సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 806వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి చిన్న విషయంలోనూ మమ్మల్ని కాపాడుతున్న బాబా
2. సాయి కరుణ

ప్రతి చిన్న విషయంలోనూ మమ్మల్ని కాపాడుతున్న బాబా


ముందుగా సాయిభక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మేము యూరప్‌లో నివసిస్తున్నాము. ఒకరోజు భాషాసంబంధమైన ఒక పనిమీద నేను, మావారు స్కూలుకి వెళ్లాల్సి వచ్చింది. మాకు ఒక చిన్నబాబు ఉన్నందున కరోనా పరిస్థితుల వల్ల తనను తీసుకుని బయటకు వెళ్లాలంటే భయమేసింది. కానీ తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. అందువలన నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! మాకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేలా చూడండి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి సమస్యా రాలేదు. అంతా సవ్యంగా జరిగిపోవడంతో ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అయితే, మరుసటిరోజు మళ్ళీ మావారు స్కూలుకి వెళ్లాల్సి వచ్చింది. దాంతో నేను మళ్ళీ బాబాకు, "ఏ సమస్యా రాకుండా చూడండి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు. "థాంక్యూ బాబా". తరువాత కూడా ఒకసారి మావారు వేరే పనిమీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. నాకు భయమేసి, "బాబా! ఎలాంటి సమస్యలూ లేకుండా చూడండి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా మళ్ళీ మాపై తమ అనుగ్రహాన్ని చూపించారు. ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఈ అనుభవం చాలా సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినందువల్ల మీతో పంచుకుంటున్నాను. నేను ఇదివరకు ఎప్పుడూ ఊరగాయ పెట్టలేదు. మొదటిసారి యూట్యూబ్‌లో చూసి ఊరగాయ పెట్టాను. అంతా బాగానే వచ్చింది కానీ ఉప్పు తక్కువగా అనిపించడంతో మరికొంత ఉప్పు వేశాను. దాంతో ఊరగాయ చాలా ఉప్పగా అయిపోయింది. ఐదారు నెలలు నిల్వ ఉండే ఊరగాయ అలా అయిపోయేసరికి మావారు తిడతారేమోనని నాకు భయమేసింది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఊరగాయ అంతా వృధా అయిపోతుంది అనుకున్నాను. అప్పుడు, "బాబా! ఊరగాయలో ఉప్పు ఎక్కువ కాకుండా మంచిగా ఉండేలా చూడండి" అని అనుకున్నాను. బాబా అద్భుతం చేశారు. మధ్యాహ్నం ఉప్పగా ఉన్న ఊరగాయ కాస్తా సాయంత్రానికి అన్నీ సరిగ్గా సరిపోయి చాలా రుచిగా ఉంది. ఉప్పు ఏ మాత్రం ఎక్కువగా లేదు. నా భర్త ఊరగాయ తిని, "ఊరగాయ చాలా రుచిగా ఉంది. ఇంతవరకు నేనెప్పుడూ ఇంత రుచికరమైన ఊరగాయ తినలేదు" అని అన్నారు. నా భర్త తిడతారేమోనని భయపడిన నాకు అంతటి ప్రశంసలు బాబా ఇచ్చారు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇదంతా బాబానే చేశారు. "థాంక్యూ బాబా! మీకు సదా ఋణపడివుంటాను".


మా బాబుకి ఒకటిన్నర సంవత్సరం వయసున్నప్పుడు పెన్నుతో ఆడుకుంటూ రీఫిల్‌కి ఉండే బాల్‌పాయింట్‌ టిప్‌ని నోట్లో పెట్టుకున్నాడు. ఆ సమయంలో మేము అది గమనించలేదు. తరువాత ఆ టిప్ కనపడకపోయేసరికి అంతా వెతికాము. కానీ అది ఎక్కడా కనిపించలేదు. బహుశా దాన్ని బాబు నోట్లో పెట్టుకున్నాడేమోనని తన నోట్లో వెతికాను. కానీ అది కనిపించలేదు. దాంతో, ఒకవేళ బాబు ఆ బాల్‌పాయింట్‌ టిప్‌ని మింగేశాడేమోనని మాకు చాలా భయం వేసింది. వెంటనే, "ప్లీజ్ బాబా! ఆ బాల్‌పాయింట్‌ టిప్‌ కనిపించేలా చేయండి" అని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. మరుక్షణంలో బాబా సమాధానమిచ్చారు. బాబు నాలుక కింద ఏదో ఉన్నట్లు శబ్దం వస్తే, చూశాను. తన నాలుక కింద ఆ బాల్‌పాయింట్‌ టిప్‌ ఉంది. వెంటనే దానిని బయటికి తీసేశాను. "చాలా చాలా థాంక్స్ బాబా. నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. పిలిచినంతనే సహాయం అందించారు. థాంక్యూ వెరీ మచ్ బాబా!


మా బాబుకి సంవత్సరం ఎనిమిది నెలల వయసున్నప్పుడు ఒకసారి మేము తనను ఎత్తుకుని ఉండగా, తను అటూ ఇటూ కదులుతూ ఆడుతున్నాడు. అలా ఆడుతూ ఆడుతూ హఠాత్తుగా జారి క్రిందపడిపోయాడు. తన తల నేలను తాకిన శబ్ధం నేను స్పష్టంగా విన్నాను. దెబ్బ గట్టిగా తగలడంతో తను బాగా ఏడ్చాడు. ఎంతకీ ఏడుపు ఆపకపోయేసరికి నాకు చాలా భయమేసి, "బాబా! బాబుకి ఏ సమస్యా ఉండకూడదు" అని అనుకున్నాను. బాబా దయవలన బాబుకి ఏమీ కాలేదు. నార్మల్‌గా ఉన్నాడు. "థాంక్యూ బాబా, థాంక్యూ వెరీ మచ్".


ఒకసారి నా మొబైల్ హఠాత్తుగా ఆఫ్ అయ్యింది. తరువాత ఎంత ప్రయత్నించినా ఆన్ కాలేదు. అప్పుడు నేను, "బాబా! ఫోన్ ఆన్ అయ్యేలా దయ చూపండి" అని అనుకున్నాను. తరువాత మళ్ళీ ఒకసారి మొబైల్ ఆన్ చేయడానికి ప్రయత్నించాను. బాబా దయవలన మొబైల్ ఆన్ అయింది. అంతా సక్రమంగా పని చేసింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. థాంక్యూ వెరీ మచ్ బాబా".


ఒకసారి నా భర్తకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించి, "నేను ఒకసారి కోవిడ్ టెస్ట్ చేయించుకుని వస్తాను" అన్నారు. అన్నట్లుగానే వెళ్లి టెస్ట్‌కి శాంపిల్స్ ఇచ్చి వచ్చారు. అప్పుడు నేను బాబాతో, "బాబా! నా భర్త రిపోర్టు నెగిటివ్ రావాలి" అని చెప్పుకున్నాను. బాబా దయవలన నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. "థాంక్యూ వెరీ మచ్ బాబా".


సాయి కరుణ


ఓం శ్రీ సాయినాథాయ నమః. ముందుగా శ్రీ సాయినాథునికి నా సాష్టాంగ నమస్కారాలు. నా పేరు శ్రీవాణి. మాది కొల్లాపూర్. నాకు మొదటినుండి బాబా అంటే అమితమైన భక్తి. సచ్చరిత్ర పారాయణ చేస్తుండేదాన్ని. నాకు ఏ కష్టం వచ్చినా నేను సాయినాథునికే చెప్పుకుంటాను. ఒకసారి నేను బాబాకు నమస్కరించుకుని, "నాకు కొడుకు పుడితే, నీ పేరుతో పిలుచుకుంటాను సాయీ" అని బాబాకు మ్రొక్కుకున్నాను. సాయి నన్ను కరుణించి నాకు కొడుకుని ప్రసాదించారు. నేను బాబాకు ఇచ్చిన మాట ప్రకారం నా కొడుకుని 'సాయీ' అని పిలుచుకుంటున్నాను. 


ఒకసారి నాకు సయాటికా నొప్పి వచ్చింది. నేను బాబానే నమ్ముకుని, "తొందరగా ఈ నొప్పి తగ్గించు స్వామీ" అని వేడుకుని, నొప్పి ఉన్న చోట ఊదీ మర్దన చేసేదాన్ని. ఎంతో కరుణతో బాబా నా సయాటికా నొప్పిని పూర్తిగా తగ్గించారు


తరువాత నాకు నెలసరి సమస్య వచ్చింది. నెల మధ్యలో బ్లీడింగ్ కనపడటంతో చాలా ఇబ్బందిపడ్డాను. హాస్పిటల్‌కి వెళ్ళాలని అనుకున్నాను. కానీ వెళ్ళకుండా, "సాయీ! నీవే ఈ నెలసరి సమస్య నుండి నన్ను కాపాడు స్వామీ" అని బాబాని వేడుకున్నాను. కరుణతో సాయి ఆ సమస్య నుండి నన్ను కాపాడారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కరుణ ఎప్పుడూ ఇలాగే మాపై ఉండాలి తండ్రీ".


12 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Kothakonda SrinivasJune 15, 2021 at 2:53 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  3. Om sai ram sai saved his devotee in time. That is sai power.if we trust him whole heartly he takes care about all. Om sai ram❤❤❤

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  6. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  7. Baba santosh ki salary hike ayyi day shifts ravali thandri

    ReplyDelete
  8. Baba eroju ma nanna birthday please bless him baba arogyanga vundela chudu baba ekadunna kshemanga undali thandri

    ReplyDelete
  9. Baba ee arogya samasya tondarga teerchu thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo