సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 794వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. అన్నీ తానై నడిపిస్తున్న బాబా
  2. ఇలా అడిగితే, అలా అనుగ్రహించే బాబా
  3. బాబా నా యందు ఉన్నారు

అన్నీ తానై నడిపిస్తున్న బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రేవతి. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, వారి బృందానికి నా కృతజ్ఞతలు. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోబోతున్నాను.


మొదటి అనుభవం: ఈమధ్య మా పాపకి రెండురోజులపాటు సరిగా విరోచనం కాలేదు. దాంతో నేను బాబాను ప్రార్థించాను. ఆయన కృపవలన పాపకి విరోచనమైతే అయ్యింది కానీ, తరువాత విపరీతమైన నొప్పి వలన పాప ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు మా అమ్మ పాపకి బాబా ఊదీ పెట్టి, మరికొంత ఊదీని నీళ్ళలో కలిపి త్రాగించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించింది. బాబా అనుగ్రహం వలన కొద్దిసేపట్లో పాపకి నొప్పి తగ్గి హాయిగా నిద్రపోయింది.


రెండవ అనుభవం: కొన్ని రోజుల క్రితం నా కుడికన్ను ఎర్రగా అయిపోయింది. కొన్ని రోజుల పాటు అలాగే ఉండేది. మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు నేను బాబాను, "వారం రోజుల్లో నా కంటి ఎరుపుదనం తగ్గి, సాధారణ స్థితికి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. బాబా దయవలన రెండు రోజుల్లోనే నా కన్ను సాధారణ స్థితికి వచ్చింది.


మూడవ అనుభవం: నేను గత పది సంవత్సరాలుగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాను. ప్రతిరోజూ పెంటోప్-40 టాబ్లెట్ వేసుకుంటాను. ఏ కారణం చేతనైనా రెండురోజులు టాబ్లెట్ వేసుకోకపోతే ఇక అంతే, విపరీతమైన నొప్పి వస్తుంది. ఇంజక్షన్, మందులు వేసుకున్నప్పటికీ వారం రోజుల వరకు నొప్పి తగ్గదు. నేను ఆయుర్వేద మందులు కూడా వాడాను. అయినా ప్రయోజనం లేకపోయింది. గ్యాస్ట్రిక్ సమస్యకి సంబంధించి ఖచ్చితంగా నేను ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చేది. అటువంటి స్థితిలో ఒకరోజు ఈ బ్లాగులో 'ఊదీ నీళ్లు త్రాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య తగ్గింద'ని ఒక భక్తురాలు పంచుకున్న అనుభవాన్ని చదివాను. దాంతో నేను, "బాబా! ఈరోజు నుండి నేను టాబ్లెట్ వేసుకోవాలా, వద్దా?" అని బాబాను అడిగాను. "వద్దు" అని బాబా సమాధానం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! మీ మాట ప్రకారం ఈరోజు నుండి నేను గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వేసుకోవడం మానేస్తున్నాను. మీ దయవల్ల నా గ్యాస్ట్రిక్ సమస్య కనుక పూర్తిగా తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. ఇప్పటికి రెండు నెలలుగా నేను గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వేసుకోకుండా రోజూ ఊదీనీళ్లు మాత్రమే త్రాగుతున్నాను. ఇప్పుడు నా గ్యాస్ట్రిక్ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకపోయినా నొప్పి వచ్చే నాకు రెండు నెలలుగా నొప్పి రాలేదంటే ఇదంతా నా బాబా నాపై చూపిన దయ మాత్రమే! పది సంవత్సరాలుగా ఉన్న నా గ్యాస్ట్రిక్ సమస్యను బాబా తన ఊదీ మహిమతో తగ్గించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


నాలుగవ అనుభవం: 2021, మే 6 ఉదయం నా సెల్ ఫోను అనుకోకుండా చేయిజారి క్రిందపడిపోయింది. దాంతో ఫోన్ టచ్ పనిచేయలేదు. క్రొత్త ఫోన్ ఇలా అయ్యేసరికి నాకు చాలా బాధగా అనిపించి, "బాబా! ఏ మెకానిక్ వద్దకీ వెళ్ళకుండా నా ఫోన్ మామూలుగా పనిచేసినట్లయితే నా అనుభవాన్ని ఈరోజే బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా ఎంత అద్భుతం చేశారంటే, పది నిమిషాల్లో నా ఫోన్ పనిచేసింది.


ఇలా బాబా నా జీవితంలో ఎదురయ్యే చిన్న, పెద్ద సమస్యలను పరిష్కరిస్తూ నాకు అన్నీ తానై నడిపిస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీ కృప ఇలాగే మా అందరిపై ఉండాలి, ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను".


ఇలా అడిగితే, అలా అనుగ్రహించే బాబా

 

ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ముందుగా సాయిబాబాకు నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా అభినందనలు. నా పేరు సుమ. మా పిన్ని కొడుకు ఎంసీఏ పూర్తి చేశాడు. తనకి తండ్రి లేడు. సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. కాబట్టి మా పిన్ని తన కొడుకు ఉద్యోగ బాధ్యతను సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన నా భర్తకు అప్పగించింది. నా భర్త ఆ బాధ్యత తీసుకుని ఒక ఇంటెర్న్ జాబ్ కోసం ప్రయత్నించారు. అయితే ఎవరిని అడిగినా వాళ్ళ నుంచి స్పందన ఉండేది కాదు. అయినా నా భర్త తన ప్రయత్నాలు ఆపకుండా తన క్లయింట్ కంపెనీకి అప్లై చేశారు. అప్పుడు నేను, "ఆ కంపెనీలో నా సోదరుడికి ఇంటెర్న్ జాబ్ వస్తే, 'సాయి అనుభవమాలిక'లో నా అనుభవాన్ని పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా నా సోదరునిపై దయచూపారు. తనకు ఆ కంపెనీలో ఇంటెర్న్ జాబ్ వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా. మిమ్మల్ని ఇలా తలచుకోగానే అలా అనుగ్రహించి తండ్రిలేని తనకు మీరే తండ్రి అయ్యారు".


మరో అనుభవం: ఒకసారి మా నాన్నగారు కాలినొప్పి వలన సరిగా నడవలేకపోయారు. ఆయన పాదం వద్ద వాపు కనిపించింది. అసలు విషయమేంటంటే, అంతకుముందు ఆయన ఎక్కడో పడిపోవడం వలన కాలు వాచిందట. నిజానికి అది ఎప్పుడు జరిగిందో సరిగా తెలియదుగానీ నెలరోజుల తరువాత ఈ సమస్య వచ్చింది. ఆయన కాలికి కట్టు వేస్తారేమోనని మా అందరికీ భయం వేసింది. అప్పుడు నేను, "ఎటువంటి కట్టూ వేయకుండా అంతా మంచిగా ఉంటే, ఈ అనుభవాన్ని 'సాయిభక్తుల అనుభవమాలిక'లో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నాన్నకి ఏమీ కాలేదు. "థాంక్యూ సో మచ్ బాబా. మీరు లేకపోతే మేము లేము. మీరే మా గురువు, దైవము, అన్నీ".


బాబా నా యందు ఉన్నారు


నేను 40 సంవత్సరాల నుంచి బాబా భక్తురాలిని. నాకు ఏం జరిగినా నేను బాబాకే చెప్పుకుంటాను. బాబా భక్తురాలినైనందుకు ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ బ్లాగ్ ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ బ్లాగ్ ద్వారా నేను బాబాతో చాలా పంచుకోవాలి. గతనెలలో నాకు కొన్ని అనుభవాలు జరిగాయి. వాటిని ఇదివరకు బాబాతో పంచుకున్నాను. ఇప్పుడు 2021, మే 5న బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని పంచుకుంటాను. నా భర్త కూడా బాబా భక్తులు. ఆయన ఏ పని మొదలుపెట్టినా 'సాయిరామ్' అంటూ బాబాను తలచుకునేవారు. ఆయన నాకు దూరమై మూడేళ్లు అవుతోంది. అప్పటినుండి నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా బయటపడుతున్నాను. ఏవేవో ఆలోచనలతో నాకు రాత్రిళ్ళు నిద్రపట్టదు. బాబా భక్తురాలినైన నేను నా బాధంతా ఆయనకే చెప్పుకుంటూ ఉంటాను. 2021, మే 5 రాత్రి ఎందుకో చాలా డిప్రెషన్‌గా అనిపించి, "బాబా! నా భర్త కలలో అయినా నాకు కనిపించడం లేదు. ఎలాగైనా మీరు ఈ రాత్రి నాకు నా భర్తను చూపించాలి" అని ఆర్తితో బాబాను వేడుకున్నాను. మరునాడు ఉదయం 5.30కి బాబా నా భర్తను నాకు కలలో చూపించారు. బాబా నా యందు ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".


12 comments:

  1. Om sai ram udi miracles are very nice. Today is my brother death anniversary. I am feeling sad.he died in car accident.when he is going to siridi to have darshan of baba. Our bad luck.
    My mom also suffered very much.with udi any diseases can be cured. Om sai ram������ ❤❤❤❤

    ReplyDelete
  2. He is with baba only. My brother lost life.my duty is to read satchatritra.i am m. P.devotee.you take care of my family sai. ❤❤❤🧡💙💕💚🟢

    ReplyDelete
  3. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  4. Jai sairam. Please take care of my family and provide health and wealth.

    Jai sairam

    ReplyDelete
  5. Kothakonda SrinivasJune 3, 2021 at 9:58 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. Om sai ram baba amma arogyam bagundela chudu sai thandri please

    ReplyDelete
  8. Baba ee gadda ni tolginchu thandri pleaseeee

    ReplyDelete
  9. Baba santosh ki day shifts ravali thandri pleaseeee

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo