సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 792వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

    1. కరోనా లక్షణాలున్న నన్ను కాపాడారు బాబా
    2. కష్టసమయంలో ఎప్పుడూ తోడుగా నిలిచే బాబా
    3. ధైర్యాన్ని ప్రసాదించిన బాబా

కరోనా లక్షణాలున్న నన్ను కాపాడారు బాబా


ముందుగా సాయి కుటుంబానికి నా నమస్కారాలు. నాపేరు లలిత.  నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈమధ్యకాలంలో నాకు జ్వరం వచ్చింది. జ్వరంతో పాటు వాసన, రుచి కూడా తెలియకపోవడంతో నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే, ఆ లక్షణాలన్నీ కరోనాకు సంబంధించినవే. అందువలన నాకు చాలా ఆందోళనగా అనిపించి ఏం చేయడానికీ పాలుపోలేదు. కానీ బాబా ఉన్నారనే ధైర్యంతో ఆయనకు నమస్కరించుకుని, "ఈ సమస్యని నువ్వే తీసేయాలి బాబా" అని ప్రార్థించాను. తరువాత బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని మూడు రోజుల పాటు ఉదయమొకసారి, రాత్రి ఒకసారి త్రాగాను. బాబా దయ చూపించారు. ఇప్పుడు నాకు వాసన, రుచి తెలుస్తున్నాయి. నా సమస్యను తీర్చి నన్ను కాపాడారు బాబా. "ధన్యవాదాలు బాబా. ఇంకా నాకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి, అవి కూడా మీరే తీర్చాలి బాబా! ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి బాబా! కరోనా బారినుండి అందరినీ కాపాడండి బాబా".


మరో అనుభవం: ఈమధ్య నా గొంతు దగ్గర దద్దురు వచ్చి, రెండురోజులైనా తగ్గలేదు. అప్పుడు నేను బాబాకు నా సమస్య చెప్పుకొని, "ఈ దద్దురు నయమైతే, నా అనుభవాన్ని మీ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. తరువాత కొద్దిగా బాబా ఊదీ తీసుకొని ఆ దద్దురుపై రాసి, మరికొంత ఊదీని నీటిలో కలుపుకొని త్రాగాను. బాబా దయవల్ల రెండురోజుల్లో దద్దురు పోయింది. "బాబా! ఎప్పుడూ నాతోనే ఉండి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ".

కష్టసమయంలో ఎప్పుడూ తోడుగా నిలిచే బాబా


సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా అభినందనలు. నేను ఒక సాయి భక్తురాలిని. మా జీవితంలో బాబా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్నారు. చిన్నతనంనుండి నేను, మా చెల్లెలు బాబా భక్తులం. మాకు కష్టసమయంలో బాబా ఎప్పుడూ తోడుగా నిలిచారు. ఈమధ్యనే మా చెల్లెలు తన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితోనూ పంచుకుంది. ఇటీవల మా పాపకి చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది. మా చెల్లెలి అనుభవం వినగానే, నేను కూడా బాబాకు నమస్కరించుకుని, ‘పాపకు వచ్చిన సమస్య తగ్గితే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను’ అని అనుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు ఆ సమస్య తగ్గి మా పాప చాలా ఆరోగ్యంగా ఉంది. 


మరో అనుభవం: కొద్ది రోజుల క్రితం నేను ఒళ్ళునొప్పుల వంటి కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడ్డాను. ర్యాపిడ్ టెస్టులో నాకు నెగిటివ్ వచ్చినప్పటికీ లక్షణాలు మాత్రం తగ్గలేదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, ‘రాబోయే గురువారానికల్లా నా ఆరోగ్యం మెరుగుపడేలా అనుగ్రహించమ’ని ప్రార్థించాను. బాబా దయవల్ల ఏ మందులూ వాడకుండానే నొప్పులు తగ్గిపోయాయి. 


మరొక అనుభవం: మా అబ్బాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫైనల్ పరీక్షల తేదీ ఖరారైంది. అయితే, కరోనా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మా అబ్బాయిని పరీక్షలకు పంపాలంటే ఎంతో ఆందోళన చెంది మేమంతా బాబాను ప్రార్థించాము. బాబా దయవల్ల పరీక్షలు వాయిదా వేశారు.

 

బాబా దయవల్ల ఇటువంటి అనుభవాలు మా కుటుంబంలో ఎన్నో ఉన్నాయి. తెలిసీ తెలియక మా కుటుంబసభ్యులు చేసిన తప్పులను క్షమించి అందరినీ సరైన మార్గంలో నడిపించమని బాబాను ప్రార్థిస్తున్నాను.


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ధైర్యాన్ని ప్రసాదించిన బాబా


హైదరాబాద్ నుండి సాయిభక్తురాలు శ్రీమతి మాధవీరెడ్డి తనకు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


ప్రియమైన సాయిబంధువులు, వాళ్ళ కుటుంబీకులు బాబా దయవలన క్షేమమని తలుస్తాను. నా పేరు మాధవీరెడ్డి. నేను మరోసారి నా అనుభవాలను పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల కారణంగా నేను చాలా ఒత్తిడికి గురవుతున్నాను. సన్నిహిత కుటుంబసభ్యులందరికీ కోవిడ్ పాజిటివ్ అన్న వార్తలు నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరోజు నేను బాబాను తలచుకుని, కొంత ఊదీ తీసుకుని, "నాకు ధైర్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమ"ని వేడుకుని నుదుటిపై పెట్టుకున్నాను. బాబా ఎంత దయగలవారంటే, మరుసటిరోజు ఉదయానికి నాకు చాలా మెరుగ్గా అనిపించింది. వెంటనే నేను నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. "ధన్యవాదాలు బాబా. నా కుటుంబసభ్యులను ఆశీర్వదించి, కరోనా నుండి వాళ్ళని రక్షించండి. ఇంకా మీ భక్తులమైన మా అందరినీ ఆశీర్వదించండి బాబా".


మరో అనుభవం: దాదాపు ఏప్రిల్ నెల అంతా మా అమ్మానాన్నలకు, అన్నదమ్ములకు, వాళ్ళ కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చి నిరంతరం చాలా ఒత్తిడితో నడిచింది. దానివలన నేను చాలా ఆందోళన, వ్యాకులతలకు లోనయ్యాను. ఆ సమయమంతా నేను, "బాబా! మీరు వాళ్లతో ఉండండి. వాళ్లందరినీ రక్షించండి" అని బాబాను ప్రార్థిస్తూ, అర్థిస్తూ గడిపాను. బాబా చాలా దయామయులు. ఆయన కృపతో వాళ్లలో కొంతమంది కొద్దిపాటి కోవిడ్ లక్షణాలతో, కొద్దిమంది అసలు లక్షణాలే లేకుండా మూడువారాల గృహనిర్బంధాన్ని పూర్తి చేశారు. "ఈ కష్టకాలంలో మాతో ఉండి, మా అందరినీ కాపాడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. నేను మీకు తగినంతగా కృతజ్ఞతలు చెప్పుకోలేను బాబా. ఈ కష్టకాలాన్ని అధిగమించేలా ప్రజలకు సహాయం చేయండి. బాధతో అల్లాడిపోతున్న ప్రజలందరి ప్రాణాలను కాపాడండి. కోవిడ్‌ను పూర్తిగా అంతమొందించండి. దయచేసి మా అందరినీ జాగ్రత్తగా చూసుకోండి బాబా".

13 comments:

  1. Very nice messages.all are feeling like that only.baba is saving everyone in this pandamic.udi is best medicine.our worries will be end with baba blessings.om sai ram. ఓ౦సా౦ుు రాము ��������������❤������

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. 🌷🌳🌺🙏OmSriSaiRam🌺🌳🌷

    ReplyDelete
  5. Om sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  6. Baba ee gadda ni tolginchu thandri

    ReplyDelete
  7. Baba santosh ki pain tagginchu thandri enka day shifts ravali thandri pleaseeee

    ReplyDelete
  8. Om Sai Ram Jai Sai Master🙏🙏🙏

    ReplyDelete
  9. Om Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏😊❤

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo