- సాయి చూపిన లీలలు
- నమ్మకం ఉంటే చాలు, అన్నీ బాబా చూసుకుంటారు
సాయి చూపిన లీలలు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రావు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు కొన్నిటిని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోబోతున్నాను.
అనుభవం-1:
2021, మార్చి 22న మా సొంత ఊర్లో తప్పనిసరిగా వెళ్ళవలసిన ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్ళాలా, వద్దా అని తర్జనభర్జనలయ్యాక చివరికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాము. ఊరికి బయలుదేరేముందు బాబాకు నమస్కరించుకుని, 'సాయినాథా, నీదే భారం నాయనా. అంతా క్షేమంగా జరిగేట్టు చూడు తండ్రీ. ఇది అనివార్యమైన పని కాబట్టే వెళ్ళాల్సి వస్తోంది. మమ్మల్ని కాపాడే బాధ్యత నీదే బాబా' అని మనసారా వేడుకుని ఊరికి వెళ్ళాము. బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. ఈ అనుభవం ద్వారా బాబాపై మా నమ్మకానికి మరింత బలం చేకూరింది.
అనుభవం-2:
గత కొన్నాళ్ళుగా మేము కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకోవాలని మేమున్న నగరంలో ప్రయత్నించాము. అయితే ఇక్కడ టీకాల కొరత కారణంగా వ్యాక్సిన్ వేయించుకోవటం వీలుకాలేదు. ఊర్లో సులభంగా టీకాలు వేస్తున్నారని తెలిసి అక్కడ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రయత్నాలు చేశాము. అయితే బాబా మాకు వేరే ఏర్పాటు చేయటం వల్ల ఊర్లో కూడా మాకు వ్యాక్సిన్ దొరకలేదు. దాంతో బాబాను తలచుకుని, “ఏంటి నాయనా మాకీ పరీక్ష? నువ్వు చెప్పినప్పుడే వేయించుకుంటాములే” అనుకొని ఊరుకున్నాము. బాబా తప్పకుండా తమ లీల చూపించే తీరుతారు. రెండ్రోజుల తర్వాత వేరే ఊర్లో ఉన్న మా బంధువు ద్వారా మాకు అక్కడ వ్యాక్సిన్ వేసే ఏర్పాటు చేశారు. అంతేకాదు, టీకా వేయించుకున్న తర్వాత మాకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకున్నారు. “బాబా, నీ లీలలు తెలుసుకొనుట మానవులకు సాధ్యమా!”
అనుభవము-3:
ఈమధ్యనే జరిగిన సంఘటన ఇది. మా దగ్గరి బంధువుల ఇంటి స్థలం విషయంలో వాళ్ళకు బాగా దగ్గరైన వ్యక్తి గత మూడేళ్ళుగా సమస్యలు సృష్టిస్తూ వచ్చారు. చివరిగా కొన్ని రోజుల క్రితం మా బంధువులు లాయరును సంప్రదించి తన సలహా తీసుకున్నాక స్థలం లెవెల్ చేసే పని ప్రారంభించారు. సమస్యలు కల్పిస్తున్న వ్యక్తి ఈ విషయంపై తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వెళ్ళారు. ఆ సమయంలో నేనక్కడే ఉన్నాను. పోలీసులతో వ్యవహారమంటే అనవసరమైన తలనొప్పులు కదా! ఊరు ఊరంతా అతనిది అన్యాయమని చెప్పినా అతను పెడచెవిన పెట్టారు. ఏమవుతుందోనని నాకు ఒకటే టెన్షన్. అలాంటి సమయంలో ‘బాబానే మాకు దిక్కు’ అనుకుని బాబాను స్మరించుకుని, “సాయిదేవా! ఈ సమస్య నుండి కాపాడు తండ్రీ” అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఆ సాయినాథుడి కరుణతో మా బంధువులకు ఏ సమస్యా ఎదురవలేదు. అయితే, అదే విషయమై వారం రోజుల తర్వాత పోలీసులు మా బంధువుకి ఫోన్ చేసి ఒకసారి పోలీస్ స్టేషనుకి రమ్మన్నారు. దాంతో, మా బంధువు తనకు తెలిసినవాళ్ళని తోడుగా తీసుకెళ్ళి తన దగ్గరున్న ఋజువులన్నీ పోలీసులకు చూపారు. దాంతో పోలీసులు తృప్తి చెందినట్లుగానే ఉంది. సాయిబాబా దయవల్ల అంతా సవ్యంగా సాగుతుందనీ, మా వాళ్ళ చిరకాల వాంఛ తీరుతుందని నమ్ముతున్నాను.
నమ్మకం ఉంటే చాలు, అన్నీ బాబా చూసుకుంటారు
సాయిభక్తురాలు శ్రీమతి నవ్య తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:
ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా వందనాలు. నా పేరు నవ్య. నేను సాయిభక్తురాలిని. నాకు 2021, ఏప్రిల్ చివరి వారంలో కరోనా వచ్చింది. పదిహేను రోజుల తరువాత, మే 8వ తేదీన మళ్ళీ నేను కరోనా పరీక్ష చేయించుకోబోయే ముందు బాబాను ప్రార్థించి, "రిపోర్టు నెగెటివ్ వస్తే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. తరువాత టెస్ట్ చేయించుకుంటే, బాబా దయవల్ల నాకు నెగెటివ్ వచ్చింది. అది తెలిసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా, నాకు చెయ్యి నొప్పిగా ఉంటే అది కూడా తగ్గించమని బాబాను ప్రార్థించాను. ఆయన ఎంతో ప్రేమతో నొప్పిని తగ్గించారు. బాబా మనతోనే ఉన్నారు. ఆయన్ని నమ్మితే చాలు, సర్వకాలసర్వావస్థలందు మన వెంటే ఉండి మనల్ని నడిపిస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఇంకొక అనుభవం:
నాకు కరోనా తగ్గాక హఠాత్తుగా మా పాప కళ్లు ఎర్రబడ్డాయి. నాకు చాలా భయమేసింది. "ఏంటి బాబా, నాకు తగ్గింది అనుకుంటే పాపకు ఇలా అయింది" అని చాలా బాధపడ్డాను. "సరే, ఏదేమైనా మీరు పాపను చూసుకోండి" అని బాబాతో చెప్పుకొని బాబా ఊదీని పాపకు పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి పాపకు త్రాగమని ఇచ్చాను. తరువాత, 'ఉదయానికల్లా పాపకు నయమైతే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాన'ని అనుకున్నాను. కొంతసేపటి తరువాత, మా పాప నుదుటన పెట్టిన బాబా ఊదీ కొద్దిగా రాలి తన కంటిలో పడింది. దాంతో పాప తనకు నొప్పిగా ఉందని ఏడ్చింది. నేను తనతో, "ఏమీ కాదు, బాబా ఉన్నారు" అని చెప్పి నిద్రపుచ్చాను. ఉదయం లేచి చూస్తే తన కన్ను మామూలుగా ఉంది. ఎరుపుదనం పూర్తిగా తగ్గిపోయింది. దాంతో పాప చాలా సంతోషించింది. బాబాను నమ్మితే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటారు. "థాంక్యూ సో మచ్ బాబా!"
Om sai ram you can slove any problem.if we trust you you take care of us.this world you only save from Corona free.om sai ram������ ����❤��
ReplyDeleteOm Sri Sai Ram ��������
ReplyDeleteNandri sai baba arulum enakum.palaleelaigal purinthar
ReplyDeleteOm Sairam
ReplyDeleteOm Sairam
Om Sairam
ఓం సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
753 days
ReplyDeletesairam
Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri nuvve medicine evali thandri
ReplyDeleteBaba santosh ki job ravali day shifts ravali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete