- బాబా దయ
- వెంట ఉండి సదా కాపాడే బాబా
నాపై బాబా దయ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు కవిత మాధవ. మాది అనంతపురం. నాకు ఊహ తెలిసినప్పటినుంచి నేను బాబా భక్తురాలిని. బాధైనా, సంతోషమైనా ముందుగా నాకు బాబానే గుర్తొస్తారు. బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.
ముందుగా 2021, మే 12న జరిగిన అనుభవాన్ని పంచుకుంటాను. నాకు చాలా రోజుల నుంచి దగ్గు వస్తుండేది. తర్వాత కొద్దిగా నీరసం, ఆయాసం మొదలయ్యాయి. అప్పటి కరోనా పరిస్థితుల దృష్ట్యా నాకు చాలా భయం వేసి, బాబాను ప్రార్థించి కరోనా టెస్ట్‌కు వెళ్దామని అనుకున్నాను. నేను బాబాను ప్రార్థించాక, ఎందుకో తెలియదుగా సచ్చరిత్రలోని పదకొండవ అధ్యాయాన్ని మూడుసార్లు చదివాలనిపించి చదివాను. అదేరోజు ఉదయం కరోనా టెస్టుకు వెళ్ళానుగానీ, తిరిగి వెనక్కి రావలసి వచ్చింది. సాయంకాలం మళ్ళీ పారాయణ చేసి టెస్టుకి వెళ్లాను. బాబా దయవల్ల రిపోర్ట్ 'నెగిటివ్' అని వచ్చింది. అది తెలిసి చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఆ ఆనందంలో నాకు కన్నీళ్లొచ్చేశాయి. బాబా నాతోనే ఉండి నన్ను కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ అనుభవాన్ని అదేరోజే పంచుకుంటానని బాబాతో చెప్పుకుని, ఆలస్యం చేయకుండా నా అనుభవాన్ని బ్లాగుకి పంపించాను.
మరో అనుభవం:
ఒకసారి నాకు ఎండోస్కోపీ చేయాల్సి వచ్చింది. నేను చాలా భయపడి దాదాపు నెల రోజులు ఆలస్యం చేశాను. కానీ చివరికి తప్పనిసరై ధైర్యం చేసి బాబాకు నమస్కరించి, "బాబా! నా దగ్గరే ఉండు. నాతోనే ఉండు, నాకు చాలా భయంగా ఉంది. డాక్టర్ రూపంలో అయినా సరే మీరు నాతో ఉండండి బాబా" అని చెప్పుకున్నాను. తరువాత నేను, మావారు హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ అందరూ 'ఎండోస్కోపీ అంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది' అని చెప్పి నన్ను మరింత భయపెట్టారు. నా భయాన్ని చూసి మావారు కూడా భయపడిపోయారు. నేను బాబాను తలచుకుని భయంభయంగానే లోపలికి వెళ్ళాను. ఎండోస్కోపీ చాలా త్వరగా అయిపోవటంతో కొద్దిసేపట్లోనే బయటికి వచ్చాను. బాబా దయవల్ల కనీసం నా నోటిలో పైపు వేసినట్లు కూడా నాకు తెలియలేదు. నేను మామూలుగానే బయటికి వచ్చాను. నన్ను చూసి మావారు, "ఏమైంది? ఏమన్నారు? అయిపోయిందా?" అని అడిగారు. నేను, "అయిపోయింది" అన్నాను. ఆయన, "అవునా!" అని ఆశ్చర్యపోయారు. అంతేకాదు, రిపోర్టులో ‘సమస్య ఏమీ లేద’ని వచ్చింది. దాంతో డాక్టరుకు ఏ మందులు రాయాలో తెలియలేదు. కేవలం గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఇచ్చి పంపించారు. మనస్ఫూర్తిగా వేడుకుంటే బాబా నెరవేర్చనిదంటూ ఉండదు కదా! బాబా ఆశీస్సులతో నాకు ఏ ఆరోగ్య సమస్యా లేదు. అంతా బాగుంది. "ధన్యవాదాలు బాబా! ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మా కుటుంబంపై, మీ బిడ్డలందరిపై ఉండాలి".
వెంట ఉండి సదా కాపాడే బాబా
ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు లత. నేను బాబా బిడ్డని. నా సాయితండ్రి గత 30 సంవత్సరాలుగా నాకు తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవముగా ఎన్నోసార్లు నన్ను రక్షించారు, ఆపదలను గట్టెక్కించారు. నాకు తోడుగా, నీడగా ఉంటూ ఎప్పుడూ నా చేయి పట్టుకుని నడిపించారు, నడిపిస్తూనే ఉన్నారు. "బాబా! మీ రక్షణ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు సాయితండ్రీ!" ఇకపోతే, బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మొదటిసారిగా నేను ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. 2021, ఏప్రిల్ 19న నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఐదవరోజు జ్వరం 101 డిగ్రీల వరకు వెళ్లడంతో, "స్టెరాయిడ్స్ వాడదాము, అప్పటికీ తగ్గకపోతే రెమిడీసీవర్ ఇంజెక్షన్లు వేయాల్సి ఉంటుంద"ని డాక్టర్ చెప్పారు. దానితో నాకు చాలా భయం వేసి, "బాబా! నాకు టాబ్లెట్స్ ద్వారా జ్వరం తగ్గించు, ప్లీజ్ తండ్రీ" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల అప్పటినుండి జ్వరం తగ్గుముఖం పట్టింది. మళ్ళీ 2021, మే 13న టెస్ట్ చేయించుకుంటే, కోవిడ్ నెగిటివ్ వచ్చింది. అది తెలిసి నా మనసుకు చాలా సంతోషంగా, ప్రశాంతంగా, ఎంతో ఉపశమనంగా అనిపించింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాకు, నా కుటుంబానికి మీ రక్ష ఎల్లవేళలా ఉంటుందని నమ్ముతున్నాను. మీ బిడ్డగా మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందాలని కోరుకుంటున్నాను".
ఓం సాయిరాం!
ReplyDeleteOm Sri Sai Ram ��������
ReplyDeleteOm Sachidanandha Samardha Sadguru Sree Sainath Maharaj ki jai 🕉🙏😊❤
ReplyDeleteOM SAIRAM
ReplyDeleteOm sai ram very nice sai leelas are very nice to read and follow them.all devotees are saved by you. That is power of sai. Om sai ram❤❤❤
ReplyDelete🌺❤🙏OM SRI Sai Ram🙏🙏🌺❤
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteSai santosh ki day shifts ravali salary hike kavali thandri
ReplyDeleteOm sai ram, ma tirupati prayanam kshamam ga jariginanduku, ye ibbandi lekunda baga darshanam chesi velli vachinanduku chala chala thanks tandri, meeru adugu aduguna todu ayyi unnaru tandri naaku ardam avthune undi journey chese appudu daaniki chala thanks yella appudu thodu undandi, naaku ye stomach pain rakunda, food problem rakunda chesinanduku chala thanks tandri, amma nannalani kshamam ga arogyam ga undela chudandi tandri pls, na manasuki nachakunda yedi jaragakunda unde la chudandi tandri pls, ofce lo anta bagunde la chayandi tandri.
ReplyDelete