సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 795వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా దయవల్ల నెరవేరిన చిరు సమస్యలు
  2. ట్రైన్ అందుకునేలా - ఆరోగ్యం చేకూరేలా అనుగ్రహించిన బాబా
  3. సాయి చల్లనిచూపు

బాబా దయవల్ల నెరవేరిన చిరు సమస్యలు


నేను సాయి భక్తురాలిని. సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఇంతకుముందు ఈ బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను.


మొదటి అనుభవం:


ఒకరోజు మా బాబు మొబైల్ ఫోన్ ఛార్జర్‌తో ఆడుకున్నాడు. కాసేపటి తర్వాత నేను మొబైల్ ఛార్జింగ్ పెడితే, మొబైల్ ఛార్జ్ కాలేదు. కొత్త మొబైల్ ఛార్జింగ్ కాకపోవడంతో నాకు కాస్త కంగారుగా అనిపించింది. సరిగ్గా అప్పుడే, 'ఎలక్ట్రానిక్ పరికరాలకి ఊదీ పెడితే అవి పనిచేస్తాయ'ని నాకు గుర్తుకొచ్చింది. వెంటనే నేను ఛార్జర్‌కి ఊదీ పెట్టి, మళ్ళీ ప్రయత్నించాను. బాబా దయవలన ఛార్జర్ పనిచేసింది. "థాంక్యూ బాబా!"


రెండవ అనుభవం:


ఒకసారి నా భర్త భాష నేర్చుకునే కోర్సులో చేరారు. కోర్స్ పూర్తయిన తరువాత పరీక్ష వ్రాయడానికి ఆయన రెండురోజుల పాటు బయటకు వెళ్ళవలసి వచ్చింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయటకు వెళ్లడమంటే చాలా భయం వేసింది. కానీ తప్పదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! నా భర్తకి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి. అలాగే ఆయన పరీక్షలో ఉత్తీర్ణుడవ్వాలి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా కృపవలన నా భర్త ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. అలాగే, తనకు ఎటువంటి సమస్యలూ ఎదురుకాలేదు. "థాంక్యూ బాబా!"


మూడవ అనుభవం:


ఇటీవల మా అమ్మకి ఒంటినొప్పులు వచ్చాయి. ఈ కరోనా కాలంలో ఒంటినొప్పులు అనేసరికి చాలా భయం వేసింది. దాంతో నేను, "బాబా! అమ్మకి ఒంటినొప్పులు తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఒక్కరోజులో అమ్మకి నొప్పులు తగ్గిపోయాయి. "థాంక్యూ బాబా!"


నాల్గవ అనుభవం:

ఒకరోజు మావారికి జలుబు చేసింది. మాకొక చిన్నబాబు ఉన్నందున చాలా భయమేసి బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఒక్కరోజులో మావారి జలుబు తగ్గింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్. మేమెప్పుడూ మీకు ఋణపడివుంటాం బాబా".

ట్రైన్ అందుకునేలా - ఆరోగ్యం చేకూరేలా అనుగ్రహించిన బాబా


సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యావాదాలు. రోజూ ఈ బ్లాగులో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటే బాబా నాకు బాగా దగ్గరవుతున్నారు. నా పేరు నవీన్. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


మొదటి అనుభవం: నేను ఈమధ్య ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊరికి వెళ్ళడం కోసం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఆ ట్రైన్ ఎక్కాలంటే మా ఊరి నుంచి దగ్గరలోని సిటీకి రావాలి. ప్రయాణంరోజున నేను ట్రైన్ రావటానికి ఒక గంట ముందే ఇంటి నుంచి బయలుదేరాను. కానీ కాసేపటి తరువాత ఆన్లైన్లో ట్రైన్ ట్రాకింగ్ చూస్తే, నేను ఎక్కవలసిన స్టేషనుకి కేవలం 20 నిమిషాల దూరంలోనే ట్రైన్ ఉన్నట్లు కనిపించింది. మధ్యలో ట్రైన్ ఆగే స్టేషన్లు కూడా ఏమీలేవు. స్టేషనుకి వెళ్ళడానికి నాకు కనీసం 40 నిమిషాలు పడుతుంది. అప్పుడు నేను బాబాను తలచుకుని, “బాబా! నేను ట్రైన్ మిస్ అవకూడదు” అని వేడుకున్నాను. బాబాను అలా వేడుకున్నప్పటినుంచి దారిలో ఆటోల మీద, లారీ మీద ఫోటోల రూపంలో బాబా నాకు చాలాసార్లు దర్శనమిచ్చారు. అలా కొంతసేపు గడిచాక ట్రాకింగ్‌లో చూస్తే ట్రైన్ మధ్యలో ఆగిపోయినట్లు కనిపించింది. తరువాత అనుకున్న సమయానికి నేను రైల్వేస్టేషన్ చేరుకున్నాను. నేను చేరుకున్న 10 నిమిషాల తరువాత ట్రైన్ వచ్చింది. ‘బాబానే నాకోసం ట్రైన్‌ని ఆలస్యంగా వచ్చేలా చేశార’ని ఎంతో ఆనందిస్తూ బాబాకు మనసారా ధన్యవాదాలు చెప్పుకుని ట్రైన్ ఎక్కాను. బాబా దయవల్ల నేను చాలా క్షేమంగా ఊరికి చేరుకున్నాను.


రెండవ అనుభవం: నేను ఊరికి వచ్చిన రెండు రోజుల తరువాత నాకు బాగా జలుబు చేసి దగ్గు రావటం మొదలైంది. అలా నాలుగు రోజుల పాటు కొనసాగింది. నేను ప్రతిరోజూ పడుకునేముందు బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగేవాడిని. మా నాన్నావాళ్ళకి భయం వేసి కోవిడ్ టెస్ట్ చేయిద్దామన్నారు. దాంతో నేను భయపడి, “బాబా! బయట పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. అందువల్ల నాకు రేపటికల్లా ఈ జలుబు, దగ్గు తగ్గిపోయేలా అనుగ్రహించండి” అని బాబాను ప్రార్థించి, సాయి నామస్మరణ చేసుకుంటూ పడుకున్నాను. బాబా దయవల్ల ఉదయం నిద్రలేచేసరికి జలుబు, దగ్గు కొంచెం తగ్గాయి. మరుసటిరోజుకి పూర్తిగా తగ్గిపోయాయి. “బాబా! మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు. ఇలానే మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉండండి. ఈ ప్రపంచానికి కరోనా నుంచి విముక్తిని ప్రసాదించండి బాబా”.


ఓం శ్రీ సాయినాథాయ నమః.


సాయి చల్లనిచూపు


ఈ బ్లాగును నిర్వహిస్తూ సాయిభక్తులు తమ అనుభవాలను పంచుకొని ఆనందాన్ని, ఆత్మతృప్తిని పొందే అవకాశం కల్పించిన బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీకాంత్. నేను ఇదివరకు ఒకసారి నా భార్యకు సయాటికా సమస్య ఉన్నప్పుడు బాబాకు నమస్కరించుకుని, ‘తన సయాటికా సమస్య పూర్తిగా తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నా భార్యకు సయాటికా నొప్పి 90% తగ్గింది. ఆ నొప్పి పూర్తిగా తగ్గాలని బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 


కొన్ని రోజుల క్రితం నాకు అనుకోకుండా మోకాలినొప్పి చాలా విపరీతంగా వచ్చింది. మేము ఉండేది మొదటి అంతస్తులో. కాబట్టి ప్రతి చిన్న పనికీ క్రిందికి దిగాల్సి వస్తుంది. మెట్లు దిగుతున్నప్పుడు నిజంగా నా బాధ చెప్పతరం కాదు. నొప్పి భరించలేక ఒకరోజు బాబాను మనసులో స్మరించుకుని, “బాబా! ఈ నొప్పి భరించలేకపోతున్నాను. దయచేసి ఈ నొప్పిని తగ్గించండి బాబా. నేను సచ్చరిత్ర పారాయణ చేస్తాను. పారాయణ పూర్తయ్యేసరికి మీ దయవల్ల నా మోకాలినొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకుని, సచ్చరిత్ర పారాయణ ప్రారంభించాను. నిజం! ఆ సాయి చల్లనిచూపు వల్ల పారాయణ పూర్తయ్యేసరికి మోకాలినొప్పి చాలావరకు తగ్గింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నొప్పి పూర్తిగా తగ్గేలా అనుగ్రహించమని ఆ సాయినాథునికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, మరొక్కసారి ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

7 comments:

  1. Om Sai baba your Leela’s are miracles.you blesses everyone in the world.no worry for anything.I love you Sai baba.I am your daughter.please bless my family.Om Sai baba 🙏🏽🙏🏽🙏🏽🌹👏🙌🧡

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  4. Sai ee gadda ni tolginchu thandri

    ReplyDelete
  5. Baba santosh ki day shifts ravali thandri please

    ReplyDelete
  6. Om Sai Ram .. Baba thandri na kopanni thagginchi manahssanthini prasadinchandi.. please baba. I'm reading sacharitra and I'm trying to do only good things.. Om Sai Ram 🕉🙏😊❤

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo