1. అసాధ్యమనుకున్న విషయంలో మార్గం సుగమం చేసిన బాబా
2. బాబా ప్రసాదించిన ఉపశమనం
3. ఊదీతో నొప్పి పూర్తిగా తగ్గించిన బాబా
అసాధ్యమనుకున్న విషయంలో మార్గం సుగమం చేసిన బాబా
బాబా తమకి సాధ్యం కానిది ఏదీ లేదని మరోసారి ఎలా నిరూపించారో తెలియజేసే అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. బాబా కూతురిగా ఏ చిన్న విషయానికైనా నేను సదా ఆయన దగ్గరకు పరిగెత్తుతాను. నేను నా మనోభావాలను నా కుటుంబసభ్యులతో కూడా పంచుకోను, కేవలం నా బాబాతోనే పంచుకుంటూ ఎల్లప్పుడూ వారి అనుగ్రహాన్ని పొందుతుంటాను. నా అనుభవానికి వస్తే.. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. కోవిడ్ పరిస్థితుల కారణంగా 2021లో పిల్లల్ని తిరిగి స్కూలుకి పంపడానికి అందరూ భయపడినట్లే నేను కూడా భయపడ్డాను. నా భయానికి కారణం ఏంటంటే, మా పెద్దబాబుకి వ్యాక్సినేషన్ అయిందికాని, చిన్నబాబుకి కాలేదు. పైగా స్కూళ్ళు తెరిచే సమయానికి యు.ఎస్.ఏలో కరోనా(డెల్టా రకం) ఉధృతి చాలా తీవ్రంగా ఉంది. దానివలన మేము పిల్లల్ని స్కూలుకి పంపడానికి భయపడి ఆన్లైన్ తరగతులు పెడతారేమోనని ఎదురుచూసాము. కానీ స్కూలు యాజమాన్యం కావాలంటే పిల్లల్ని కొత్త స్కూలుకి మార్చుకోమన్నారు. దాంతో మేము పిల్లల్ని కొత్త స్కూల్లో చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే 2020లోని ఆన్లైన్ తరగతుల విధానం కాక ఆ సంవత్సరం విభిన్నమైన కొత్త ఆన్లైన్ విద్య విధానాన్ని ప్రవేశపెట్టారు. స్కూలు కొత్తదైనందున ఆ విధానం పట్ల నేను అంత ఆసక్తి చూపలేదు. కానీ నాకు మరో దారిలేక సంకోచిస్తూనే పిల్లల పేర్లు నమోదు చేశాను. నా భర్త మాత్రం "కొత్త పాఠశాల బాగుంటుంది. చింతించక"ని నన్ను శాంతింపజేసే ప్రయత్నం చేసేవారు. అయినా నేను ప్రశాంతంగా ఉండలేకపోయేదాన్ని. ఇకపోతే, మా కమ్యూనిటీలో పిల్లలందరూ స్కూలుకి వెళ్తుండటం చూసి మా పెద్దబాబు, "నేను కూడా స్కూలుకి వెళ్తాన"ని ఏడుపు మొదలుపెట్టాడు. అయితే కొత్త స్కూలు వాళ్ళు ఒక సంవత్సరం అగ్రిమెంట్ తీసుకున్నందున నాకు వేరే మార్గం లేకపోయింది. కనీసం పిల్లల్ని బయటకు తీసుకెళ్లాలనుకున్నా అవకాశం లేక నేను రోజూ పిల్లలతో చాలా ఒత్తిడిని ఎదుర్కొనేదాన్ని. కానీ ఎవరితోనూ బాధను పంచుకోలేదు. చివరికి నా భర్తతో కూడా. సాధారణంగా ఆయన దేన్నీ అంతగా పట్టించుకోరు, చాలా తేలికగా తీసుకుంటారు. రోజూ తన స్నేహితులను చూసి ఏడ్చే మా బాబు ఒకరోజు నా దగ్గరకు వచ్చి, "నాకు ఎందుకు ఇలా జరుగుతోంద"ని అడిగాడు. అప్పుడు నేను తనతో, "నువ్వు బాబాను మనస్పూర్తిగా అడిగితే, ఆయన నీకు మార్గం చూపిస్తారు" అని అన్నాను. అందుకు తను, "నేను అడుగుతున్నాను" అన్నాడు. తరువాత ఒకరోజు నేను వంటగదిలో పని చేసుకుంటుంటే, తను నా దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి, "అమ్మా! నావద్ద ఒక ఆశ్చర్యకరమైన వార్త ఉంది. 'కొత్త స్కూలు వాళ్ళు మనం కావాలనుకుంటే ఆ స్కూలును విడిచిపెట్టి బయటకు వెళ్లొచ్చని మనకు అవకాశం ఇచ్చారు" అని చెప్పాడు. అది విని నేను చాలా సంతోషించాను కానీ, ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే. బాబా మాకు ఒక మార్గం చూపిస్తారని నాకు తెలుసు. చివరకు మేము అన్ని ఫార్మాలిటీలు పూర్తిచేసాక గురువారం నుండి మా బాబు తన పాత స్కూలుకి తిరిగి వెళ్ళాడు. బాబు స్కూలుకి వెళ్లేముందు దసరా రోజు బాబా తమను అభిషేకించే అవకాశం మాకిచ్చి మా కుటుంబమంతటిని ఆశీర్వదించారు. ఇప్పుడు నాకొడుకు సంతోషంగా స్కూలుకి వెళ్తూ, "అమ్మా! నేను ఏదైనా తినడానికి ముందు బాబాకి పెడుతున్నాను" అని చెప్పాడు. మేము కూడా సంతోషంగా ఉన్నాము. కొత్త స్కూల్లో ఉన్న నా స్నేహితులు కొంతమంది "మీరు ఎలా బయటకు వెళ్లార"ని ఆశ్చర్యంగా అడుగుతున్నారు. చూసారా! మేము అసాధ్యమని భావించిన విషయంలో నా కొడుకు కోసం బాబా ఎలా మార్గం సుగమం చేసారో? "బాబా! నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను, 'ఏ తల్లిదండ్రులూ జీవితాంతం తమ పిల్లలతో ఉండలేరు. పిల్లలు ఈ మాయ ఉచ్చులో పడకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలన్నది నా ఏకైక కోరిక. మేము విదేశాలలో ఉన్నందున మాకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దాని గురించే నేను మరింత ఆందోళన చెందుతున్నాను. మీ మనవలను మీ మార్గంలో ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత బాబా'. ఇంకా నేను ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నానో మీకు తెలుసు బాబా. నేను నా పూర్వజన్మ కర్మఫలాలను అనుభవిస్తున్నానని నాకు తెలుసు, అందుకు నేను ఫిర్యాదు చేయను. కానీ నాకు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారో ప్రజలకి తెలిసేలా చేసి ఈ ఒత్తిడి నుండి త్వరగా బయటపడేందుకు నాకు సహాయం చేయండి. లవ్ యు సాయీ. మరో అందమైన అనుభవంతో ఈ ద్వారకామాయిలో (సాయి మహారాజ్ సన్నిధి) మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మేమంతా మీ బిడ్డలం. దయచేసి ఈ సాయి మహారాజ్ సన్నిధిలోని ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి. ఇంకా మీ బిడ్డలందరికీ ఈ సన్నిధిలో చేరే అవకాశమిచ్చి, మీ లీలలను మరింతగా తెలుసుకునేలా అనుగ్రహించండి. ప్రణామాలు సాయితల్లి".
బాబా ప్రసాదించిన ఉపశమనం
నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం. 2021, నవంబర్ 1న నాకు "బిడ్డా! నీ కష్టములు తొలగును" అని బాబా సందేశమొకటి వచ్చింది. బాబా దయవలన అదేరోజు ఎన్నోరోజులుగా పెండింగ్లో ఉన్న ఒక పని పూర్తి అయింది. "థాంక్యూ సో మచ్ బాబా".
నేను ఒక ఆఫీసులో పని చేస్తున్నాను. 2021లో నేను 200 స్టాంపులు తీసుకుని, ఆఫీసు పుస్తకంలో ఎన్ని వ్రాసానో గుర్తు లేదు కానీ, నా పుస్తకంలో మాత్రం పొరపాటున 2000 అని వ్రాసుకున్నాను. దాంతో 1800 స్టాంపులు లెక్కకు తక్కువ వచ్చాయి. అది గమనించిన రోజు నేను చాలా టెన్షన్ పడి, "బాబా! ఆఫీసు పుస్తకంలో 200 స్టాంపులు వ్రాసి ఉండాలి" అని మనసులో అనుకున్నాను. తరువాత 2021, నవంబర్ 6న నేను ఆఫీసు పుస్తకంలో చూస్తే 200 అనే వ్రాసి ఉంది. అది చూశాక చాలా ఉపశమనంగా అనిపించింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే ఎల్లప్పుడూ మమ్మల్ని అందర్నీ కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!సద్గురు సాంబశివ మహరాజ్ కీ జై!!!
ఊదీతో నొప్పి పూర్తిగా తగ్గించిన బాబా
నా పేరు శ్రీలత. ఈ బ్లాగు ద్వారా మేము బాబాకు మరింత దగ్గరవుతున్నాము. ఇంకా మనకి ఉండే సమస్యలకు బాబా సమాధానం చాలవరకు ఈ బ్లాగులో దొరుకుతుంది. 2021లో నేను కోవి-షీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నాను. మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వేసిన చోట చాలా నొప్పి మొదలైంది. అసలు ఎటు కదిపినా భుజం దగ్గర చాలా నొప్పిగా ఉండేది. అలా ఐదురోజుల వరకు నొప్పి తగ్గలేదు. ఒకరోజు బాబాకి పూజ చేసే సమయంలో, "నొప్పి తగ్గేలా దయ చూపండి" అని బాబాని వేడుకొని, నొప్పి ఉన్న చోట ఊదీ రాసుకుని, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను. 3 రోజుల్లో మొత్తం నొప్పి తగ్గిపోయింది. నొప్పి తగ్గాక రెండో డోసు వ్యాక్సిన్ కూడా వేసుకున్నాను. "థాంక్యూ బాబా. మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు మీ ఒక్కరి మీద తప్ప ఎవరిపైనా నమ్మకం లేదు బాబా. నా జీవితానికి సంబంధించిన ఒక సమస్య గురించి మీకు ప్రతిరోజూ చెప్తున్నాను. నాకు నచ్చిన, నన్ను ఇష్టపడిన అబ్బాయితో నా వివాహం జరిపించండి. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మీ సమ్మతితో నచ్చిన వ్యక్తితో నా పెళ్లి జరగాలని నా కోరిక. నా జీవితానికి ఏది మంచిదో, అదే మీరు చేస్తారని నా నమ్మకం. కానీ మమ్మల్ని కలుపుతారని ఒక చిన్న ఆశ. చివరిగా మీ ఆశీస్సులు మా కుటుంబానికి సదా ఉండాలని కోరుకుంటున్నాను".
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺😀🌼🥰🌸🌹💕🤗👪
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
ReplyDeleteఓం సా౦ుు రాము ఈ రోజు సా౦ుు అనుభవాలు ఛాలా బాగా వున్నా యీ.బాబా నువ్వు అంటే చాలా అభిమానం.మమ్ములని కాపాడుతున్నావు. దయ గల తండ్రివి నీ వు.ఓం సా౦ుు బాబా నమస్కారము❤❤❤
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee
ReplyDeleteOm sri sai naathaaya namaha
ReplyDeleteOM SAIRAM
ReplyDeleteSAI ALWAYS BE WITH ME
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl
ReplyDelete