- బాబా ఊదీతో కాళ్ళ పగుళ్ళు మాయం:
- డ్రైవింగ్ లైసెన్స్ అనుగ్రహించిన బాబా:
- రెండు నాణేలను ప్రసాదించిన బాబా:
- దివ్యపూజతో నిశ్చయమైన వివాహం:
- కరోనా నుండి కాపాడిన బాబా
నాకు తల్లి, తండ్రి, గురువు అయిన ఆ సద్గురు శ్రీసాయినాథునికి నమస్కారములు. "బాబా! నా అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యం జరిగినందుకు నన్ను క్షమించండి. సర్వమూ మీకు తెలుసు. నేను ఓర్పు, విశ్వాసాలతో మిమ్మల్నే శరణు వేడుకుంటున్నాను బాబా". ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిభక్తులకు నా కృతజ్ఞతలు. నా పేరు నాగార్జున. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు సాయి కృపతో మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను.
బాబా ఊదీతో కాళ్ళ పగుళ్ళు మాయం:
మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. నేను ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకు మొక్కల పెంపకానికి సంబంధించిన పనికి వెళ్లి సాయంత్రం ఏడు గంటలకు తిరిగి ఇల్లు చేరుకుంటాను. ఆ పని కారణంగా ఈమధ్య నా పాదాలు పగిలిపోయి నడవడానికి ఎంతో ఇబ్బందిపడ్డాను. కొన్ని మందులు, ఆయింట్‌మెంట్లు వాడినప్పటికీ గుణం కనపడలేదు. అలా పదిహేను రోజులు ఎంతో బాధను అనుభవించాను. ఒకరోజు పూజ చేస్తుండగా బాబా పాదాల చెంత పడివున్న విభూతిని చూసి, దాన్ని పాదాల పగుళ్ళకు రాద్దామనుకుని కూడా ‘విభూతిని అరికాళ్లకు రాయవచ్చో, లేదో’ అని సందేహించి ఆగిపోయాను. అదేరోజు రాత్రి నాకు కలలో విభూతి రాశి నా మీద పడుతున్నట్లుగా దర్శనమైంది. వెంటనే నిద్రలేచి దేవుడి గదికి వెళ్లి, "నన్ను క్షమించు తండ్రీ" అని బాబాను ప్రార్థించి, విభూతిని నా అరికాళ్ళ పగుళ్లకి రాసుకున్నాను. అలా రెండు రోజులు చేశాక మూడోరోజు నేను ఎటువంటి ఇబ్బందీ లేకుండా హాయిగా నడవగలిగాను. సాయిభక్తులారా! నేను చెప్పేది ఏమిటంటే, మనకు బాధ ఎక్కడున్నా సరే సద్గురుని తలచి విభూతి ధారణ చేయాలి. అంతా సాయికి తెలుసని నమ్మాలి.
డ్రైవింగ్ లైసెన్స్ అనుగ్రహించిన బాబా:
ఇది నా డ్రైవింగ్ లైసెన్స్‌కి సంబంధించింది. 2020 ఫిబ్రవరిలో నేను లైసెన్స్ కోసం దరఖాస్తు చేశాను. కానీ కరోనా వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాక మళ్లీ లైసెన్స్‌కి దరఖాస్తు చేశాను. కొన్ని కారణాల వల్ల మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి నన్ను రెండు, మూడుసార్లు లైసెన్స్ కోసం ఆఫీసు చుట్టూ తిప్పాడు. దాంతో నాకు అతనిపై కోపం వచ్చినా ఆఫీసులో ఉన్న బాబా ఫోటోను చూసి, "తండ్రీ! నీ ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు" అని చెప్పుకుని వచ్చేశాను. మరుసటిరోజే అతను నాకు ఫోన్ చేసి, 2021, మార్చి 9న నన్ను ఆర్.టి.ఓ ఆఫీసుకు రమ్మన్నాడు. నన్ను పిలవడానికి దాదాపు సంవత్సర కాలం పట్టినా తొమ్మిది సంఖ్య ఉన్న రోజున రమ్మన్నందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ఆరోజు నేను ఆర్.టి.ఓ. ఆఫీసుకి వెళ్లి, ట్రయల్ వేయగా నాకు లైసెన్సు వచ్చింది. ఆ తర్వాత నేను నా సెల్‌ఫోన్ ఆన్ చేసి వాట్సాప్ చూస్తుండగా ఒక గ్రూపులో బాబా మెసేజ్ ఇలా ఉంది: "ఇక గందరగోళం ఉండదు. మీ నిరీక్షణ ముగిసింది. నా నుండి సంతోషాన్ని తీసుకోవడానికి మీకు సమయం వచ్చింది. మీరు మీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు" అని. అది చూస్తూనే నాకు పట్టలేని ఆనందం కలిగింది. వెంటనే సాయిభక్తుడైన నా స్నేహితుడికి ఫోన్ చేసి తనతో నా ఆనందాన్ని పంచుకుని సంతోషంగా ఇంటికి వచ్చాను. అయితే ఈ అనుభవానికి సంబంధించి ఒక ముఖ్య విషయం చెప్పాలి. అదేమిటంటే, నేను ప్రతిసారీ మా ఇంటి నుండి నేరుగా ఆఫీసుకి వెళ్ళేవాడిని. కానీ ఆరోజు నేను అనుకోకుండా ఏదో ధ్యాసలో ఆఫీసు దాటి రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయాను. నేను ఆగిన ప్రదేశంలో రోడ్డుకు అవతలిప్రక్క బాబా మందిరం ఉంది. వెంటనే రోడ్డు దాటి అవతలికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని ఆనందంగా ఆఫీసుకి వెళ్ళాను. బాబా ఆశీస్సులతో నాకు లైసెన్సు వచ్చింది. ఏదైనా విషయంలో ఆలస్యం జరుగుతున్నప్పుడు, ఆలస్యం జరుగుతుందన్న భావన మనసులోకి రానీయకుండా "నాకు ఎప్పుడు ఏది అవసరమా నీకు తెలుసు తండ్రీ" అని బాబాతో చెప్పుకుని ఓర్పుతో ఎదురుచూడటమే నిజమైన సాయితత్వం.
రెండు నాణేలను ప్రసాదించిన బాబా:
మా ఇంటి ఆవరణలో ఒక నింబవృక్షం (వేపచెట్టు) ఉంది. ఆ వృక్షానికి మేము నిత్యం నీళ్ళు పోసి, పసుపు, కుంకుమ, ధూపదీపాలు సమర్పించి పూజ చేస్తాం. ఎందుకంటే, మా ఇల్లు 'ద్వారకామాయి' అని, ఆ నింబవృక్షం 'గురుస్థానం' అని మేము భావిస్తాము. 2021, మార్చి 21న మా అమ్మ యథావిధిగా ఆ నింబవృక్షానికి పూజ చేసింది. అప్పటికి రెండు రోజుల ముందు నుండి ఆమెకు అక్కడ ఏదో మెరుస్తున్నట్లు అనిపిస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆరోజు నీళ్లు పోస్తుండగా చెట్టు మొదలులో గుచ్చినట్లు ఉన్న రెండు నాణేలు స్పష్టంగా కనిపించడంతో, వాటిని తీసి ఇంటి లోపల పెట్టింది అమ్మ. నేను నర్సరీ నుండి వచ్చాక అమ్మ నాకు ఆ విషయం చెప్పింది. అవి చూసి నాకు, "అయ్యో, బాబా! నేను మీకు ఇచ్చినవి, తిరిగి ఇచ్చేశావా!" అని బాధగా అనిపించింది. తరువాత మందిరంలో పంతులుగారికి ఫోన్ చేసి విషయం చెప్పగా అతను, "అది మీ అదృష్టం. వాటిని మీ పూజామందిరంలో ఉంచి పూజించుకోండి. అంతా మంచే జరుగుతుంది. త్వరలో ఏదో మంచి జరగనుంది. దానికి ముందుగా సద్గురు సాయి ఈ విధంగా సందేశం ఇచ్చారు" అని చెప్పారు. వెంటనే నేను ఆనందంగా ఆ నాణేలను పూజించి పూజామందిరంలో ఉంచాను. మరుసటివారం మహాపారాయణ గ్రూపులో నాకు 26, 27 అధ్యాయాలు వచ్చాయి. 26వ అధ్యాయంలో (సచ్చరిత్ర పేజీ నెంబర్లు 208 నుండి 211 వరకు) హరిశ్చంద్ర పితళే గురించిన అనుభవం ఉంది. ఆ లీల చదువుతూనే నా ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. బాబా ఆ భక్తునికి తమ స్వహస్తాలతో రెండు నాణేలను ప్రసాదించి ఆశీర్వదించినట్లు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించారని చాలా సంతోషించాను. ఇంతకంటే నిదర్శనమేం కావాలి ఆ సద్గురు లీలా వైభవానికి?
దివ్యపూజతో నిశ్చయమైన వివాహం:
ఈ అనుభవం నాకు తెలిసిన సాయిభక్తులలో ఒకరికి జరిగింది. ఆ సాయిభక్తురాలు మందిరంలో ఉండగా తన స్నేహితురాలు ఒకరు వచ్చి తన తమ్ముడికి వివాహం ఆలస్యం అయిందని బాధపడింది. ఆ సాయిభక్తురాలు ఆమెతో, "నువ్వు సాయి దివ్యపూజ చేయి" అని చెప్పింది. దాంతో ఆమె ఐదు గురువారాలు పూజ చేస్తానని సంకల్పం చేసుకుని పూజ ప్రారంభించింది. అయితే 5 వారాలు పూర్తయినా ఫలితం కనపడలేదు. అప్పుడు ఆమె, 'నా తమ్ముడికి వివాహమయ్యేంతవరకు దివ్యపూజ చేస్తాన'ని సంకల్పించుకుని పూజ యథావిధిగా కొనసాగించింది. ఏడవ వారం ఆమె పూజ చేస్తుండగా తన తమ్ముడు ఫోన్ చేసి, "అక్కా! ఎవరో ఒక సంబంధం తీసుకొచ్చారు" అని చెప్పాడు. అది విన్న ఆమె ఆనందం పట్టలేకపోయింది. పూజ ముగించుకుని మరుసటిరోజు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది. 8వ వారం పూజ సమయానికి ఆ సంబంధం నిశ్చయమైంది. ఇప్పుడు వాళ్ళు పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకో విషయం, ఆమె దివ్యపూజ చేసే సమయంలో ప్రక్కనున్న వేరొకరు వాళ్ళ అమ్మాయి వివాహ విషయంగా దివ్యపూజా విధానం తెలుసుకుని పూజ మొదలుపెట్టారు. "వాళ్ళకు కూడా నీ కరుణాకటాక్షాలు ప్రసాదించు సద్గురు సాయీ!" ఒకవేళ మనం అనుకున్న సమయానికి కోరుకున్నది జరగకపోయినా మనం బాబాను నిందించరాదు. ఆ సద్గురుని శరణు వేడి, నమ్మకం, ఓర్పుతో ఉన్నవారికి కాస్త ఆలస్యమైనా తప్పక మంచి జరుగుతుంది.
ఇంకా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎన్నెన్నో సాయిభక్తులతో పంచుకోవాలని ఆకాంక్షిస్తూ సద్గురు పాదములకు శరణు వేడుతున్నాను. "బాబా! నా జీవితానికి ఏమి అవసరమో నీకు తెలుసు తండ్రీ. ఎప్పుడైనా కంగారుపడి, సహనాన్ని కోల్పోయి కోపంలో నిన్ను ఏమన్నా అన్నప్పటికీ నన్ను క్షమించి ఎల్లవేళలా నాకు రక్షణగా ఉండు తండ్రీ". చివరిగా ప్రతి ఒక్క సాయిభక్తునికి నాదో విన్నపం: మీరు ఏదైనా ఆహారం స్వీకరించే ముందు కొంచెం బయట విడిచి రండి, లేదా సద్గురుని తలచుకుని స్వీకరించండి. అదే మనకు నిజమైన సద్గురు ప్రసాదం. మనం చేసే పని పదిమందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అదే నిజమైన సాయి సేవ.
రక్ష.. రక్ష.. లోకరక్షక శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః
రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం!
కరోనా నుండి కాపాడిన బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. మేము ముంబయిలో నివాసముంటున్నాము. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న రోజుల్లో నేను, "అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి" అని సాయినాథుని ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ మా బిడ్డలలో ఒకరికి కరోనా వచ్చింది. తన ద్వారా నాకు, మా మరో బిడ్డకి కూడా కరోనా సోకింది. ఒక బిడ్డకి ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతుండటంతో మేము తనను హాస్పిటల్లో చేర్పించాము. అయితే హాస్పిటల్ సిబ్బంది లంగ్స్ ఇన్ఫెక్షన్‌కి, న్యుమోనియా ఇన్ఫెక్షన్‌కి ఇంజక్షన్ వేయాలని చెప్పి, దాన్ని మమ్మల్నే తెమ్మన్నారు. కానీ మేము ఎంత ప్రయత్నించినా మాకు ఆ ఇంజక్షన్ దొరకలేదు. ఎక్కడ చూసినా స్టాక్ లేదన్నారు. ఏం చేయాలో తెలియక నాలుగు రోజుల పాటు నేను ఏడుస్తూ, "నా బిడ్డ బాగై ఇంటికి రావాలి బాబా" అని బాబాను ఆర్తిగా ప్రార్థిస్తూ గడిపాను. అక్కడ హాస్పిటల్లో బిజీ అంటూ నా బిడ్డని పట్టించుకోవడం లేదు. అటువంటి స్థితిలో బాబా మాకు ఒక దారి చూపారు. తెలిసినవాళ్ల సహాయంతో నా బిడ్డను వేరే హాస్పిటల్‌కి మార్చాము. ఇన్ఫెక్షన్‌కి 6 ఇంజెక్షన్లు వేయాలట. అది పూర్తయ్యేసరికి 15 రోజులు అయింది. ఆ సమయంలో నా బిడ్డకి ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతూ, తగ్గుతూ ఉండేవి. నా పరిస్థితి కూడా బాగోలేక నేను ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకుని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. తరువాత బాబా దయవల్ల నా బిడ్డకి ఇన్ఫెక్షన్ కొద్దిగానే ఉంది అంటే, బిడ్డని ఇంటికి తెచ్చుకుని ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టించాము. నెమ్మదిగా బాబా దయవల్ల అందరికీ నయమైంది. ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "బాబా! ఎల్లవేళలా ఇలాగే నాకు సహాయం చేస్తారనీ, భక్తులందరినీ తప్పక దయతో చూస్తారనీ ఆశిస్తున్నాను తండ్రీ. మీ యందే నమ్మకముంచాను బాబా, మమల్ని సదా కాపాడండి".
ఓం శ్రీ సాయినాథాయ నమః
Om Sai ram 🙏🏽🙏🏽🙏🏽👏❤️🙌🙏🏽🍁🌹
ReplyDeleteAll Sai Leela s are nice.if we trust baba he takes care.I am also Sai devotee.a member in maha parayan.I love you baba.Om Sai ram 🙏🏽🙏🏽🙏🏽👏🌹🙌❤️🍁
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sri Sai Ram ��������
ReplyDeleteSairam , దివ్యపూజతో నిశ్చయమైన వివాహం e experience chusi ,nenu sai temple ki vellanu,temple lo sai divya pooja book undi,nenu book tisukuntanu, Nijam ga edi sai miracle enduku ante nenu marriage kosam wait chestuna,nannu kuda sai divya pooja cheyamani chepinatu undi, sai pls bless me.
ReplyDeletejai sairam
ReplyDeletejai sairam
jai sairam
🌺🙏🙏🙏 OM Sri SaiRam🙏🙏🙏🙏🙏🙏🌺
ReplyDeleteOm sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tolginchu thandri
ReplyDeleteBaba santosh ki day shifts vachi salary hike kavali thandri
ReplyDelete