సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 811వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దర్శనంతో ధైర్యాన్నిచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా
2. గొడవ మాన్పించిన బాబా
3. వ్యాక్సినేషన్ అనంతరం చాలా జాగ్రత్తగా చూసుకున్న బాబా

దర్శనంతో ధైర్యాన్నిచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు సంధ్య. ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరియు సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. సాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ బాబా ప్రేమను పంచుకోబోతున్నాను. 


2021, ఏప్రిల్ నెలలో ఉగాది పండుగకు వారంరోజుల ముందు నాకు శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేయాలని బలంగా అనిపించింది. బాబా దయతో ఒక గురువారంనాడు సచ్చరిత్ర పారాయణ ప్రారంభించి మరుసటి గురువారం వరకు చక్కగా పారాయణ చేశాను. ఆ సంతోషంలో నేను మా నాన్నకు ఫోన్ చేసి, “సచ్చరిత్ర పారాయణ చేశాను నాన్నా” అని సంతోషంగా చెప్పాను. నాన్న సరేనన్నారు. కాసేపాగి, “అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి డాక్టరుకు చూపించాము. అమ్మకు కొన్ని టెస్టులు చేయించమన్నారు” అని చెప్పారు. అసలే కరోనా పరిస్థితులు. టెస్టులంటే చాలా భయమేసి, ‘అమ్మకు ఆరోగ్యం ప్రసాదించమ’ని బాబాను ప్రార్థించాను. అమ్మను చూసుకోవడానికి నాన్న, అక్క, బావ, చెల్లి అందరూ ఉన్నారు. కానీ కరోనా పరిస్థితుల వల్ల రిపోర్టు ఎలా వస్తుందోనని భయపడుతూ, ‘అమ్మకు కరోనా నెగెటివ్ అని రావాలి బాబా’ అని బాబాను ప్రార్థించసాగాను. అయితే, అమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. అమ్మకు పాజిటివ్ రావటంతో అమ్మతో సన్నిహితంగా ఉన్న మావాళ్ళందరూ టెస్ట్ చేయించుకున్నారు. బాబా దయవలన అందరికీ నెగిటివ్ వచ్చిందిగానీ, చెల్లికి మాత్రం పాజిటివ్ వచ్చింది. అమ్మను హాస్పిటల్లో చేర్చారు. చెల్లి మాత్రం ఇంట్లోనే ఉండి ట్రీట్‌మెంట్ తీసుకోసాగింది. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! అమ్మ త్వరగా కోలుకునేలా అనుగ్రహించండి. అమ్మకు, చెల్లికి కరోనా నెగిటివ్ రావాలి బాబా. కరోనా నెగిటివ్ రిపోర్టుతో అమ్మను ఆరోగ్యంగా ఇంటికి తీసుకురా బాబా” అని మనసారా బాబాను ప్రార్థించాను. వాళ్ళిద్దరూ త్వరగా కోలుకోవాలని ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే నామాన్ని స్మరించసాగాను. 


ఆ తరువాత, అమ్మ ఆరోగ్యం గురించి, చెల్లి ఆరోగ్యం గురించి, వాళ్ళకు సేవచేస్తున్నవారి గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ సాయిబాబాను ప్రార్థిస్తూ ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ ఓపెన్ చేశాను. అందులోని బాబా సందేశాన్ని చూసి నా మనసుకు ఎంతో ఊరట కలిగింది. ఆ సందేశం: “నాకు భగవంతుడు కొన్ని జీవులను అప్పజెప్పాడు. వాళ్ళ మంచిచెడ్డలు, వాళ్ళ తరింపు నా బాధ్యత”. ఆ సందేశాన్ని చూసి ‘ఆ మాటలు బాబా నాకే చెప్తున్నారు’ అనే భావన కలిగింది. బాబా సందేశంతో నాకు ధైర్యం చేకూరింది. తరువాత నేను, “బాబా, అమ్మకు మీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించి ధైర్యాన్ని ఇవ్వండి” అని బాబాను ప్రార్థించాను. అమ్మ హాస్పిటల్లో ఉండగా ఒకరోజు బాబా అమ్మకు దత్తాత్రేయునిగా దర్శనమిచ్చారు. ఆ దర్శనంతో అమ్మకు తాను త్వరగా కోలుకుంటాననే ధైర్యం వచ్చింది. ఆ తరువాత బాబా దయవలన అమ్మ, చెల్లి కేవలం మూడు రోజులలో కరోనా నుండి రక్షింపబడ్డారు.


“దత్తాత్రేయుని దర్శనభాగ్యం కలిగించి అమ్మకు ధైర్యాన్ని ప్రసాదించి త్వరగా కోలుకునేలా చేసిన మీ అపారప్రేమకు వేవేల కృతజ్ఞతలు సాయితండ్రీ! మీ దయతో అమ్మ, చెల్లి త్వరగా కోలుకున్నారు”. ఈ సంతోషకరమైన విషయాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “కాస్త ఆలస్యమైంది బాబా, నన్ను క్షమించండి”. బాబా నాతో ముందుగానే సచ్చరిత్ర పారాయణ చేయించి పెద్ద ఉపద్రవం నుండి కాపాడారు. బాబా అంటారు కదా, “నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు” అని. సచ్చరిత్ర పారాయణ చేయాలనే సంకల్పం బాబా ఆశీర్వాదమే!


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

సద్గురు చరణం - భవభయహరణం


గొడవ మాన్పించిన బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు శ్రేయ. నేనొక చిన్న సాయిభక్తురాలిని. సాయి దయవలన మేము ఒక ఇల్లు కట్టుకుంటున్నాము. అయితే ఇంటిపని మొదలుపెట్టినప్పటినుండి మాకు మేస్త్రీ దొరకడం సమస్య అయింది. మొదట ఇద్దరు మేస్త్రీలు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. అప్పుడు మావారు మా ఇంటిముందున్న మరో మేస్త్రీకి పని ఇచ్చారు. అతను పని మొదలుపెట్టినప్పటినుండి డబ్బులు ఎక్కువగా తీసుకుని పనివాళ్ళని పెట్టేవాడు కాదు. పైగా మళ్లీ మళ్లీ డబ్బులు కావాలని సతాయిస్తుండేవాడు. దాంతో మేము అతనిని పనినుండి తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే మొదటి నుండి డబ్బులు ఎక్కువ తీసుకోవడం వలన అతని వద్ద మా డబ్బులు ఉండిపోయాయి. అయినప్పటికీ, డబ్బులు పోతేపోనీ అనుకుని మరో మేస్త్రీని పెట్టి పని మొదలుపెట్టించాము. ఆ పాత మేస్త్రీ ఊరుకోక 'నాకు ఇంకా డబ్బులు రావాలి' అంటూ రెండు రోజుల పాటు మాతో గొడవపడి, పని జరగనివ్వనని బెదిరించాడు. అప్పుడు నేను సాయిని నమ్ముకుని, "ఏ గొడవా లేకుండా పని సవ్యంగా జరిగినట్లయితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అంతే, బాబా దయవలన అతను గొడవ మానుకున్నాడు. ఇప్పుడు పని సాఫీగా సాగుతోంది. సాయి దయ, అనుగ్రహం వలన ఏ గొడవలూ లేకుండా మా ఇల్లు పూర్తికావాలని ఆశిస్తున్నాను. "సాయీ! మీకు శతకోటి వందనాలు. భారమంతా మీ మీదే వేస్తున్నాను తండ్రీ. ఇంటి నిర్మాణాన్ని మీరే సాఫీగా పూర్తిచేయించాలి".


వ్యాక్సినేషన్ అనంతరం చాలా జాగ్రత్తగా చూసుకున్న బాబా

 

సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. మేము యు.ఎస్.ఏ.లో నివాసముంటున్నాము. వ్యాక్సినేషన్ విషయంలో బాబా మాకు కల్పించిన రక్షణ గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ప్రస్తుతం కరోనా నుండి రక్షణ కోసం ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని అందరికీ తెలిసిందే. నేను, నా భర్త ఒకేరోజు వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నాం. అయితే వ్యాక్సినేషన్ విషయంలో సానుకూలంగానూ, ప్రతికూలంగానూ ఎన్నో వింటున్నందువల్లా, ఇంకా వ్యాక్సినేషన్ తీసుకున్న తరువాత చేదు అనుభవాలను చవిచూసిన నా స్నేహితులందరినీ చూసినందువల్లా వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా టెన్షన్ పడ్డాను. అదే మనసులో పెట్టుకుని, ‘ఏదైనా జరిగితే చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలి?’ అని ఆలోచిస్తూ భయపడ్డాను. కానీ మరుక్షణమే, 'బాబా నాతో, నా చుట్టూ ఉండగా నేనెందుకు భయపడాలి?' అని నా అంతట నేనే ఆ టెన్షన్ నుండి ఉపశమనం పొందాను. తరువాత మేము వ్యాక్సినేషన్‌కి వెళ్లేముందు మా రక్షణ కోసం ముందు జాగ్రత్తగా బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని ఇద్దరం త్రాగాము. వ్యాక్సిన్ వేయించుకుని వచ్చిన తరువాత నా చేతికి, నా భర్త చేతికి ఊదీ రాశాను. మీరు నమ్ముతారో, లేదో, కనీసం నా స్నేహితులందరూ అనుభవించిన చేతినొప్పి కూడా మాకు రాలేదు. అంతలా బాబా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు నేను చాలా సంతోషించాను. ఆ తరువాత మేము రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సినరోజు గురువారం అయింది. అది బాబా రోజు కావడంతో నేను మరింత బాబా రక్షణను అనుభూతి చెంది ఇక ఏ మాత్రమూ టెన్షన్ పడలేదు. చాలా ధీమాగా వెళ్లి వ్యాక్సినేషన్ చేయించుకున్నాను. అయితే, రెండవ డోస్ వల్ల కొన్నయినా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయేమోనని అనుకున్నాము. అనుకున్నట్లే నాకు చాలా కొద్దిపాటి ఒంటినొప్పులు కనిపించాయి. అది కూడా కేవలం ఒక్కరోజు. బాబా దయవల్ల అంతకుమించి పెద్ద సమస్యలేవీ లేవు. బాబాపై విశ్వాసముంచితే, ఆయన మన విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. "బాబా! మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా".



10 comments:

  1. Om sai ram baba we also took vaccine we are o. K.sai please bless all from devil corona. You are only our hope❤❤❤❤��

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Kothakonda SrinivasJune 20, 2021 at 9:52 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om sai ram baba amma problem tondarga cure avali thandri pleaseeee

    ReplyDelete
  5. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  6. Baba santosh ki leg pain tagginchu thandri enka day shifts ravali thandri

    ReplyDelete
  7. ఓమ్ సాయిరాం
    మీతో పంచుకుంటున్నాను.మా కుటుంబంనకి బాబా అనుదినము సహాయం చేస్తున్నారు.ఇటీవల మా తల్లి గారి భూమి online విషయం లో చాలా కాలం అవ్వలేదు.e బుధ వారం రోజు బాబా గారి asislu తో రెవెన్యూ వారు పిలిచి మరి చేశారు. ధన్య వాదములు బాబా గారు.

    ReplyDelete
  8. 🌺🌼🙏🙏🙏Om Sri Sai Ram🙏🙏🙏🙏🙏🙏🌺🌼

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo