1. కోవిడ్ టెన్షన్ నుండి బయటపడేసిన బాబా
2. నాన్నకి ఇబ్బంది లేకుండా అనుగ్రహించిన బాబా
3. నేను కోరుకున్నట్లే అనుగ్రహించిన బాబా
4. దయతో జ్వరం తగ్గించిన బాబా
కోవిడ్ టెన్షన్ నుండి బయటపడేసిన బాబా
సాయిబంధువులకు నా శతకోటి నమస్కారాలు. ఆ సాయినాథుని సన్నిధిలో నేను కూడా ఒక చిన్న భక్తురాలిని. ఆ సాయినాథుడు మా జీవితాలలో ఎటువంటి లోటూ లేకుండా మా అందరినీ కంటిపాపలా కాపాడుతున్నారు. నేనిప్పుడు నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను. గత నెలంతా నేను మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందిపడ్డాను. కారణం, మొదట నా తల్లిదండ్రులకి కరోనా పాజిటివ్ వచ్చింది. నేను ఎంతో టెన్షన్ పడ్డాను. కానీ, బాబా అండగా ఉండి ఆ విషమ పరిస్థితి నుండి వారిద్దరినీ కాపాడారు. తర్వాత నా సోదరి భర్తకు పాజిటివ్ వచ్చింది. బాబా ఆశీస్సులతో అతను కూడా కోలుకున్నాడు. హమ్మయ్య అనుకునేలోపు నాకు కూడా కోవిడ్ లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేయించుకుంటే, మైల్డ్ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. నేను పూర్తి విశ్వాసంతో బాబానే ప్రార్థించాను. తరువాత 2021, మే 15న నేను ఆర్.టి.పి.సి.ఆర్ టెస్ట్ చేయించుకుంటే, బాబా ఆశీస్సులతో నెగిటివ్ అని వచ్చింది. మానసికంగా చాలా ఆందోళనకు గురైన ఆ నెలరోజులూ నేను పూర్తిగా బాబానే నమ్ముకున్నాను. మనం బాబాపై విశ్వాసముంచితే, ఖచ్చితంగా ఆయన మనల్ని కాపాడుతారు. కేవలం బాబా దయవల్ల ఇప్పుడు మా కుటుంబమంతా ఆరోగ్యంగా ఉన్నాము. "బాబా! ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలి? ఏమో బాబా, నాకేం తెలియదు. కానీ ఎప్పుడూ ఇలానే మీ భక్తులందరినీ రక్షించండి".
నాన్నకి ఇబ్బంది లేకుండా అనుగ్రహించిన బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!
నా పేరు మాధురి. ముందుగా సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను పంచుకుంటున్న రెండవ అనుభవమిది. మా నాన్నగారి వయస్సు 84 సంవత్సరాలు. ఆయన మా అక్కావాళ్ళింట్లో ఉంటారు. 2021, ఏప్రిల్ నెలలో ఒకరోజు ఆయన, "నాకు సరిగా ఊపిరి ఆడటం లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది" అని చెప్పారు. ఆ విషయం తెలిసి నాకు చాలా భయంగా అనిపించి, టెన్షన్ వచ్చేసింది. అసలే కరోనా సమయం. హాస్పిటల్‌కి వెళ్లే రోజులు కావు. అప్పుడు నేను సాయిబాబాను ప్రార్థించి, "ఈ సమస్య నుంచి నాన్నను రక్షిస్తే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయ చూపారు. తరువాత అక్కావాళ్ళు పల్స్ ఆక్సీమీటర్‌లో నాన్న పల్స్ చూసి 98 ఉందన్నారు. అది విన్నాక నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. మరునాడు నాన్న, "ఇప్పుడు ఏ సమస్యా లేదు, అంతా బాగుంది" అని చెప్పారు. బాబా దయవలన నాన్న ఇప్పుడు నార్మల్‌గా ఉన్నారు. "సాయిబాబా! చాలా చాలా ధన్యవాదాలు. మేము ఎలా ఉన్నా మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని మీ ప్రేమ, దయ, కరుణ మాపై కురిపిస్తూనే ఉంటారు. మీ బిడ్డలమైన మా అందరిపై మీ అనుగ్రహం ఇలాగే ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను బాబా. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి".
నేను కోరుకున్నట్లే అనుగ్రహించిన బాబా
సాయిబంధువులకు నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2021, మే 11న మా అన్నయ్యకి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదం వలన తన కుడికాలికి, కనుబొమ్మలకి గాయాలయ్యాయి. హాస్పిటల్‌కి వెళితే, డాక్టర్ మా అన్నయ్య కనుబొమ్మలకి నాలుగు కుట్లు వేసి, "కుడికాలి మూడు వేళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. రాడ్ వేయాలి" అని చెప్పారు. దాంతో నేను ఆందోళనచెంది, "బాబా! అన్నయ్యకి రాడ్ వేయకుండా కేవలం కట్టుతోనే నయమయ్యేలా చూడండి" అని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. అలా ప్రార్థించగానే, బాబా దయవలన వేరే హాస్పిటల్‌కి వెళ్లాలన్న ఆలోచన వచ్చి, మరుసటిరోజు వేరే హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడి డాక్టర్ మా అన్నయ్యను పరీక్షించి, "పట్టీతో నయమవుతుంది" అని చెప్పి తన కాలికి పట్టీ వేశారు. "ధన్యవాదాలు బాబా! మొదటిసారి నా అనుభవాన్ని పంచుకున్నాను. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి బాబా".
దయతో జ్వరం తగ్గించిన బాబా
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు స్వరూపారాణి. మేము నెల్లూరు వాస్తవ్యులం. నేను బాబా భక్తురాలిని. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుండి ఇటీవల జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటున్నాను. 2021, మే 13న ముంబయిలో ఉండే మా పెద్దమ్మాయి ఫోన్ చేసి, మా మనవడికి జ్వరంగా ఉందని చెప్పింది. ‘చిన్నపిల్లవాడు జ్వరంతో ఎంత అవస్థపడుతున్నాడో’ అని నాకు కంగారుగా అనిపించి, "బాబుకి త్వరగా నయం చేయమ"ని బాబాను వేడుకుని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించడం మొదలుపెట్టాను. మా అమ్మాయిని కూడా అలా చేయమని చెప్పాను. ఆ రాత్రంతా బాబాను వేడుకుంటూ, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపిస్తూ గడిపాను. బాబా దయ చూపారు. మరుసటిరోజు ఉదయం మా అమ్మాయి ఫోన్ చేసి, "బాబు శరీర ఉష్ణోగ్రత నార్మల్‌కి వచ్చి, జ్వరం తగ్గింద"ని చెప్పింది. ఆ మాటతో నా మనసుకి చాలా సంతోషం కలిగి, బాబాకు మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను.
Om sai ram please bless us.today is your day.with your blessings your devotees are cured.that is your power. Om sai ram❤❤❤
ReplyDeleteOm sai ram❤❤❤
ReplyDeleteOm Sri Sai Ram ��������
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm sai ram baba amma problem tondarga cure cheyi thandri
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri
ReplyDeleteBaba santosh ki day shifts vachi salary hike ravali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete