సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1013వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కలలుగన్న ఉద్యోగాన్ని అనుగ్రహించిన బాబా
2. సాయి ఆశీస్సులు
3. ఏళ్లనాటి బాధను మొదటివారం పూజతో తొలగించిన బాబా

కలలుగన్న ఉద్యోగాన్ని అనుగ్రహించిన బాబా


ఓం శ్రీ సాయీశ్వరాయ నమ:!!!


ముందుగా సాయినాథుని మార్గంలో ‘సాయి మహారాజ్ సన్నిధి’ బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయి భక్తజనులకు నా నమస్కారాలు. నా పేరు చండీశివప్రియ. నాకు బాబా అంటే ఎంతో ఇష్టం. ఆయనెప్పుడూ ఒక లాకెట్ రూపంలో నా చెంతనే ఉంటారు. నేను ప్రతి గురువారం బాబా గుడికి వెళ్తాను. నేను సాయి దివ్యపూజ, సాయి నవగురువార వ్రతాలు చేస్తాను. మహాపారాయణ గ్రూపులో కూడా ఉన్నాను. నేను నా రోజుని ఈ బ్లాగులో అనుభవాలు చదివి మొదలుపెడతాను. నేను ఇదివరకు నా అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు నా జీవితాన్నే మలుపు తిప్పిన అనుభవాన్ని పంచుకోబోతున్నాను. 


నాకు నా కష్టంతో జీవించడమంటే చాలా ఇష్టం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను, తమ్ముడు, అమ్మ, అమ్మమ్మ పెన్షన్ డబ్బుల మీదే జీవిస్తుండేవాళ్ళం. అందువలన నాకు మంచి కాలేజీలో సీటు వచ్చినప్పటికీ ఒక చిన్న కాలేజీలో బిటెక్ చేశాను. మంచి మార్కులు వచ్చినా కానీ కాలేజీవాళ్ళు నాకు ఎటువంటి ప్లేస్మెంట్ ఇప్పించలేదు. ఒక ఎమ్.ఎన్.సి సంస్థలో ఉద్యోగం చేయాలన్నది నా కల. అదీ సాఫ్ట్వేర్ ఇంజినీరు ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. అందువలన నేను హైదరాబాద్ వెళ్లి కోచింగ్ తీసుకుని ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాను. కానీ కరోనా వలన నేను కోరుకున్న ఉద్యోగం నాకు రాలేదు. కొంత వ్యవధి తరువాత మళ్ళీ ప్రయత్నిస్తే, ఒక ఉద్యోగం వచ్చినా ఆఫర్ లెటర్ ఇవ్వకుండా వాళ్ళు చాలా ఇబ్బందిపెట్టారు. దాంతో మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మా ఫ్రెండ్స్ కంపెనీలో అవకాశమిస్తే, ఒక ఆరు నెలలు చేసాను. తరువాత నేను చేసిన ప్రయత్నాలకి రెండు ఉద్యోగాలు వచ్చాయి. ఆ రెండింటిలో ఒకటి నాకు తెలిసిన ఏరియాలో కావడం వలన ఆఫీసు టైమింగ్స్ సాయంత్రం 4గంటల నుండి రాత్రి 12గంటలు వరకు అయినప్పటికీ అది బాబా నాకిచ్చిన అవకాశమని అందులో జాయిన్ అయ్యాను. అయితే రెండురోజులు వెళ్ళాక ఒక ఎమ్.ఎన్.సి సంస్థలో ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిసి అప్లై చేసాను. అయితే నాకెప్పుడూ చివరి రౌండు వరకు వచ్చాకా పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు చేజారిపోతుంటాయి. అందుచేత ఈసారి కూడా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం నాకు లేకపోయింది. కానీ బాబా దయవలన నేను అప్పటికే చేరిన కంపెనీలో అగ్రిమెంట్ మీద సంతకం చేయకముందే నాకు ఎమ్.ఎన్.సి సంస్థలో ఉద్యోగం వచ్చింది. నా కల నిజం అయింది. నేను పడిన కష్టానికి ఫలితం దక్కింది. నేను నమ్మిన బాబా నన్ను ఆదుకున్నారు. నా నమ్మకం నిజం చేశారు, నా కోరిక నెరవేర్చారు. ఇప్పుడు నేను శిరిడీ వెళ్లి బాబాను దర్శించి మొక్కు చెల్లించాలని కోరికతో బాబా పిలుపుకోసం ఎదురుచూస్తున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఈ ఉద్యోగంలో నా జీవితం జయప్రదంగా ఉండేలా దీవించండి సాయినాథా".


చివరిగా ఒక మాట: బాబా టైమింగ్ ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనం చేయాల్సింది భక్తిగా శ్రద్ద, సబూరీలతో ఎదురుచూడటమే.


