సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 800వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. నేను పొందిన బాబా లీలలు 
  2. బాబా దయవల్ల రక్షింపబడ్డ అమ్మ
  3. బాబాపై భారం వేస్తే, ప్రతిక్షణమూ ఆయనే చూసుకుంటారు

నేను పొందిన బాబా లీలలు 


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ముందుగా బాబాకు నా శతకోటి పాదాభివందనాలు. సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు మల్లారెడ్డి. ఐదు సంవత్సరాల క్రితం నేను, నా కుటుంబసభ్యులందరం కలిసి శిరిడీ వెళ్ళి ప్రశాంతంగా బాబా దర్శనం చేసుకున్నాము. శిరిడీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు బాబా ఫోటో ఒకటి తీసుకొని వచ్చాము. ఆ సంవత్సరం రంజాన్ పండుగరోజున దిగంబరుడైన ఒక సాధువు మా ఇంటికి వచ్చారు. నేను శిరిడీ నుంచి తెచ్చిన బాబా ఫోటోను చూసి ఆ సాధువు, “బాబా అచ్ఛా కరేగా!” అని చెప్పారు. ఆ తరువాత ఆ సాధువు నన్ను దక్షిణ అడిగారు. నేను వారికి 20 రూపాయలు ఇచ్చాను. ఆ తరువాత ఆ సాధువు మళ్ళీ 50 రూపాయలు ఇమ్మని అడిగారు. నేను మరో 50 రూపాయలు ఇచ్చాను. ఆ సాధువు ఆ 50 రూపాయల నోటును తన పిడికిలిలో ఉంచుకుని దానిని విభూదిగా మార్చి నా చేతుల్లో పెట్టారు. తరువాత వంద రూపాయలు ఇమ్మని అడిగారు. నేను వంద రూపాయలు ఇచ్చాను. ఆ సాధువు ఆ నోటును గులాబీపువ్వుగా మార్చి ఆ పువ్వును నాకు ఇచ్చి, “దీనిని నీ గల్లాపెట్టెలో (డబ్బులు పెట్టుకునే పెట్టె) పెట్టుకో” అన్నారు. నేను ఆ పువ్వును మా గల్లాపెట్టెలో పెట్టుకున్నాను. తరువాత ఆ సాధువు భోజనానికి డబ్బులిమ్మని అడిగారు. కానీ నేను కొంత భయపడి ఆ సాధువుకు ఇంక డబ్బులు ఇవ్వలేదు. ఆ సాధువు ఏమనుకున్నారో తెలియదుగానీ, వెంటనే అక్కడనుంచి వెళ్ళిపోయారు. ఆశ్చర్యంగా, కొన్నిరోజుల తరువాత ఆ పువ్వు ఎంత వెతికినా కనిపించలేదు. అప్పుడు నాకు అనిపించింది, ‘ఆ సాధువు మరెవరో కాదు, బాబానే’ అని. కానీ ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రం బాబానే ఆ రూపంలో వచ్చారని నేను తెలుసుకోలేకపోయాను. బాబా ఇలాంటి మహిమలు మనకు ఎన్నో చూపిస్తారు, కానీ మనము ఆ దైవాన్ని కనుక్కోలేకపోతున్నాము.              


రెండవ అనుభవం:


2021, మే 1వ తేదీనాడు నాకు కిడ్నీలో విపరీతమైన నొప్పి వచ్చింది. ఇంతకుముందు కూడా నాకు ఇలాగే జరిగినప్పుడు ‘బాబా ఊదీని నీళ్లల్లో వేసుకొని త్రాగిన పదినిమిషాలకే నొప్పి తగ్గిపోయింద’ని ఇంతకుముందు మీతో పంచుకున్నాను కదా. అలాగే, ఇప్పుడు కూడా బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగాను. బాబా అనుగ్రహంతో పది నిమిషాల్లోనే నొప్పి తగ్గిపోయింది. ఆ మరుసటిరోజు నాకు విపరీతమైన పంటినొప్పి వచ్చింది. అప్పుడు కూడా బాబా ఊదీని నుదుటన ధరించి, కొద్దిగా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగాను. బాబా దయవల్ల నా పంటినొప్పి తగ్గిపోయింది. ఇంకో విషయం ఏమంటే, ప్రతిసారీ నేను బయటికి వెళ్ళేటప్పుడు బాబా ఊదీని నుదుటన పెట్టుకొని, కాస్త ఊదీని నోట్లో వేసుకొని బయటికి వెళ్తాను.                  


మూడవ అనుభవం:


2021, మే 8వ తేదీనాడు మా అమ్మకు జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. కరోనా సమయంలో అమ్మకు ఇలా అవటంతో నేను చాలా భయపడి బాబాకు నమస్కరించుకుని, ‘అమ్మకు త్వరగా జ్వరం, జలుబు, దగ్గు తగ్గించమ’ని ప్రార్థించాను. తరువాత బాబా ఊదీని అమ్మ నుదుటికి పెట్టి, కొద్దిగా ఊదీని నీళ్ళలో కలిపి అమ్మకి త్రాగించి తనను పడుకోమన్నాను. మరుసటి ఉదయానికల్లా బాబా దయవల్ల అమ్మకు జలుబు, దగ్గు, జ్వరం తగ్గిపోయాయి. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


“మీ పాదాలకు శతకోటి ప్రణామాలు బాబా. మీ భక్తుని ఎల్లప్పుడూ ఇలాగే కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. బాబా! మా అబ్బాయికి కంటిచూపు లేదు. తనకు కంటిచూపు ప్రసాదించమని ఎప్పటినుంచో మిమ్మల్ని కోరుకుంటున్నాను బాబా. నా కర్మఫలం ఎలా ఉందోగానీ, మా అబ్బాయి గురించి మిమ్మల్ని ఎప్పుడు అడిగినా “తప్పకుండా కంటిచూపు వస్తుంది” అని మీరు సమాధానమిస్తున్నారు. మీ అనుగ్రహం కోసం నేను ఓపికగా ఎదురుచూస్తున్నాను బాబా. మీరు కరుణించి నా పైన దయచూపి నా ఈ కోరికను త్వరగా తీర్చాలని వేడుకుంటున్నాను బాబా".


బాబా దయవల్ల రక్షింపబడ్డ అమ్మ


ఓం శ్రీ సాయినాథాయ నమః


నా పరాత్పర గురువు అయినటువంటి శ్రీ సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ, సాయినాథుడు చూపిన మహాత్మ్యాన్ని వివరిస్తున్నాను. నా పేరు కృష్ణ. 2021, మే 10 సాయంత్రం మా అమ్మ నాకు ఫోన్ చేసి, "నాకు కాస్త నీరసంగా ఉంది" అని చెప్పారు. వెంటనే నేను ఇంటికి వచ్చి అమ్మకు మందులిచ్చాను. తరువాత బాబా ఊదీ ఇచ్చి తన ప్రక్కనే కూర్చున్నాను. మధ్యలో అమ్మకు కొద్దిగా ఆహారం అందించి, ఉండుండి బాబా ఊదీ పెడుతూ ఆవిడతో గడిపాను. రాత్రి నిద్రపోయి ఉదయం నిద్రలేస్తూనే అమ్మ తనకు కాస్త నార్మల్‌గా ఉందని చెప్పి, టీ పెడతానని వంటింట్లోకి వెళ్లారు. గ్యాస్ స్టవ్ మీద టీ పెట్టాక ఆవిడ కళ్ళుతిరిగి పడిపోయారు. కేవలం బాబా దయవల్ల అమ్మకు ఎటువంటి గాయమూ కాలేదు. ఏ మాత్రం కొద్దిగా ముందుకు పడినా ఆవిడ గ్యాస్ స్టవ్ మీద పడేవారు, లేదా వేడి టీ తన మీద పడేది, ఏదోరకమైనటువంటి ప్రమాదం జరిగి ఉండేది. కానీ ఆవిడ చాలా జాగ్రత్తగా ఒక ప్రక్కకి ఒరిగినట్లు పడిపోయారు. కేవలం బాబా దయవల్లే అమ్మ రక్షింపబడ్డారు. వెంటనే నేను వెళ్లి, కొద్దిగా ఉపచర్య చేసి, మందు వేయగానే ఆవిడ కోలుకున్నారు. ఒక గంటకల్లా చాలావరకు కోలుకుని మధ్యాహ్నానికి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఎటువంటి ప్రమాదమూ జరగకుండా చాలా జాగ్రత్తగా మా సాయినాథుడు అమ్మను కాపాడారు. కొద్దిపాటితో మొత్తం కర్మను తొలగించారు. ఇలాగే మా ఇంటిలోనివారందరినీ ఆ సాయినాథుడు ఎల్లవేళలా వెన్నంటి కాపాడుతున్నారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. మాకు ఆ సాయినాథుడే రక్ష.


అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ.


బాబాపై భారం వేస్తే, ప్రతిక్షణమూ ఆయనే చూసుకుంటారు


బాబా భక్తులకు నా వందనాలు. నా పేరు లక్ష్మి. 2021, ఏప్రిల్ నెలలో మేము హైదరాబాద్ వెళ్ళొచ్చాము. రెండు రోజుల తర్వాత నాకు చలిజ్వరం మొదలయింది. కరోనా ఎక్కువగా ఉన్న సమయంలో జ్వరం వచ్చేసరికి నాకు చాలా భయం వేసింది. మరో రెండు రోజులు గడిచేసరికి వాసన కూడా తెలియలేదు. దాంతో నా భయం రెట్టింపై, "నన్ను ఈ ఆపద నుంచి కాపాడండి బాబా" అని బాబాను వేడుకున్నాను. సర్వకాల సర్వావస్థలందు మన బాధ్యతలను మోసే బాబా నేను ఏ పరీక్షా చేయించుకోకుండానే నాకు నయం చేశారు. "ప్రతిక్షణమూ నా భారాన్ని మోసే సాయితండ్రికి శతకోటి వందనాలు. మమ్మల్ని ప్రతీక్షణం ఇలాగే కాపాడు తండ్రీ. ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను మన్నించు తండ్రీ. ఈ కరోనా నుంచి అందర్నీ కాపాడండి. మీ పాదాలపై శిరస్సు ఉంచి శరణు వేడుతున్నాను".


11 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Om sai ram very nice leelas of sai baba.sai is saving every devotees always.it is our luck.please bless my family sai. My tandri I love you baba. ��❤❤❤❤

    ReplyDelete
  3. Kothakonda SrinivasJune 9, 2021 at 10:01 AM

    ఓం సాయిరాం! ‌సాయి లీలలు అద్భుతము.

    ReplyDelete
  4. 🌺 OM Sri Sairam, 🙏🙏🙏🌺

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  6. Baba ee gadda ni karginchu thandri sainatha

    ReplyDelete
  7. Sai santosh ki day shifts vachi salary hike kavali thandri

    ReplyDelete
  8. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  9. Om Sree Sachidhanandha Samardha Sadguru Sree sai Nadhaya Namaha 🕉🙏😊❤

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  11. Sai,maa inti property ki equal justice cheyandi, please sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo