- వైద్యులలో ధన్వంతరి నా సాయితండ్రి
- కృపతో కరోనా నుండి కాపాడిన బాబా
వైద్యులలో ధన్వంతరి నా సాయితండ్రి
సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు బాబాకు నా క్షమాపణలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఇందిర. ఇంతకుముందు నా అనుభవాలను కొన్నిటిని ఈ బ్లాగ్ ద్వారా పంచుకున్నాను. దానికి సంబంధించినవే ఇప్పుడు పంచుకోబోయే అనుభవాలు కూడా.
మొదటి అనుభవం:
మావారు స్కూల్ టీచర్. ఒకసారి తనకు యాక్సిడెంట్ జరగటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ, బాబా దయవల్ల పూర్వపుస్థితికి వచ్చామని ఇంతకుముందు అనుభవంలో తెలిపాను. అలాంటిదే ఇప్పటి నా అనుభవం కూడా. మావారికి యాక్సిడెంట్ అయినప్పుడు తన కాలికి రాడ్స్ వేశారు. ఇటీవల ఒకరోజు తను బైక్‌పై స్కూలుకి వెళుతున్నప్పుడు రాళ్ళలో బైక్ స్కిడ్ అయి ప్రక్కకు పడిపోయారు. దురదృష్టం ఏమిటంటే ఆ సమయంలో బైక్ మీద ఈయన వెనుక మరొకరు కూడా ఉన్నారు. ఇద్దరూ బైక్ మీదనుంచి ప్రక్కకు పడిన సమయంలో ఆ వెనుకనున్నవారి తలలో ఒక రాయి దిగబడిపోయింది. మావారికి రాడ్ ఉన్న కాలి పాదంలో ఒక రాయి దిగబడిపోయింది. దాదాపు అంగుళం లోతు గాయమైంది. మోచేతులు కూడా కొట్టుకుపోయాయి. మావారు ఆ గాయాలతోనే ఎలాగో స్కూలుకి వెళ్ళి, ఆ వెనుకనున్నవారిని ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కి పంపించారు. మావారు టీచరుగా పనిచేస్తున్న ఊరిలోకి ఒక కాంపౌండర్ వస్తారు. మావారు అతనితో, “రెండు రోజుల్లో ఎలక్షన్ డ్యూటీ ఉంది. గాయం త్వరగా తగ్గిపోవాల”ని చెప్పారట. అతను మావారి కాలికి కట్టుకట్టి, ఇంజక్షన్ చేసి, టాబ్లెట్స్ ఇచ్చారు. సాయంత్రం ఇంటికి వచ్చిన మావారిని చూసి నాకు నోటమాట రాలేదు. అసలు ఆ రక్తపు బట్టల్లో ఆయనని చూసేసరికి నాకు వర్ణించలేని పరిస్థితి ఎదురైంది. ఈమధ్యనే తను ఒక యాక్సిడెంట్ నుంచి కోలుకున్నారు. మళ్ళీ యాక్సిడెంట్ అవడంతో నాకు చాలా భయమేసింది. మావారు చాలా మొండి. ఎంత బాధనైనా భరించగలరు. అలాంటి స్థితిలోనే తను 3 ఎలక్షన్ డ్యూటీలు చేసి వచ్చారు. తను డయాబెటిక్ అవటం వల్ల ఎక్కడ తనకు కాలు ఇన్ఫెక్ట్ అవుతుందోనని చాలా భయపడ్డాను. ఈ విషయం గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు. బాబాకు మాత్రమే నా పరిస్థితి చెప్పుకుని ఏడ్చేదాన్ని. మావారికి బాబా ఊదీ పెట్టుకుని బయటికి వెళ్ళే అలవాటు ఉంది. అలా చేయడం వల్లే పెద్ద ప్రమాదం జరగకుండా బాబా కాపాడారని అనుకుని, ప్రతిరోజూ తనకు ఊదీ పెట్టి, కాస్త ఊదీని నీటిలో కలిపి తనకు ఇచ్చి, కొద్దిగా ఊదీని తన కాలి గాయానికి రాసేదాన్ని. తను బైటికి వెళ్ళినప్పుడల్లా తిరిగి తను ఇంటికి వచ్చేదాకా బాబా నామస్మరణ చేసుకుంటూ ఎదురుచూసేదాన్ని. తన గురించి ఆలోచిస్తూ దిగులుతో సరిగా నిద్రపట్టేది కాదు. ఏమీ తినాలని అనిపించేది కాదు. గాయం పూర్తిగా మానడానికి దాదాపు నెలరోజుల పైనే పట్టింది. అది కూడా కేవలం సాయినాథుని దయవల్లే. నాకు ఏ కష్టం వచ్చినా మా అమ్మతో కూడా చెప్పను. బాబాకే చెప్పుకుని ధైర్యంగా ఉంటాను. ఎన్నో సందర్భాలలో నేను ఇబ్బందుల నుండి కేవలం బాబా దయవల్లే బయటపడ్డాను.
రెండవ అనుభవం:
ఇదిలా ఉన్న సందర్భంలోనే, హార్ట్ పేషంట్ అయిన మా నాన్నకు ఉన్నట్టుండి ఒళ్ళంతా అలెర్జీలా వచ్చి ఒకటే దురదలు రాసాగాయి. దురదలతో నాన్న ఎంతో ఇబ్బందిపడుతుంటే మా అమ్మ ఆయనను వెంటబెట్టుకుని ఆయుర్వేదం, హోమియో, అల్లోపతి.. ఇలా అన్ని రకాల డాక్టర్లను సంప్రదించింది. వారిచ్చిన మందులు వాడినప్పటికీ ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. దురదల వల్ల మా నాన్న రాత్రి, పగలు నిద్రపోయేవారుకాదు. నిద్రమాత్రలు వేసుకున్నా తనకు నిద్రపట్టేది కాదు. ఒకవేళ లివర్ ప్రాబ్లమ్ వల్ల ఈ అలెర్జీ వచ్చిందేనేమోనని నాన్నకు లివర్ టెస్ట్ చేయించారు. కానీ రిపోర్ట్ నార్మల్ అని వచ్చింది. మా అమ్మ కూడా షుగర్ పేషెంట్. నాన్నకున్న సమస్య వల్ల ఆయనను చూసుకునే క్రమంలో తనకు కూడా నిద్రలేక అమ్మ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అలాంటి పరిస్థితిలో నేను బాబానే నమ్ముకుని, “బాబా! నాన్నని, ఆయన ఆరోగ్యాన్ని నీ చేతిలో పెట్టాను. నీవే దారి చూపించి నాన్నకు అలెర్జీ తగ్గేలా చేయి తండ్రీ!” అని ప్రార్థించి, “నాన్నకు నయమైతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన”ని చెప్పుకున్నాను. మరుసటిరోజు అమ్మ ఫోన్ చేసి, “ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదు. అందువల్ల మీ నాన్నని విజయవాడలోని స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్తున్నాను” అని చెప్పింది. కోవిడ్ పరిస్థితుల్లో హాస్పిటల్‌కి వెళ్ళడమంటే భయం వేసింది. కానీ బాబాపై భారం వేసి బాబా నామం చేస్తూ ఉన్నాను. ‘దైవం మానుష రూపేణ’ అంటారు కదా! మా పిన్ని రూపంలో బాబా మా నాన్నని విజయవాడలోని ఒక స్కిన్ స్పెషలిస్టుకి చూపించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకున్న వారంరోజుల్లో బాబా దయవల్ల నాన్న పూర్తిగా కోలుకొని మామూలు పరిస్థితికి వచ్చారు.
నాకు పై రెండు పరిస్థితులూ ఒకే సమయంలో వచ్చాయి. ఒకవైపు నా భర్త పరిస్థితి, మరోవైపు నాన్న పరిస్థితి - తెల్లవారితే నాన్న గురించి ఏం వినాలో అని చాలా భయమేసేది. ఎవరి గురించి ఆలోచించాలో అర్థంకాక ఎంతో మనోవేదన అనుభవించాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను చేసింది ఒక్కటే, నిత్యం బాబా స్మరణ. వైద్యులలో ధన్వంతరి అయిన నా సాయితండ్రి ఎంతో కరుణతో ఇద్దరి పరిస్థితినీ బాగుచేశారు. ఎప్పుడూ కూడా బాబాపై నమ్మకాన్ని ఉంచి ధైర్యంగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా భరించే శక్తిని ఆయనే మనకు అందిస్తారని నా నమ్మకం.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
కృపతో కరోనా నుండి కాపాడిన బాబా
సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా అభినందనలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతూ ఉంటాను. నా పేరు శ్రీవాణి. 2021, మే మూడవవారంలో మా అమ్మాయి, అబ్బాయి జ్వరం, తలనొప్పి, జలుబు సమస్యలతో బాధపడ్డారు. ప్రస్తుతం ఈ లక్షణాలంటేనే మనకు భయంతో కాళ్ళుచేతులు ఆడట్లేదు. పైగా నాలుగు రోజులైనా పిల్లలకు తగ్గలేదు. కోవిడ్ టెస్టుకి వెళదామంటే నాకు చాలా భయం వేసింది. అయినా ధైర్యం చేసి, "బాబా! నాకు, మా పిల్లలకు కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చేలా అనుగ్రహించండి. నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను, సచ్చరిత్ర చదవడం కూడా ప్రారంభిస్తాను" అని బాబాను వేడుకుని 2021, మే 23న కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాము. మనసు నిండా సాయిని నిలుపుకుని, ఆయననే స్మరిస్తూ టెస్ట్ చేయించుకున్నాము. సాయిబాబా దయవలన అందరికీ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అది తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. "రేపు జరిగే మరో టెస్టులో కూడా మా అందరికీ నెగెటివ్ అని రిపోర్టు రావాల"ని సాయినాథునికి సాష్టాంగ నమస్కారం చేశాను.
కానీ దురదృష్టం కొద్దీ నాకు, నా కూతురికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేను చాలా ఆందోళనచెంది ఆరోగ్యప్రదాత అయిన నా సాయికి నమస్కరించుకుని, "మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడు సాయీ. నాకు తల్లి, తండ్రి, దైవం అన్నీ నీవే. నీ మీదే భారం వేస్తున్నాను. నన్ను, నా బిడ్డను కాపాడు తండ్రీ" అని దీనంగా వేడుకున్నాను. ఇన్ఫెక్షన్ నా ఊపిరితిత్తులకు చేరడంతో నాకు ఆయాసం, గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలయ్యాయి. అవి కాస్త ఎక్కువగా ఉండటంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎలాగో 15 రోజులు గడిచాక మరోసారి టెస్టుకు వెళ్ళాము. రిపోర్టు ఏవిధంగా ఉంటుందోనని భయంతో నాకు టెన్షన్ ఇంకా ఎక్కువైంది. సచ్చరిత్ర పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని, "బాబా! నీవే నాకు దిక్కు. నాకు, నా కూతురికి నెగిటివ్ రావాలి. ఇంకా ఈ ఆయాసం, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కూడా కాపాడు స్వామీ" అని వేడుకున్నాను. సాయి నాపై కరుణ చూపారు. కోవిడ్ టెస్ట్ రిపోర్టులో నాకు, నా కూతురుకి నెగిటివ్ వచ్చింది. సంతోషంగా బాబాకు నమస్కారాలు చెప్పుకొని, "ఆయాసం, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కూడా కాపాడు సాయీ. ఆయాసం పూర్తిగా తగ్గితే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను సాయీ" అని మ్రొక్కుకున్నాను. బాబా అపారమైన కృపవలన మరుసటిరోజు ఉదయం నుండి నాకు ఆయాసం, గ్యాస్ట్రిక్ సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. నా సాయీ, మీకు నా పాదాభివందనాలు. నన్ను, నా కుటుంబాన్ని సదా నీవే కాపాడు సాయీ".
ఓం శ్రీ సాయినాథాయ నమః
Om Sri Sai Ram ��������
ReplyDeleteOm Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏😊❤
ReplyDeleteOm sai ram❤❤❤
ReplyDeleteOm sai ram sai leelas are very nice. Baba shows his power to all devotees. Om sai ram is powerful mantras.to all devotees❤❤❤
ReplyDeleteఓంకార రూపం సా౦ుునాదునిది.మమ్ము ఆశీర్వాదము చేసిన మాకు చాలా సంతోషము కలుగునని నీకు తెలియును గనుక. ఓం సా౦ుు తండ్రి నీకు కృతజ్ఞతలు.
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
777 days
ReplyDeletesairam
నీకు నమస్కారం సాయి తండ్రి. నీ చల్లని చూపు మా పైన కురిపించు.సాయి మా కుటుంబంని కాపాడు.ఇది నా కోరిక తండ్రి
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteBaba santosh health bagundali thandri
ReplyDeleteBaba santosh Carrier bagundali thandri
ReplyDeleteSai thandri karthik ki thyroid normal ravali thandri
ReplyDeleteBaba ma rendu kutubalanu challaga chudu thandri
ReplyDelete🌺🌸🌷🙏🙏🙏OmSriSaiRam🌷🌸🌺
ReplyDelete