సాయి ఆశీస్సులు


సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తుడిని. నేను అనంతపురం జిల్లాకు చెందినవాడిని. ముందుగా నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేసిన సాయిమాతకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. సాయి ఆశీస్సులతో నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఒక రోజు భారీ వర్షం కారణంగా నెట్‌వర్క్‌లో సమస్య ఏర్పడి, నా పని అకస్మాత్తుగా నిలిచిపోయింది. అప్పుడు నేను, "బాబా! సమస్య పరిష్కారమైతే, ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని సాయిని ప్రార్థించాను. సాయి ఆశీస్సులతో ఆ సమస్య పరిష్కరించబడింది. "ధన్యవాదాలు బాబా".


నేను నా ఉద్యోగానికి సంబంధించిన శిక్షణను పూర్తిచేసి చివరి పరీక్షకు, వైవాకు హాజరవ్వబోతూ ముందుగా, "బాబా! నేను ఈ పరీక్షలో నా ప్రతిభ కనబరిచేలా నాకు సహాయం చేయండి" అని సాయిని ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో అంతా బాగా జరిగింది. "థాంక్యూ బాబా".


నా ఉద్యోగంలో ఒక సమస్య వచ్చింది. అప్పుడు నా సహోద్యోగి ఒకరు మనం చేయాల్సిన ఒక అంశంపై వివరిస్తానని మెసేజ్ చేశారు. నేను ఇంకా నేర్చుకోవడం ప్రారంభించని భాషా నైపుణ్యాలలో ఒకదానికి సంబంధించినదై ఉంటుందని అనుకుని, "సాయీ! దయచేసి ఈ సమస్య నుండి నన్ను రక్షించండి" అని బాబాను ప్రార్థించాను. సాయి ఆశీస్సులతో నేను ఊహించినట్లుగా ఏమీ జరగలేదు. "మరోసారి మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయీ".


ఏళ్లనాటి బాధను మొదటివారం పూజతో తొలగించిన బాబా


సాయిభక్తులందరికీ, ఈ బ్లాగు నిర్వాహిస్తున్న సాయికి నమస్సుమాంజలి. నా పేరు మోదడుగు వాసు. మాది నెల్లూరు. నేను ఇంతకుముందు  మా కుటుంబంపై బాబా చూపిన దయకు సంబంధించి కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు నా శ్రీమతి ప్రసన్న పద్మజ విషయంలో బాబా చూపిన లీలను తెలియజేస్తున్నాను. ఆమె ఎన్నో ఏళ్లుగా కుడిభుజం నొప్పితో బాధపడుతుంది. ఈమధ్య ఆమె 'సాయి నవగురువార వ్రతం' మొదలుపెడుతూ, "బాబా! ఈ వ్రతం ద్వారా నేను మిమ్మల్ని సేవించుకోబోతున్నాను. మీరు దయతో ఎన్నో ఏళ్ళ నుంచి కుడిభుజం నొప్పితో నేను అనుభవిస్తున్న బాధను మీరే తీసేయాలి" అని బాబాతో చెప్పుకుంది. అద్భుతం, మహాద్భుతం! బాబా లీలను చూడండి. మొదటి వారం పూజ అయినప్పటి నుండి ఆమె అనుభవిస్తున్న బాధ మటుమాయం అయ్యింది. దాంతో రెండోవారం పూజ సమయానికి ఆమె సంతోషానికి అవధులు లేవు. ఈ విధంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని బాబా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆ తండ్రికి మనమేమిచ్చి ఋణం తీర్చుకోగలం. ఆ తండ్రికి శరణాగతి చేయడం తప్ప. ఆ సాయితండ్రిని నమ్ముకుని, విశ్వాసం, ఓపికతో ఉన్నట్లైతే అన్ని సమకూరుస్తారు. సదా బాబాతండ్రి  నామస్మరణే మనకు రక్ష.


బోలో శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!

కృతజ్ఞతతో బాబాకు శరణు శరణు...



11 comments:

  1. Baba if your blessings are there no problem at all. All troubles sloves with your karuna. Health problems sloves with your blessings. Om sai ram❤❤❤

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om sai ram om sai ram Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI..OM SAI RAM

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee

    ReplyDelete
  7. Baba thanks baba santosh ki promotion vachinaduku kani day shift ravali baba pleaseeee

    ReplyDelete
  8. షిరిడి శ్వర నా కుమారుని అనారోగ్యాన్ని రూపుమాపి నిర్మూలించి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని పాదాభివందనం చేసుకుంటూ వేడుకుంటున్నాను బాబా.. థాంక్యూ దేవా థాంక్యూ బాబా.. ఇప్పటికీ చాలా బాగుంది బాబా నీ దయతో అంతా బాగుండాలి బాబా సాయిరాం దేవా కరుణించి కాపాడు ఆశీర్వాదములను మాపై కురిపించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించు దేవా సాయినాధ.. నీవే కలవని నమ్మినాము సాయినాధ.. నీవే తప్ప మాకు ఈ లోకంలో ఎవరూ లేరు సాయిబాబా నీవే నీవే నీవే మాకు దిక్కు షిరిడి ఈశ్వర సాయిబాబా

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo