- ఎప్పుడూ మనతోటే ఉంటూ, మన ప్రతీ చర్యనూ గమనించే బాబా
- క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా
- నాతో ఉన్నానని మరోసారి నిరూపించిన బాబా
ఎప్పుడూ మనతోటే ఉంటూ, మన ప్రతీ చర్యనూ గమనించే బాబా
సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయిభక్తుల అనుభవాల ద్వారా ఎంతో ధైర్యాన్ని మరియు ‘ప్రతిచోటా బాబా ఉన్నార’న్న విశ్వాసాన్ని బాబా నా మనసులో నింపుతూ ఉన్నారు. ప్రతి ఒక్క అనుభవం మనకు బాబా పైన నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయి. నా పేరు విజయ. బాబా అంటే నాతోపాటు మావారికి, మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం. ముందుగా, నా వల్ల ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించమని బాబాను వేడుకుంటూ, బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటాను.
మొదటి అనుభవం:
2018లో మేము పూణేలో ఉండేవాళ్ళం. ఆ సంవత్సరం సాయిబాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాలకు వెళ్ళాలని ముందుగా అనుకోకపోయినప్పటికీ, ఆగష్టు 22 నా పుట్టినరోజని మావారు ఒకరోజు ముందు యథాలాపంగా నాతో, “రేపు నీ పుట్టినరోజు కదా, శిరిడీ వెళ్దామా?” అన్నారు. అందుకు నేను, “చూద్దాంలే, మీకు ఆఫీసులో పర్మిషన్ దొరకాలి కదా” అన్నాను. వెంటనే మావారు తన మేనేజరుని పర్మిషన్ అడగటం, మేనేజర్ ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. వెంటనే మావారు శిరిడీ వెళ్ళేందుకు క్యాబ్ మాట్లాడారు. పూణేలో ‘కాళికా డెయిరీ’ అని మంచి స్వీట్ షాప్ వుంది. బాబాకు సమర్పించడానికి ఆ షాపులో కోవా (పేడా) కొందామనుకుని, ఆ షాపుకి వెళ్ళి కోవాతో పాటు మోతీచూర్ లడ్డూ కూడా కొన్నాము. అవి కొనేటప్పుడు నా మనసులో, “బాబా! ఎప్పుడు మీకు నైవేద్యం సమర్పించడానికి స్వీట్ ప్యాకెట్ ఇచ్చినా, పూజారిగారు ఆ ప్యాకెట్టుని మీ పాదాలకు తాకించి తిరిగి మాకు ఇచ్చేస్తారు. మీరు ఒక్కటి కూడా తీసుకోరు” అని అనుకున్నాను. మరుసటిరోజు ఉదయం మేము శిరిడీ వెళ్ళాము. సమాధిమందిరానికి వెళ్ళి బాబాను కనులారా దర్శించుకున్నాము. నా పుట్టినరోజునాడు ఎంతో ప్రేమతో నాకు దర్శనాన్ని ప్రసాదించినందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తరువాత మేము తీసుకొచ్చిన నైవేద్యాన్ని బాబాకు సమర్పించుకున్నాము. ఎప్పటిలాగే పూజారిగారు స్వీట్ ప్యాకెట్లను బాబాకు తాకించి తిరిగి మాకు ఇచ్చేశారు. మరోసారి మనసారా బాబాకు నమస్కరించుకుని బయటకు వచ్చి గురుస్థాన్ దర్శించుకున్నాము.
గురుస్థాన్ ఎదురుగా ఒక ఆఫీస్ లాగా ఉంటుంది. సాధారణంగా అక్కడ చాలామంది భక్తులు కూర్చుంటుంటారు. మేము అక్కడ నిలుచుని ఉన్నాము. మావారు కొంచెం ప్రసాదం తీసుకుని, “మనం ముఖదర్శనానికి వెళదాము” అన్నారు. సరేనని ప్రసాదం తీసుకుంటూండగా ఒక పెద్దాయన నా భుజం మీద చేయివేసి, “ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను, ఒక పేడా ఇస్తారా?” అని అడిగారు. ‘తప్పకుండా’ అంటూ ఒక కోవా తీసి ఆయనకు ఇచ్చాము. ఒక క్షణం తరువాత మావారు “ఆయనకు లడ్డు కూడా ఇవ్వు” అన్నారు. సరే, లడ్డు ఇద్దామని వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పెద్దాయన కనిపించలేదు. అంతటా చూశాము, కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. అప్పుడు అర్థమైంది, ‘ఆయన ఇంకెవరో కాదు, మన బాబాగారే!’ అని ముందురోజు నేను స్వీట్ షాపు దగ్గర నా మనసులో అనుకున్నదానికి తామే స్వయంగా మా వద్దకు వచ్చి, అడిగి మరీ కోవా స్వీకరించారు బాబా. కోవా గురించి అనుకుంటే కోవా మాత్రమే అడిగి తీసుకున్నారు బాబా. ‘బాబా ఎప్పుడూ మనతోటే ఉంటారు, మన ప్రతీ చర్యనూ గమనిస్తారు’ అని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం మనకు ఏమి కావాలి?
మరో అనుభవం:
ఈ అనుభవం ఈమధ్యనే జరిగింది. మా అబ్బాయి వయసు 17 సంవత్సరాలు. ఇటీవల ఒకరోజు రాత్రి 8 గంటల సమయంలో ఉన్నట్టుండి ఆక్సీమీటర్ తెచ్చి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకున్నాడు. ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయిగానీ, క్రింద చూపిస్తున్న పల్స్ రేట్ చాలా తక్కువగా ఉంది. భయం వేసి మరలా చెక్ చేస్తే మరలా అలాగే వచ్చింది. దాంతో మాకు చాలా భయం వేసింది. అసలే ఇది బయటికి గానీ, హాస్పిటల్స్‌కి గానీ వెళ్లే సమయం కాదు. పైగా మేము ఈమధ్యనే హైదరాబాదుకి షిప్ట్ అయ్యాము. ఇక్కడ మాకు ఏమీ తెలియదు. నేను ఇంతకుముందు మన సాయి మహరాజ్ సన్నిధి గ్రూపులో, ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే మంత్రం పఠిస్తే బాబా దయవల్ల ఆరోగ్యం చేకూరుతుంద’ని సాయిభక్తులు పంచుకున్న అనుభవాలను నేను చదివాను. అందువల్ల నేను ‘ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అన్న మంత్రాన్ని పఠించుకుంటూ, పూణేలో డాక్టరుగా పనిచేస్తున్న మా ఫ్రెండుకి ఫోన్ చేస్తే తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వేరే డాక్టర్ ఫ్రెండుకి ఫోన్ చేస్తే తను, “ఏం భయంలేదు, నువ్వు వెంటనే మంచినీళ్ళలో గ్లూకోజ్ కలిపి మీ అబ్బాయికి ఇవ్వు. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు” అని చెప్పింది. అయితే నేను మాత్రం విడవకుండా బాబా మంత్రజపం చేస్తూనే వున్నాను. తరువాత మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! మాకు ఎందుకీ పరీక్ష? ప్లీజ్ బాబా, నా బిడ్డకి పల్స్ రేట్ నార్మల్ అవ్వాలి బాబా” అని అనుకొని, “బాబా! మీ దయవల్ల నా బిడ్డ పల్స్ రేట్ నార్మల్ అయ్యి వాడు పూర్తిగా కోలుకుంటే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. నేను వేడుకున్నట్లే బాబా దయతో మరునాటి ఉదయానికి మా అబ్బాయి నార్మల్ అయ్యాడు. వాడి పల్స్ రేట్ పెరిగింది. ఇప్పుడు బాబా దయవల్ల మా అబ్బాయి పూర్తిగా కోలుకున్నాడు. “థాంక్యూ సో మచ్ బాబా. వియ్ లవ్ యు సో మచ్ బాబా. మాకు అన్నీ మీరే బాబా. మీరు ఎల్లప్పుడూ మాతోనే వుండాలి బాబా. ఈ కరోనా మహమ్మరి నుంచి అందరినీ కాపాడండి బాబా. అందరినీ చల్లగా చూడండి తండ్రీ. నేను ఏదైనా మరచిపోతే మీ బిడ్డననుకొని నన్ను క్షమించండి బాబా. నా తప్పులేమైనా ఉంటే నన్ను క్షమించండి. థాంక్యూ సో మచ్ బాబా!”.
క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా
ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత. నేను బెంగుళూరు నివాసిని. నేనొక చిన్న సాయిభక్తురాలిని. బాబా దయతో ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలు కొన్ని మీ అందరితో పంచుకున్నాను. నా గత అనుభవానికి కొనసాగింపుగా ఒక అనుభవాన్ని నేనిప్పుడు పంచుకుంటాను. మా పిల్లలకు వేసవి సెలవులిస్తూనే మా అమ్మావాళ్ల ఇంటికి వెళదామనుకున్న సమయానికి కరోనా కేసులు పెరుగుతుండటంతో వెళ్లాలా, వద్దా అన్న ఆలోచనలో పడ్డప్పటికీ బాబా మీద భారం వేసి బయలుదేరాము. బాబా మమ్మల్ని క్షేమంగా అమ్మ దగ్గరకు చేర్చారని గత అనుభవంలో మీతో పంచుకున్నాను. ఇప్పుడు తిరిగి బాబా మమ్మల్ని బెంగుళూరు చేర్చడం గురించి చెప్తాను.
మా అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళాక కరోనా కేసులు విపరీతంగా పెరగసాగాయి. ఒక వారం గడిచిన తర్వాత, 'నేను తిరిగి బెంగళూరు సురక్షితంగా చేరుకోగలనా, లేదా' అని భయపడ్డాను. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "నన్ను తిరిగి బెంగళూరుకి క్షేమంగా నువ్వే చేర్చాలి బాబా" అని వేడుకున్నాను. అంతలో నా భర్త, "బెంగళూరులో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి, లాక్‌డౌన్ పెడతారేమో!" అన్నారు. దాంతో నేను ఇంకా ఆందోళన చెందాను. లాక్‌డౌన్ పెడితే నేను అమ్మావాళ్లింట్లోనే ఉండిపోవలసి వస్తుంది. అక్కడ మా ఇంట్లో అత్తయ్య, మామయ్య, నా భర్త ఉంటారు. లాక్‌డౌన్ వల్ల పనివాళ్లు కూడా రారు. అత్తయ్య ఒక్కరే పనులన్నీ చేసుకోవడం ఆమెకు కష్టమైపోతుందని నేను చాలా భయపడ్డాను. ఇంట్లో ఇల్లాలు లేకపోతే ఆ ఇంట్లో అందరికీ ఎంత ఇబ్బంది ఉంటుందో అందరికీ తెలిసిందే కదా! అందుచేత, "నన్ను మా ఇంటికి పంపమ"ని ప్రతిక్షణమూ బాబాను వేడుకోసాగాను. అందరూ ఈ సమయంలో ప్రయాణం సురక్షితం కాదని చెప్తున్నప్పటికీ నా మనసులో ఎలాగైనా వెళ్లాలని ఆరాటం. మన మనసుని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా బాబా మాత్రం తప్పక అర్థం చేసుకుంటారు. అదే విశ్వాసంతో నా భర్తకి ఫోన్ చేసి, "ఎప్పుడు లాక్‌డౌన్ మొదలవుతుందో తెలియదు. టిక్కెట్లు బుక్ చేయమ"ని చెప్పాను. ఆయన, 'సరేన'ని శుక్రవారానికి టికెట్లు బుక్ చేశారు. బాబా మీద భారం వేసి అందరూ వద్దంటున్నా వినకుండా పిల్లలతో నేను బెంగళూరుకి బయలుదేరాను. ప్రయాణమంతా బాబా నామస్మరణ చేశాను. బాబా దయవలన సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. తరువాత శని, ఆదివారాల్లో బెంగుళూరులో కర్ఫ్యూ పెట్టి, మంగళవారం నుంచి లాక్‌డౌన్ పెట్టారు. అలా లాక్‌డౌన్‌కి ముందే బాబా మమ్మల్ని మా ఇంటికి చేర్చారు. ఇలా బాబా మా అమ్మని చూసిన ఆనందాన్నీ ప్రసాదించారు, అలాగే మా ఇంట్లో నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేలా ఆశీర్వదించారు. బాబా చేసిన మేలుని తలచుకుని రోజూ ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానో నాకే తెలియదు. మేము క్షేమంగా మా ఇంటికి చేరుకుంటే నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చినట్లుగా నేనిప్పుడు మీతో పంచుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. నా ప్రార్థన ఒకటే బాబా, ప్రతిక్షణమూ నా మనసులో మీ నామస్మరణ చేసేలా ఆశీర్వదించండి. నా వల్ల ఎవరూ బాధపడకూడదు, ఎవరి వల్ల అయినా నేను బాధపడవలసి వస్తే, అది ఓర్చుకునే శక్తిని నాకు ఇవ్వండి".
నాతో ఉన్నానని మరోసారి నిరూపించిన బాబా
ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నా పేరు ప్రియాంక. మరోసారి నా అనుభవాన్ని మీ అందరితో పంచుకునే అవకాశమిచ్చిన బాబాకు నా నమస్కారాలు. ఈమధ్య హఠాత్తుగా మా నాన్నకి, అక్క, బావలకి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రక్తపరీక్షలు చేశాక రిపోర్టుల ఆధారంగా అక్క, బావలకి కోవిడ్ లక్షణాలు కొద్దిగా ఉన్నాయని, నాన్నకి మాత్రం ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయిందని చెప్పారు. అది తెలిసి నేను చాలా కంగారుపడి బాబాను తలచుకుని, "మీరే ఎలాగైనా వాళ్ళ ముగ్గురికీ నయం చేయాలి బాబా" అని వేడుకున్నాను. బాబా తప్పకుండా మా వాళ్ళను కాపాడతారని ఆయనపై పూర్తి నమ్మకం ఉంచాను. బాబా దయవల్ల క్వారంటైన్ తర్వాత ముగ్గురికీ నెగిటివ్ వచ్చింది. అది తెలిసిన వెంటనే నేను బాబాకు నమస్కారాలు చెప్పుకున్నాను. ఆశ్రయించినంతనే నాతో ఉన్నానని మరోసారి నిరూపించారు బాబా. "ధన్యవాదాలు బాబా".
Sairam
ReplyDeleteBaba corona nuchi nanu kapadu
ReplyDeleteOm sai,sri Shai,Jaya Jaya sai
ReplyDeleteOm Sri Sai Ram ��������
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai ��������
ReplyDeletejai sairam
ReplyDeletejai sairam
jai sairam
ఓం సాయిరాం!
ReplyDeleteOm sairam
ReplyDeletesai always be with me
756 days
ReplyDeletesairam
జీవితంలో ఎందరో వస్తారు, పోతారు, బాబా మాత్రం ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టరు
ReplyDelete🌺🙏🙏🙏OM SRI SAIRAM🙏🙏🙏🌺
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni tondarga karginchu thandri sainatha
ReplyDeleteBaba santosh ki day shifts ravali salary hike kavali thandri
ReplyDelete