది. అదేనండి, మనం ఏదైనా కంపెనిలో పనిచేసేటప్పుడు నెలనెల కొద్ది మొత్తం డబ్బులు PF కింద కట్ చెస్తారు. మనం ఆ కంపెనీ విడిచి పెట్టినప్పుడు ఆ డబ్బు మనకి చెల్లిస్తారు. ఇక విషయానికి వస్తే, జార్ఖండ్ కంపెనీవాళ్ళు నన్ను కంపెనీలో చేర్చుకొని నెలనెలా నాకిచ్చే జీతం నుండి కొంత PF అమౌంట్ కింద వేయడానికి UAN నెంబర్ అడిగారు. కానీ ఆ నెంబర్ నాకు తెలీదు. అందువల్ల, "ఎలా తెలుసుకోవాలి సార్?" అని అడిగితే, "నువ్వు ఇంతకు ముందు ఏ కంపెనిలో పని చేసావో, వాళ్ళకి ఫోన్ చేసి అడుగు. వాళ్ళు చెప్తారు" అని అన్నారు. అందుకు నేను, "ఇప్పుడు ఆ కంపెనీ లేదు, మూసేశారు. మరెలా సార్?" అని అడిగాను. అప్పుడు, "నీకు దగ్గరలో అంటే హైదరాబాద్ PF ఆఫీసుకి వెళ్లి అడిగితే, చెప్తారు" అని అన్నారు సార్. సరేనననుకున్నాను కానీ, ఆ ఆఫీస్ హైదరాబాద్‌లో ఎక్కడ ఉంటుందో నాకు అస్సలు తెలీదు. పైగా నేను జార్ఖండ్ నుంచి హైదరాబాద్ పోవాలంటే 24 గంటలు పడుతుంది. అదీకాక నేను ఇంటి నుండి వచ్చి నెల కూడా కాలేదు. ఇంతలోనే ఏ మొఖం పెట్టుకొని పోవాలని బాగా బాధేసింది. కానీ అందరూ PF ఆఫీసుకి పోనిదే పని కాదని అన్నారు. నేను అందరి దేవుళ్ళకు మొక్కుకొని సాయితండ్రిని కూడా, "తండ్రీ! నేను ఇంటికి వెళ్లకుండానే PF వివరాలు నాకు అందేలా చూడండి" అని వేడుకున్నాను. 2, 3 గంటల తర్వాత నా స్నేహితునికి ఫోన్ చేసి విషయం చెపితే, తను తన స్నేహితుని ఫోన్ నెంబర్ నాకిచ్చి, అతనితో మాట్లాడమని అన్నాడు. నేను అతనితో మాట్టాడి నాకు UAN నెంబర్ కావాలని చెప్తే, అతనొక గంట లోపల నా UAN నంబర్ తీసుకొని నాకు చెప్పాడు. అలా నేను హైదరాబాద్ వెళ్లకుండా కాదనుకున్న పని సాయితండ్రిని వేడుకోగానే, ఆయన దయవల్ల నెరవెరింది. ఎవరికైన ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే అస్సలు భయపడకండి. సాయితండ్రి ఉన్నాడని దైర్యం తెచ్చుకొండి. "చాలా చాలా ధన్యవాదాలు సాయితండ్రీ".
1. బాబా మనం చెప్పే ప్రతిదీ విని అనుగ్రహిస్తారు
2. నమ్ముకున్నవారికి కల్పతరువు బాబా
బాబా మనం చెప్పే ప్రతిదీ విని అనుగ్రహిస్తారు
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రాణి. 2024, జనవరి 14, భోగి పండగ రోజున నాకు కడుపునొప్పి వచ్చింది. కొద్దిగా ఊదీ నీళ్ళలో వేసుకొని తాగితే కొంచం నొప్పి తగ్గింది. కానీ బండి మీద వెళ్లినప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు కడుపునొప్పి వస్తుండేది. అందుకని జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళితే చాలా పరీక్షలు వ్రాశారు. ఆ టెస్టులు చేయించుకొని రిపోర్టులు తీసుకొని మళ్లీ డాక్టర్ దగ్గరకి వెళ్తే, "కుడి అండాశయంలో తిత్తి ఉంది. ఆపరేషన్ చేయాలి. వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్ళండి" అని అన్నారు. సరేనని నేను గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే, అక్కడ మళ్ళీ స్కానింగ్ చేసి, "తిట్టి చాలా పెద్దగా ఉంది. ఆపరేషన్ చేయాలి" అని చెప్పారు. నేను, "మందుల ద్వారా తగ్గదా?" అని అడిగితే, "ఆపరేషన్ చేయాలి. మందు లేదు" అని డాక్టరు అన్నారు. ఇక చేసేదేమి లేక బాబా అనుమతి తీసుకొని 2024, మార్చి 22న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఆపరేషన్‌కి అరగంట సమయం పడుతుందన్నారు కానీ, గంటన్నర పట్టింది. ఎందుకంటే, కేవలం తిత్తిని తొలగించడం సాధ్యం కాలేదు. అది అండాశయాన్ని గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల తిత్తితోపాటు కుడి అండాశయాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. ఇకపోతే, తిత్తి పరిమాణం పెద్దగా ఉండటం వల్ల దాన్ని బయాప్సీకి పంపించాలన్నారు, నేను చాలా టెన్షన్ పడి, "బయాప్సీ రిపోర్టు నార్మల్‌గా రావాల"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా మనం చెప్పే ప్రతిదీ వింటారు. ఆయన టైమింగ్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. కానీ మనం మమ్ములు మనుషులం. కొంచెం కూడా ఓపిక పట్టలేము. అందువల్ల ఆ వారం రోజుల్లో నేను పడిన టెన్షన్ అంతాఇంతా కాదు. కానీ చివరికి బాబా దయవల్ల ఆపరేషన్ అయిన ఒక వారం తర్వాత వచ్చిన బయాప్సీ రిపోర్టు నార్మల్ అని వచ్చింది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. బాబాకి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలుపుకున్నా తక్కువే.
2024, జనవరిలో మా ల్యాప్‌టాప్ ఛార్జర్ పని చేయకపోతే నా భర్త ఆ ల్యాప్‌టాప్ బాగు చేయించడానికి తీసుకెళ్లి, 'ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పిన్ పని చేయడం లేదంటే' ఆ పిన్ మార్పించి, అలాగే వేరే ఛార్జర్ తీసుకొచ్చారు. అయితే మా పిల్లలు చిన్నవాళ్లు. వాళ్ళు ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు, తీసేటప్పుడు వాళ్ళ బలమంతా ఆ ల్యాప్‌టాప్ మీద చూపిస్తుండేవారు. దాంతో 2024, ఏప్రిల్ 7న ల్యాప్‌టాప్ ఛార్జర్ మరోసారి పని చేయలేదు. ఈ విషయంగా నా భర్త చాలా కోప్పడ్డారు. నాకు ఏం చేయాలో తోచక బాబాకి చెప్పుకొని ఊదీ ల్యాప్‌టాప్‌కి పెట్టి, ఆ రోజంతా అలాగే వదిలేసాను. మర్నాడు ఛార్జింగ్ పెడితే ల్యాప్‌టాప్ మాములుగా పనిచేసింది. అలా బాబా మా మీద దయ చూపించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. అందరి మీద మీ కృప ఇలాగే ఎల్లవేళలా ఉండాలి తండ్రీ".
నమ్ముకున్నవారికి కల్పతరువు బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు కోమలవల్లి. నా వయస్సు 42 సంవత్సరాలు. నా భర్త తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఆయన వల్ల మేము మా సొంత ఇంటిని పోగొట్టుకొని ఎన్నో ఆర్థిక సమస్యలతో తినడానికి లేక పిల్లలతో సహా పస్తులు వున్నాము. అలాంటి స్థితిలో మా అమ్మాయి వివాహం చేయగలనా అని నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ బాబా ఎంత దయ గల వారంటే పెళ్ళిచూపులకి వచ్చిన మొదటి సంబంధమే ఖాయమైంది. వివాహానికి కావలసిన డబ్బు తక్కువ వడ్డీకి, నెలనెలా చెల్లించేలా సమకూరింది. అది కూడా అన్నిటికీ నా జీతం సరిపోయేలా(నేను ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాను). బాబా దయతో ఏ ఆటంకాలు లేకుండా అమ్మాయి వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
ఇకపోతే, మాకున్న అర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నేనొక ఆవు తీసుకున్నాను. కానీ నాకు కలిసి రాక ఆ ఆవు అనారోగ్యం పాలై నేను చాలా నష్టపోయాను. దాంతో ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేక ఎంతో ఆవేదన చెందాను. ఇలాంటి సమయంలో ఒకరు జీతం మీద లోన్ ఇస్తామంటే, సరేనని అప్లై చేశాను. కాని వాళ్ళు ఒక ముఖ్యమైన పత్రం అడిగారు. దాన్ని ఎలా తీసుకురావాలో నాకు తెలియలేదు. నా ఆర్థిక పరిస్థితి కారణంగా నేను ఎవరితోనూ అంతగా కలవను. అందువల్ల ఆ పత్రం గురించి ఎవ్వరిని అడగాలో నాకు తెలియలేదు. అప్పుడు, "బాబా! నేను అ పత్రం గురించి ఎవరినీ అడగను. మీరే అ పత్రం నా కంటికి కనిపించేలా చేయండి. అలాగే నాకు లోన్ వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. నిజంగా బాబా ఎంత దయమయుడంటే అంతవరకు నేను ఎంత ప్రయత్నించినా దొరకనిది, బాబాను వేడుకున్న తర్వాత ఇంటర్నెట్‌లో ప్రయత్నిస్తే ఒక్క నిమిషంలోనే నాకు కావలసిన పత్రం దొరికింది. ఆ అద్భుతానికి నాకు అస్సలు మాటలు రాలేదు. నాకు లోన్ శాంక్షన్ అయి నా ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. జరగదనుకున్న పని జరిగింది. దీనికి పూర్తిగా బాబా అనుగ్రహమే కారణం. ఇలా ఎన్నో విషయాల్లో సాయినాథుని అనుగ్రహం నేను పొందాను. నమ్ముకున్నవారికి కల్పతరువు బాబా. "ధన్యవాదాలు బాబా. నా భర్త తాగుడు మానేలా చూడు దేవా".
1. నమ్మకాన్ని బలపరచిన బాబా2. అడిగిన వెంటనే ఎలా కావాలంటే అలా అనుగ్రహిస్తారు బాబా
నమ్మకాన్ని బలపరచిన బాబా
నా పేరు శైలజ. మేము అమెరికాలో నివాసముంటున్నాము. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అందమైన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇలాంటివి చదివాను కానీ, ఎప్పుడూ అనుభవించలేదు. 2023, డిసెంబర్ క్రిస్మస్ సెలవులకి మేము మా సోదరి ఇంటికి వెళ్లి, ఒక గురువారంనాడు కారులో తిరుగు ప్రయాణమయ్యాము. మధ్య దారిలో నాకొక విషయం గుర్తుకొచ్చింది. అదేమిటంటే, నేను ఆరోజు బాబాను ప్రార్థించానుగాని, నా నుదిటిపై ఊదీ పెట్టుకోవడం మర్చిపోయానని. నిజానికి నేనెప్పుడూ ఊదీ పెట్టుకోవడం మర్చిపోను. ఆ విషయం గుర్తొచ్చాక అయిందేదో అయిందనుకున్నాను. కొంతదూరం వెళ్ళాక మేము టిఫిన్ కోసం ఒక రెస్టారెంట్ వద్ద ఆగాము. అందరమూ తిన్నాక నేను నా కొడుకుని బాత్రూంకి తీసుకెళ్ళొచ్చి తిరిగి కారు ఎక్కాక మా ప్రయాణం ముందుకు సాగించాము. దాదాపు 3 గంటల తర్వాత నేను మామూలుగా నా కుడిచెవిని తాకితే నా చెవికున్న డైమండ్ చెవిపోగు తాలూకు శీల లేదు. నేను మొదటగా చెవిపోగు ఇంకా నా చెవికే ఉన్నందున ఆ శీల నా ఒడిలో లేదా కారులో ఎక్కడో పడి ఉంటుందనుకొని నా ఒడిలో, కారులో క్షుణ్ణంగా పరిశీలించాను. కానీ ఆ శీల దొరకలేదు. అప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయమేమిటంటే, 'నేను రెస్టారెంట్ వద్ద ఆగి, టిఫిన్ చేసి, బాత్రూంకి వెళ్ళొచ్చినప్పటికీ నా చెవిపోగు అక్కడెక్కడా జారిపడిపోకుండా ఇప్పటికీ చెవికి ఎలా ఉందోన'ని(శీల లేకుండా చెవిపోగులు ఎక్కువసేపు ఉండవని చాలామంది మహిళలకి బాగా తెలుసు). అదివరకు ఒకసారి అదే చెవిపోగు శీల ఇంట్లో ఎక్కడో పడిపోయి చాలాసేపటివరకు దొరకలేదు. అప్పుడు బాబాని ప్రార్థిస్తే దొరికింది. ఇక ప్రస్తుత అనుభవం విషయానికి వస్తే, గురువారంనాడు ఆ శీలను పోగొట్టుకున్నందున నేను సెంటిమెంట్‌గా ఫీలై చాలా కలత చెందాను. కానీ కనీసం డైమండ్ చెవిపోగు పోగొట్టుకోలేదని నన్ను నేను ఓదార్చుకున్నాను. అయినప్పటికీ దాన్ని సెంటిమెంట్‌గా భావించినందున, "పోగుట్టుకున్న ఆ శీల తిరిగి దొరికేలా చేయండి" అని బాబాను ప్రార్థించి 108 సార్లు జపం చేసాను. కానీ ఆ శీల దొరకలేదు. కొన్నిరోజులకి ఆ శీల గురించి నేను మర్చిపోయాను. తర్వాత చాలారోజులకి మేము 2024 కొత్త సంవత్సరం వేడుకలకి వేరే రాష్ట్రంలో ఉన్న మా సోదరుడి ఇంటికి వెళ్ళాము. అక్కడ అంతా బాగా గడిచి నేను సంతోషంగా ఉన్నాను. ఇక అక్కడినుండి తిరిగి రావడానికి సిద్ధమవుతున్న సమయంలో కారు డిక్కీలో మా సామాను పెడుతూ నా భర్త నన్ను పిలిచారు. నేను వెళ్లి చూస్తే, కారు డిక్కీలో సంవత్సరం క్రితం పోయిన చెవిపోగు శీల ఉంది. చాలాకాలం తర్వాత దాన్ని అక్కడ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలారోజులుగా ఉపయోగిస్తున్న ఆ కారులో చాలాకాలం తర్వాత ఆ శీల దొరకడం నిజంగా బాబా చేసిన అద్భుతం. ఎందుకింత బలంగా ఆ మాట చెప్తున్నానంటే, మావారు ఆ శీల పోయినప్పటినుండి ఎన్నోసార్లు ఆ డిక్కీ తెరిచారు. కానీ ఇంతకు ముందెప్పుడూ ఆ శీలని ఆయన అందులో చూడలేదు. ఈ అనుభవం ద్వారా నా ప్రతి చిన్న మోరను బాబా వింటున్నారన్న నా నమ్మకం మునపటికంటే మరింత బలపడింది. "ధన్యవాదాలు బాబా. మీరు ఏది చేసినా అది మా మంచికోసమే అన్న ఆలోచన నా హృదయంలో, మనస్సులో మరింత బలపడుతుంది. లవ్ యు సాయి. దయచేసి మీ బిడ్డలందరికీ ఈ కొత్త సంవత్సరం ఉగాదితో శుభారంభం అయ్యేలా ఆశీర్వదించండి. మేమంతా మీ బిడ్డలం. దయచేసి మా జీవితాలకు మంచి మార్గం వేయండి. నాకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉండేలా ఆశీర్వదించండి".
అడిగిన వెంటనే ఎలా కావాలంటే అలా అనుగ్రహిస్తారు బాబా
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు సరిత. నేను బొంబాయిలో ఉంటాను. 2023, డిసెంబర్‌లో మా కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి శిరిడీ వెళ్ళాము. మేము ముందుగా త్రయంబకేశ్వరం వెళ్లి శివయ్య దర్శనం చేసుకొని తర్వాత శిరిడీ వెళ్ళాము. మేము శిరిడీ చేరుకునేసరికి రాత్రి 8:30 అయింది. 'ఎప్పుడెప్పుడు సాయిని చూస్తానా?' అని నా మనసు ఆరాటపడింది కానీ, మావాళ్లు, 'హోటల్‌కి వెళ్లి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొని, రేపు ఉదయం దర్శనానికి వెళదామ'ని నిర్ణయిం చేసారు. ఇక చేసేది లేక సరే అలాగేనని రాత్రి పడుకొని పొద్దున్నే లేచి తయారవుతుంటే నా దురదృష్టం కొద్దీ నాకు విరోచనాలు మొదలయ్యాయి. "అయ్యో.. ఏంటి బాబా ఈ పరీక్ష? మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు మీ దర్శనం అయ్యేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. మావారు బయటకి వెళ్లి మెడికల్ షాపులో మందులు తెచ్చారు. ఆ మెడిసిన్ వేసుకొని దర్శనానికి బయలుదేరాను. నా మనసులో, "బాబా! నా మీద మీకు కోపం లేకుంటే నాకు పసుపు రంగు వస్త్రాలు ధరించి నాకు దర్శనం ఇవ్వండి" అని బాబాను వేడుకున్నాను. టికెట్ కోసం కౌంటర్ వద్దకి వెళితే, అక్కడ టీవీలో బాబా ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. చూడండి బాబా కృప! ఆయన నేను కోరినట్లు పసుపు రంగు వస్త్రాల్లో దర్శనం ఇచ్చారు. అది చూసి నా కళ్ళలో నీరు తిరిగాయి. బాబా ఎంత గొప్పవారు? అడిగిన వెంటనే మనకు ఎలా కావాలంటే అలా కనిపిస్తారు. బాబా దయవల్ల మాకు దర్శనం బాగా జరిగింది. తరువాత మేము ఎల్లోరా వెళ్లి సాయంత్రానికి తిరిగి శిరిడీ వచ్చాము. అప్పుడు నేను ఒక్కదాన్నే దర్శనానికి వెళ్ళాను. ఒక్క దర్శనమే చేసుకోలేనేమో అనుకున్న నాకు రెండుసార్లు దర్శనమిచ్చిన గొప్ప తండ్రి నా సాయినాథుడు.
ఒకసారి మేము మా సొంత వాహనంలో బొంబాయి నుండి హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు నేను, "సాయినాథా! క్షేమంగా మమ్మల్ని హైదరాబాద్ చేర్చి, మళ్లీ క్షేమంగా బొంబాయికి చేర్చు తండ్రీ" అని వేడుకున్నాను. బాబా మా ప్రయాణమంతా మాకు తోడుగా ఉండి మాకు ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుని క్షేమంగా మా ఇంటికి చేర్చారు. అలాగే మా అబ్బాయి పరీక్షలు బాగా వ్రాసేలా చూడమని బాబాని వేడుకున్నాను. ఆయన అలాగే కృప చూపారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
1. బాబా మనల్ని వదిలేయరు!2. బంధం నిలబెట్టిన బాబా
బాబా మనల్ని వదిలేయరు!
నా పేరు శర్మ. మేము అమెరికాలో నివాసముంటున్నాము. 2023, అక్టోబర్‌లో మా అబ్బాయి మాకు చెప్పకుండా క్రెడిట్ కార్డు మీద ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేసాడు. తర్వాత తను ఆ విషయం మాకు చెప్పి, తన తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పి, "ఇలా ఎప్పుడూ చేయను" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరే, తను కొన్న ఆ వస్తువు విషయంలో ఏమి చేయాలో మొదట్లో మాకు తెలియలేదు. దానికి సంబంధించి కొన్ని వివరాలు సేకరించి, చర్చించుకున్న మీదట ఆ వస్తువు వెనక్కి ఇచ్చేద్దామని నిర్ణయించాము. అయితే ఆ వస్తువు ఆన్లైన్లో కొన్నది. వాళ్ళని సంప్రదిస్తే, వాళ్ళు 'ఆ వస్తువు మీ ఊర్లో ఉన్న షాపులో ఇచ్చేయండి' అని మెయిల్ పెట్టారు. కానీ ఆ విషయంలో ఒక తిరకాసు వచ్చింది. మా ఊర్లో ఉన్న షాపులవాళ్ళు, "ఆ వస్తువు మేము తీసుకోమ"ని చెప్పారు. దాంతో ఆన్లైన్లో వాళ్ళకి పరిస్థితి చెప్పి, 'ఇప్పుడు ఏమి చేయాలో తెలిపమ'ని మెయిల్ పెట్టాము. అందుకు వాళ్ళు 'మేము మీకు రిటర్న్ స్లిప్ పంపుతాము' అన్నారు. అయితే ఎన్నిసార్లు అడిగినా 'ఇదిగో', 'అదిగో' అనడమే తప్ప రిటర్న్ స్లిప్ పంపలేదు. ఆఖరికి నాకు ఏమి చేయాలో తెలియక ఆ విషయం గురించి బాబాతో చెప్పుకున్నాను. ప్రతిసారీ చిన్న చిన్న సమస్యలకి వీగిపోయి అలా బాబాని అడగకూడదనుకోండి! కానీ, ఆ పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో తోచలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా కుర్రాడికి మంచి నడవడి రావాలి. మాతో చెప్పకుండా అలా క్రెడిట్ కార్డ్ వాడటం మంచిది కాదు కదా! అందుకోసం మరియు ఆ వస్తువు వెనక్కి ఇచ్చేయడం కోసం 'సహాయం చేయమ'ని బాబాను అడిగాను. అయితే పని అవ్వలేదు. అయినా నేను, 'సరే, చేసేదేముంది. బాబా మనల్ని అలా వదిలేయరు కదా!' అని అనుకున్నాను. కానీ మనసులో ఆందోళన అలానే ఉంది. దాదాపు ఆరు, ఏడు సార్లు ఫోన్ చేసాక చివరికి 2024, ఫిబ్రవరిలో వాళ్ళు రిటర్న్ స్లిప్ పంపారు. వెంటనే మేము ఆ వస్తువు వెనక్కి పంపేసాము. కానీ వాళ్ళు డబ్బు వాపస్ ఇవ్వలేదు. దాంతో మళ్ళీ వాళ్ళకి అనేకసార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది. చివరికి మార్చ్లో మీ డబ్బులు వాపసు ఇస్తాం అని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఫోన్ చేస్తే, "ఇంక డబ్బులు ఇవ్వం" అన్నారు. నేను ఇంకా ఆశ వదిలేసుకున్నాను. కానీ, 'అదేమిటి? వస్తువు ఇచ్చేసాం కదా! అయినా ఇలా చేస్తున్నారేంటి? లాయర్తో మాట్లాడాలేమో!' అని మధనపడ్డాను. ఆ రోజు ఎందుకో తెలీదు సాయి సచ్చరిత్రలోని "నీ డబ్బులు ఎక్కడకీ పోవు. ప్రశాంతంగా కూర్చో!" అని బాబా ఒక భక్తునితో అన్న ఒక వాక్యం గుర్తు వచ్చింది. ఆశ వదులుకున్న నేను మనసులో 'తప్పకుండా ఆ పని జరుగుతుంది. లేకపోతే ఆ వాక్యం నాకు గుర్తు రావడం ఏమిటి?' అని అనుకున్నాను. అయినా మనసులో ఆందోళన పోలేదు. సరిగ్గా 2024, ఏప్రిల్ 4, గురువారం మాకు ఒక మెయిల్ వచ్చింది. అందులో 'మరోసారి ఫోన్ చేస్తే, రెండు రోజుల్లో మీ డబ్బులు మీకు ఇస్తాము' అని ఉంది. అయితే గంటలోపే డబ్బులు వాపసు వచ్చినట్టు బ్యాంకు నుండి మాకు మెయిల్ వచ్చింది. అది చూసి బాబా అనుగ్రహానికి ఒక్కసారిగా నాకు ఉక్కిరిబిక్కిరి అయినట్టైంది. సమస్య తీరిపోయినందుకు బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి, "మరోసారి ఇటువంటి పరిస్థితి మాకు రాకూడదు. ఎప్పుడూ మిమ్మల్ని ఇలా పనికిరాని విషయాలకోసం అడిగే పని రాకూడదు. అయినా మీరు ఎప్పుడూ మాతో ఉంటే చాలు. ఆ తర్వాత ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది" అని చెప్పుకున్నాను. నేను మా పిల్లలతో, "భగవంతుడితో ఎప్పుడూ 'ఇది ఇవ్వు, అది ఇవ్వు' అని కూరలు బేరం ఆడినట్టు ఆడకూడదు. ఎప్పుడూ మాతో ఉండు అని అడిగితే చాలు. మిగతావి అవే వస్తాయి" అని చెప్తుంటాను. ఇండియాలో ఉన్నప్పుడు మా ఇంట్లో నాకు ఒక పుస్తకం ఇచ్చారు. ఏదైనా సమస్య వస్తే ఒక అంకె తలుచుకొని ఆ పుస్తకంలో సమాధానం చూడవచ్చు. అయితే ఆ పుస్తకం మొదట్లోనే 'ఇది అదృష్టం పరీక్షించుకునే పుస్తకం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి' అని వుంది. నేను ఆ పుస్తకాన్ని ఇప్పటివరకు ఇండియాలో ఒకసారి, అమెరికాలో ఒకసారి మాత్రమే చూసాను. అదీ కష్టమైన విషయాల్లో. ఈ ఎలక్ట్రానిక్ వస్తువు విషయంలో కూడా చూడలేదు.
బంధం నిలబెట్టిన బాబా
ఓం సాయినాథాయ నమః!!! నేను ఒక సాయిభక్తురాలిని. బాబా చాలా విషయాలలో నాకు తోడుగా ఉన్నారు. నాది ప్రేమ వివాహం. నా భర్త నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారు. అందువల్ల మేము సంతోషంగా ఉంటున్నాము. అయితే ఒకసారి ఒక చిన్న అపార్థం వల్ల మా మధ్య గొడవ మొదలైంది. దాంతో నా భర్త నాతో పొడిపొడిగా మాట్లాడుతుండేవారు. ఎప్పుడూ బాగా చూసుకునే నా భర్త హఠాత్తుగా అలా ఉంటుంటే నేను తట్టుకోలేక చాలా ఏడ్చాను. ఒకరోజు బాబా గుడికి వెళ్లి, బాబా పాదాల మీద పడి, "మేము మళ్ళీ ఎప్పటిలా అంతే ప్రేమగా ఉండాలి" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. బాబా దయవల్ల ఒక్క వారం రోజులకి అన్నీ సద్దుమణిగి మళ్ళీ నా భర్త నన్ను అంతే ప్రేమగా చూసుకుంటున్నారు. "చాలా ధన్యవాదాలు బాబా. మేము మా జీవితాంతం ఇలాగే ఆనందంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. నేను ఒక విషయంగా పోరాటం చేస్తున్నాను. ఆ సమస్య నుండి గట్టెక్కించి నా భర్త, బిడ్డతో ఆనందంగా ఉండేలా చేయండి బాబా. ఎప్పుడూ మాతో వుండి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి బాబా".