- సాయిని నమ్ముకున్నవారికి తప్పనిసరిగా మేలు జరుగుతుంది
- సమయానికి మార్గాన్ని చూపి అనుగ్రహించిన బాబా
- దయతో కోవిడ్ నుంచి కాపాడిన బాబా
సాయిని నమ్ముకున్నవారికి తప్పనిసరిగా మేలు జరుగుతుంది
సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై! కోరిన కోరికలు తీర్చే సాయి భగవానునికి సాష్టాంగ నమస్కారాలు. నా పేరు శ్రీకాంత్. మా అమ్మాయి ఇంటర్ చదువుతున్నప్పుడు 2021, మే రెండవవారంలో ఒకరోజు సాయంత్రం 6 గంటలకు తనకి హఠాత్తుగా జలుబు మొదలైంది. తరువాత కళ్లవెంట నీళ్లు కారటం, నిరంతరాయంగా దగ్గు రావటం మొదలయ్యాయి. నాకు ఏమి చేయాలో తోచక మా ఇంట్లో ఉన్న సాయిబాబా ఫోటో దగ్గర కూర్చుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రం జపించి, పాపకి బాబా ఊదీ పెట్టాను. ఆ రాత్రి తను బాగా నిద్రపోయింది. ఉదయానికి ఎటువంటి సమస్యా లేదు. నా కూతురుకి వచ్చిన సమస్యను తొందరగా నయం చేసిన శ్రీసాయినాథ్ మహరాజ్‌కు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను.
2021, మే 20 రాత్రి అనుకోకుండా నా భార్యకు, కొడుకుకు జ్వరం, తలనొప్పి వచ్చాయి. అప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో జ్వరమంటే ఎంత భయంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. వెంటనే నేను బాబా మీద భారం వేసి, వాళ్ళిద్దరికీ కొద్దిగా ఊదీ పెట్టి, "ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా చూడండి బాబా, సచ్చరిత్ర పారాయణ ప్రారంభిస్తాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయానికి ఇద్దరికీ జ్వరం అదుపులోకి వచ్చింది. "ఎలాంటి ఇబ్బందీ రాకుండా మమ్మల్ని కాపాడండి బాబా" అని బాబాకు సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నాను.
అయితే, 2021, మే 22 రాత్రి నుంచి నా భార్య, పిల్లలు జ్వరంతో చాలా ఇబ్బందిపడ్డారు. మే 23న ఎందుకైనా మంచిదని కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తూ, "బాబా! మీ దయవల్ల నాకు, నా కుటుంబానికి కరోనా పాజిటివ్ రాకుండా ఉండాల"ని వేడుకున్నాను. బాబా దయవల్ల రాపిడ్ టెస్టులో అందరికీ నెగిటివ్ వచ్చింది. మరునాడు RTPCR టెస్టు కూడా చేయించుకుంటూ, "బాబా! మీ దయతో ఈ టెస్టులో కూడా మా అందరికీ నెగిటివ్ అని రిపోర్ట్ రావాల"ని ఆ సాయినాథ్ మహరాజ్‌కి చెప్పుకుని సాష్టాంగ నమస్కారాలు తెలుపుకున్నాను. కానీ ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టులో నా భార్యకి, కుమార్తెకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. బాబా దయవల్ల నాకు, నా కొడుకుకి మాత్రం నెగిటివ్ వచ్చింది. అయితే, రిపోర్టు కాస్త ఆలస్యంగా రావడం వలన ఆలోగా నా భార్య ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ అయ్యింది. నేను చాలా భయాందోళనలకు గురయ్యాను. వెంటనే బాబా ముందు కూర్చుని, "వచ్చే గురువారంనాటికి నా భార్య, పిల్లలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటే మీకు అభిషేకం చేసి, పాలన్నం, పెరుగన్నం నివేదిస్తాను" అని బాబాకు చెప్పుకుని సాష్టాంగ నమస్కారం చేశాను. రెండు రోజులు గడిచాయి. నా భార్యకు ఇన్ఫెక్షన్ వలన ఆయాసం ఎక్కువైంది. నేను చాలా ఆందోళనపడ్డాను. మా కుటుంబంలోని వారందరూ, "ఆలస్యం చేయకుండా హైదరాబాదు తీసుకెళ్లి అక్కడ ఏదైనా హాస్పిటల్లో చేర్పించమ"ని చెప్పారు. కానీ నాకు, నా భార్యకు సాయిబాబా మీద ఉన్న నమ్మకంతో భారమంతా ఆయన మీదే వేసి, ఇంట్లోనే ఉండి డాక్టర్ సలహామేరకు మందులు వాడుతూ ఇద్దరమూ 'సాయి సచ్చరిత్ర' పారాయణ చేయసాగాము. నాకు తిండి, నిద్ర లేవు, జేబులో డబ్బులు కూడా లేవు, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరణ చేస్తూ గడిపాను. "ఆలస్యం చేస్తున్నావు, ఇప్పటికే ఊపిరితిత్తులు డామేజ్ అయ్యాయి. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమ"ని కుటుంబసభ్యులు అంటున్న మాటలు నన్ను మరింత ఆందోళనకు గురిచేసాయి. అయినా నేను సాయి మీద విశ్వాసాన్ని వదులుకోలేదు. చివరికి బాబా అనుగ్రహించారు. ఆయన దయవల్ల రోజురోజుకీ నా భార్య ఆరోగ్యం మెరుగుపడసాగింది. నా చెల్లెలు సరిత యొక్క పూర్తి సహకారం, నా కుటుంబసభ్యుల ప్రార్థనలు, బాబా ఆశీస్సులు పూర్తిగా అనుకూలించి 2021, జూన్ 3 గురువారంనాటికి నా భార్య పూర్తిగా కోలుకుంది. నా ఆనందానికి హద్దులు లేవు. బాబాకు అభిషేకం చేసి, పెరుగన్నం, పాలన్నం నైవేద్యంగా సమర్పించి, హారతి ఇచ్చాము. సాయి మీద నమ్మకముంచితే చాలు, సర్వకష్టాలూ దూరమవుతాయి. సాయిని నమ్ముకున్నవారికి తప్పనిసరిగా మేలు జరుగుతుందని నా అపారమైన నమ్మకం. అందుకే, నేను మా ఇంటికి కూడా 'శ్రీసాయినాథ నిలయం' అని పేరు పెట్టుకున్నాను. నాకు, నా కుటుంబానికి ఎల్లవేళలా రక్షగా ఉండమని ఆ సాయినాథుని వేడుకుంటున్నాను.
- శ్రీకాంత్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.
సమయానికి మార్గాన్ని చూపి అనుగ్రహించిన బాబా
సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2016లో నాకు ఛాతీలో నొప్పి వచ్చింది. మా ఊరి హాస్పిటల్లో E.C.G. తీయిస్తే, "గుండెలో కొంచెం సమస్య ఉంద"ని చెప్పారు. తరువాత హైదరాబాద్ వెళ్లి ఒక హాస్పిటల్లో చూపించుకుంటే, వాళ్ళు కూడా అదే చెప్పారు. మూడోసారి ఉషా ముళ్ళపూడి హాస్పిటల్‌కి వెళ్ళాను. వాళ్ళు, "పదిరోజుల్లో యాంజియోగ్రామ్ చేయాలి, గుండెకి చాలా సమస్య ఉంది" అని అన్నారు. నేను మా ఊరికి తిరిగి వచ్చి, మా బాబా మందిరానికి వెళ్ళాను. మా గురువుగారికి విషయం చెప్పి, బాగా ఏడ్చాను. అప్పుడు మా గురువుగారు, "పిచ్చిదానా! నీకు బాబా ఉన్నాడు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నీకు ఏమీ కాదు" అని చెప్పి, ఈ క్రింది శ్లోకం చదువుకోమన్నారు.
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం|
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు||
నేను ఆ శ్లోకాన్ని రెండురోజులు పఠించి, తరువాత కామినేని హాస్పిటల్‌కి వెళ్లాను. అక్కడ ఒక హార్ట్ స్పెషలిస్ట్ నన్ను పరీక్షించి, "ఇది గుండెనొప్పి కాదు, గ్యాస్ సంబంధిత నొప్పి" అని చెప్పారు. ఇదంతా బాబా మహిమ. సమయానికి గురువుగారి ద్వారా పలికించి నన్ను అనుగ్రహించారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యావాదాలు".
శ్రీసాయి చరణారవిందార్పణమస్తు!
దయతో కోవిడ్ నుంచి కాపాడిన బాబా
సాయిబంధువులకు నా నమస్కారం. ఇటీవల బాబా మా కుటుంబంలోని అందరినీ కోవిడ్ బారినుంచి కాపాడారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నిజానికి మా మమ్మీవాళ్ళు అసలు ఇంటినుంచి బయటికే వెళ్లరు. అలాంటిది ఒకరోజు మా మమ్మీకి జ్వరం వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎందుకైనా మంచిదని కోవిడ్ పరీక్ష చేయిస్తే, పాజిటివ్ వచ్చింది. అసలే ఆమె మానసికరోగి అయినందున, "ఏమిటి బాబా ఈ పరిస్థితి" అని ఇంట్లో అందరమూ కంగారుపడిపోయాము. ఐదవరోజుకు ఆమె ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోయేసరికి మరింత బెంబేలెత్తిపోయాము. తరువాత నెమ్మదిగా ఇంట్లో ఒకరి తరువాత ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చి అందరమూ కోవిడ్ పేషెంట్లు అయ్యాము. అటువంటి స్థితిలో అందరమూ బాబానే నమ్ముకుని ఆయననే ప్రార్థిస్తూ గడిపాము. బాబా మాపై అపారమైన కృప చూపించారు. ఆయన దయవల్ల మేమందరమూ క్షేమంగా కోవిడ్ నుంచి బయటపడ్డాము. మా అందరినీ కాపాడి బాబా మా జీవితాలలో అద్భుతం చూపించారు. బాబా కృప ఉంటే జీవితంలో సమస్తమూ ఉన్నట్టే! "బాబా! మా కుటుంబాన్ని రక్షించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు".
ఓం సాయిరాం
ReplyDeleteOm sai ram you are blessing every devotee.you take care about all devotees.in this time you are only our Lord to protect us. Om sai ram❤❤❤❤
ReplyDeleteJai sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tondarga tagginchu thandri sainatha
ReplyDeleteBaba santosh ki leg pain tagginchu thandri enka day shifts ravali thandri
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏❤😊
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete