సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 804వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్నవారికోసం ఏదైనా చేస్తారు బాబా
2. నమ్ముకున్నవారికి ఎప్పుడూ అన్యాయం జరగదని నిరూపించిన బాబా
3. దయామయుడైన బాబా ఎంతో గొప్పగా అనుగ్రహించారు

నమ్ముకున్నవారికోసం ఏదైనా చేస్తారు బాబా


సాయిభక్తులందరికీ, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మా జీవితాలలో ఎన్నోసార్లు మాకు అండగా నిలిచిన బాబా గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇప్పుడు చెప్పబోయే అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. ఈ సంఘటన 2021, మేలో మావారు నాలుగు రోజులపాటు జలుబు, గొంతు ఇన్ఫెక్షన్‌తో ఇబ్బందిపడుతూ దానికి సంబంధించిన మందులు వాడారు. 9వ తేదీ నాటికి మావారు బాగా నీరసించిపోయారు. అసలే కోవిడ్ సమయం కదా, దాంతో బాగా టెన్షన్ ఫీలయ్యారు. నాకు బాబా మీద పూర్తి నమ్మకం, 'బాబా మాకెప్పుడూ రక్షగా ఉంటార'ని. ఆయన మీద భారం వేసి కోవిడ్ టెస్ట్‌కి ఇచ్చాము. నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! నువ్వే వచ్చి మమ్మల్ని కాపాడాలి. నువ్వు మాతోనే ఉన్నట్లయితే కోవిడ్ ఉండకూడదు. ఇది నా నమ్మకం బాబా" అని దృఢంగా అనుకున్నాను. ఇంకా, ఎంతోమంది సాయిభక్తులు పంచుకున్న అనుభవాలను చదువుతున్న నేను ‘నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాన’ని అనుకున్నాను.


దయామయులైన బాబా నా స్నేహితురాలి భర్త రూపంలో మాకు సహాయం చేయడానికి వచ్చారు. అతను మాకు అత్యంత ఆప్తుడు. పదేళ్ల క్రితం బాబాను ఫోటో రూపంలో మా ఇంటికి తీసుకొచ్చింది కూడా అతనే. అతను డాక్టరుని మా ఇంటికే తీసుకువచ్చారు. కోవిడ్ పరీక్ష రిపోర్టు కూడా నెగిటివ్ వచ్చింది. దాంతో డాక్టరు మా ఇంట్లోనే మావారి జలుబుకి చికిత్స ప్రారంభించారు. ఐదు రోజుల పాటు డాక్టరు మా ఇంటికి వచ్చి చికిత్స చేసేలా ఏర్పాటు చేసి మాకెంతో సహాయం చేసిన అతని మేలు మేమెన్నటికీ మరువలేము. అతనికి బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.


అయితే 2021, మే 11న హఠాత్తుగా మావారి ఆరోగ్యం విషమించింది. దాంతో మళ్లీ తనకు కోవిడ్ పరీక్ష చేయిస్తే, పాజిటివ్ వచ్చింది. తరువాత నాకు, మా బాబుకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కానీ నాకేమీ భయం అనిపించలేదు. ఎందుకంటే, మా క్షేమాన్ని బాబా చూసుకుంటారని నా నమ్మకం. మా ఎదురింట్లో ఉండేవాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆవిడ వెంటనే బాబా ఊదీ ప్యాకెట్లు ఇచ్చి, "రోజూ నీళ్ళలో ఊదీని కలుపుకొని త్రాగండి" అని చెప్పింది. బాబానే ఆవిడ ద్వారా ఊదీ ప్యాకెట్లు పంపించి ఆ విధంగా చెప్పించారనీ, ఇక అంతా బాబానే చూసుకుంటారని అనుకొని, రోజూ బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని అందరం త్రాగసాగాము. బాబా దయవలన నేను ఆశపడినట్లే డాక్టరుగారు మా ఇంటికే వచ్చి చికిత్స చేసేలా ఏర్పాటు జరిగింది. అయితే, మావారికి మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొంచెం ఇబ్బందిపడ్డారు. రోజూ ఉదయం, సాయంత్రం ఆయనకు ఇంజక్షన్స్ వేయాల్సి వచ్చింది. డాక్టరుగారు రోజూ తన అసిస్టెంటుని మా ఇంటికి పంపుతుండేవారు. నెమ్మదిగా అందరమూ కోలుకున్నాము. అన్నిరోజులూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా బాబా మమ్మల్ని చూసుకున్నారు. కర్మఫలం అనుభవించక తప్పదు కదా! కానీ పెద్ద ప్రమాదాన్ని చిన్నదానితో సరిపెట్టి బాబా మమ్మల్ని కాపాడారు. ఆ 15 రోజులూ సాయిబాబా ప్రతిక్షణం మాతోనే ఉన్నారని ఎన్నో నిదర్శనాలు చూపించారు. అన్నీ స్పష్టంగా చెప్పడం నాకు రావటం లేదు. ఇప్పుడు మావారు పూర్తిగా కోలుకున్నారు. ఇదంతా బాబాకు మాపై ఉన్న ప్రేమ. ఆయన మమ్మల్ని ఎన్నటికీ వదిలిపెట్టరు. నిజంగా బాబా తమను నమ్ముకున్నవారి శ్రేయస్సు కోసం ఏదైనా చేస్తారు. ఆయన మాకున్న ఒక పెద్ద సమస్యను కూడా దశలవారీగా పరిష్కరిస్తూ వచ్చారు. అది ఇప్పుడు చివరిదశలో ఉంది. తొందరలో దాన్ని కూడా బాబా తప్పకుండా పరిష్కరిస్తారని నా నమ్మకం. “చాలా చాలా ధన్యవాదాలు బాబా. మా జీవితం నువ్వే బాబా. మా సమస్యలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. వాటికి పరిష్కారం చూపి మాకు ఆనందాన్ని ప్రసాదించండి బాబా".


నమ్ముకున్నవారికి ఎప్పుడూ అన్యాయం జరగదని నిరూపించిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. ఇంతకుముందు నా అనుభవాలు కొన్నింటిని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. ఒకరోజు మా అమ్మ, నాన్న ఒక విషయం గురించి ఇంట్లో గొడవపడ్డారు. నాన్నకు కోపం వచ్చి కనిపించకుండా ఎటో వెళ్ళిపోయారు. దాంతో మేము చాలా కంగారుపడ్డాము. పైగా అది రాత్రి సమయమైనందున నాన్నను ఎక్కడని వెతకాలో మాకు అర్థం కాలేదు. తెలిసినవాళ్లను నిద్రలేపి నాన్నను వెతకడం ప్రారంభించాము. నాకైతే నాన్న ఏదైనా అఘాయిత్యం చేసుకుంటారేమో అని చాలా భయమేసి, "బాబా! నాన్నకు ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. నమ్ముకున్నవారికి ఎప్పుడూ అన్యాయం జరగదని బాబా మరోసారి నిరూపించారు. హఠాత్తుగా మేము వెతుకుతున్న చోటుకే నాన్న వచ్చారు. ఆయన్ని చూస్తూనే నాకు చాలా సంతోషం కలిగింది. నాన్న ఏ అఘాయత్యం చేసుకోకుండా బాబానే కాపాడి మాకు భద్రంగా అప్పగించారు. "శతకోటి ధన్యవాదాలు సాయితండ్రీ. ఇలానే నీ భక్తులందరినీ కాపాడుతావని ఆశిస్తున్నాను. థాంక్యూ సో మచ్ బాబా".


మరో అనుభవం:


ప్రస్తుత పరిస్థితుల వల్ల మనం చాలా భయాందోళనలకు గురవుతున్నాము. కానీ, బాబా ఉండగా మనకు భయమేల? బాబా అడుగడుగునా మనకు తోడుగా ఉంటారు. ఇకపోతే నా అనుభవం విషయానికి వస్తే.. ఈమధ్య ఒకసారి మా అమ్మమ్మ, నాన్న జలుబు, జ్వరం మరియు తలనొప్పితో బాధపడ్డారు. అసలే కరోనా టెన్షన్ ఒకటి. అందువల్ల నాకు చాలా భయం వేసింది. ఆ రాత్రంతా నేను, "బాబా! ఉదయానికల్లా అమ్మమ్మ, నాన్నలు కోలుకోవాల"ని బాబాను ప్రార్థించాను. 'వాళ్లకు నయమైతే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని కూడా బాబాకు మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు ఉదయానికల్లా వాళ్ళిద్దరికీ జ్వరం తగ్గింది. ఇదంతా బాబా దయవలనే సాధ్యం అయింది. "థాంక్యూ సో మచ్ బాబా".


దయామయుడైన బాబా ఎంతో గొప్పగా అనుగ్రహించారు


ఓం శ్రీ శిరిడీ సాయినాథా! అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


నా పేరు తిలోత్తమ. మేము ఒరిస్సాలో నివాసముంటున్నాము. ముందుగా సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను బ్లాగులో ప్రచురితమయ్యే సాయి భక్తుల అనుభవాలు ప్రతిరోజూ చదువుతూ ఎంతో ఆనందం పొందుతున్నాను. వాటిని చదివాక నా అనుభవాన్ని కూడా ఈ బ్లాగు ద్వారా తోటి భక్తలతో పంచుకోవాలని నాకనిపించింది. కోవిడ్ ఎక్కువగా ఉన్న ఈ సమయంలో హఠాత్తుగా ఒకరోజు మా అమ్మకి దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమ్మ బయటికి వెళ్లడానికి భయపడి ఇంట్లో ఉన్న మందులే వేసుకుంది. అత్తవారింట్లో ఉన్న నాకు అమ్మ ఆరోగ్య పరిస్థితి అలా ఉందని తెలిసినా, లాక్‌డౌన్ కారణంగా అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయాను. కానీ నాకు చాలా భయం వేసి, "అమ్మకి త్వరగా నయం కావాలి బాబా" అని మనసారా బాబాను వేడుకున్నాను. దయామయుడైన బాబా ఎంతో గొప్పగా అనుగ్రహించారు. మరుసటిరోజు ఉదయం నేను ఫోన్ చేస్తే, స్వయంగా అమ్మే నాతో మాట్లాడి, "నాకు జ్వరం, ఒళ్లునొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి" అని చెప్పింది. అది విని బాబా చల్లని చూపు మాపై ఉన్నందుకు ఎంతో ఆనందంగా బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. "బాబా! మా తమ్ముడి కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ప్రతిసారీ చివరివరకు వచ్చి ఏదో ఆటంకంతో ఉద్యోగం రాకుండా ఆగిపోతోంది. దానివల్ల తమ్ముడు బాగా డిప్రెషన్‌కి గురవుతున్నాడు. తనకు త్వరగా ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా. మీ కృపతో తనకు త్వరగా ఉద్యోగం వస్తే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఇంకా తమ్ముడి ఉద్యోగం కొరకు ఒకరికి డబ్బులిచ్చి మోసపోయాం బాబా. ఆ డబ్బులు మాకు వచ్చేలా అనుగ్రహించమని మమ్మిల్ని వేడుకుంటున్నాను. అది నెరవేరితే ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను. థాంక్యూ బాబా".


సర్వేజనాః సుఖినోభవంతు.




9 comments:

  1. 🌺🌺🙏🙏🙏🌺🌺🌺Om Sri SaiRam🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Kothakonda SrinivasJune 13, 2021 at 10:51 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om sai ram today's sai experiences are very good.neration is nice. Sai saved all his devotees in time. He is powerful God. Trust makes to believe him. Om sai ram❤❤❤

    ReplyDelete
  5. Om sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  6. Baba nenne namukuna thandri ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  7. Sai santosh ki day shifts ravali salary hike kavali thandri

    ReplyDelete
  8. Om sairam
    Sai always be with me

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo